For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెకండ్ మ్యారెజ్ లోనూ సక్సెస్ ఉందంటున్న టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులెవరో తెలుసా..

|

మన జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. మన దేశంలో ''షాదీ తో ఏక్ బార్ హై''( వివాహం అనేది ఒక్కసారి మాత్రమే జరుగుతుంది) అని చాలా మంది నమ్ముతారు. కానీ ప్రస్తుత జనరేషన్ అలా కాదు. అలాంటి ఆలోచనలకు పక్కన పెట్టేస్తోంది.

Second Marriages

కొందరు భాగస్వామి మరణం కావచ్చు, గొడవలు, అనుకూలత, అవిశ్వాసం ఇతర కారణాల వల్ల రెండో వివాహానికి మొగ్గు చూపుతున్నారు. కానీ ఇంకొందరు తమకు ఇష్టమైన భాగస్వామి కోసం నిస్సందేహంగా, నిర్భయంగా రెండోసారి వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. తమ జీవితం చిక్కులో చిక్కుకోకుండా ముందుకు సాగాలని అనుకుంటున్నారు.

Second Marriages

అలాంటి వారిలో టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఎందరో ప్రముఖులు ముందంజలో ఉన్నారు. రెండో వివాహంలో ప్రేమ మరియు ఓదార్పు వంటివి కోరుకుంటున్నారు. ఏదైనా సంబంధం సహనం, సమయం, ప్రేమ మరియు నమ్మకం వంటివి కోరుతుంది. అందుకే రెండో వివాహం చేసుకోవడం అంత సులభం కాదు. అందులోనూ కొత్త బాధ్యతలుంటాయి.

Second Marriages

పిల్లలు మిమ్మల్ని వారి తల్లిదండ్రులుగా అంగీకరించడానికి సమయం పడుతుంది. కానీ మీ రెండో వివాహంలోనూ మీరు మరింత ఆనందంగా, అద్భుతంగా జీవించేందుకు ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇప్పటికీ మీకు రెండో వివాహం గురించి అనుమానాలుంటే ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవండి. టాలీవుడ్ లో పవన్ కళ్యాన్, నాగార్జున నుండి బాలీవుడ్ లో సైఫ్ అలీఖాన్, అమీర్ ఖాన్ వరకు రెండుసార్లు పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా జీవిస్తున్న వారెవరో చూడండి.

వెళ్ళనివ్వడం నేర్చుకోండి..

వెళ్ళనివ్వడం నేర్చుకోండి..

మీ గతం మీ ప్రస్తుత సంబంధాన్ని ప్రభావితం చేయకూడదు. మీ వర్తమానం అనేది ఒక గిఫ్ట్. అందుకే దీనిని గిఫ్ట్ కూడా అంటారు. మీ గతం గురించి ఆలోచించడం మానేయండి. మీ వర్తమానంపైనే దృష్టి పెట్టండి. మీ భవిష్యత్తు తనను తాను చూసుకుంటుంది. ఇంతకు ముందు జరిగిన వివాహం యొక్క సామగ్రిని గతంలోనే ఉండనవివ్వండి. మీకు గతంలో కొన్ని మంచి జ్ఞాపకాలు కచ్చితంగా ఉండే ఉంటాయి. వాటిని గౌరవించండి. కానీ ముందుకు సాగండి. పగ, కక్ష వంటివి పెంచుకుంటే మీ సమయం తప్ప వృథా అవ్వడం తప్ప ఇంకేమీ ఉండదు. వర్తమానంలో గతాన్ని లాగడం మీ కొత్త వివాహ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే మీరు మీ గతంలో తప్పుల నుండి కొన్ని పాఠాలను నేర్చుకోవచ్చు. అవి రిపీట్ కాకుండా చసుకోండి.

కొంత సమయం పడుతుంది..

కొంత సమయం పడుతుంది..

పిల్లలు వారి జీవ సంబంధమైన తల్లిదండ్రుల స్థానంలో వేరొకరిని అంగీకరించడానికి కష్టంగా భావిస్తారు. కానీ కాలంతో పాటు పరిస్థితులు మంచిగా మారవచ్చు. తల్లిదండ్రులలో ఎవరైనా తిరిగి వివాహం చేసుకున్నప్పుడు, కొత్త మార్పు కాబట్టి వారు తగ్గేందుకు కొంత సమయం పడుతుంది. అదే సమయంలో మీరు వారి అజ్ఞానాన్ని, కోపాన్ని ఎదుర్కోవచ్చు. కానీ, చివరికి వారు మిమ్మల్ని ఒక వ్యక్తిగా గౌరవిస్తారు. కాలక్రమేణా నెమ్మదిగా బంధాలు కలిసిపోతాయి. ఇందుకు బెస్ట్ ఉదాహరణగా టాలీవుడ్ మన్మథుడు నాగార్జుననే చూడొచ్చు. ఆయన అమలను రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ మొదటి భార్య కూతురు నాగచైతన్యతో కలిసి ఆరోగ్యకరమైన సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

గౌరవం, సహనం అవసరం..

గౌరవం, సహనం అవసరం..

మీరు మధ్యతరగతి కుటుంబంలో ఉంటే మీకు చాలా సహనం అవసరం. కొత్త వాతావరణంలో ఉన్నందున మీరు చాలా ఓపికగా ఉండాలి. మీ కొత్త భాగస్వామి కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలను మీరు ఎప్పుడైనా మాట్లాడొచ్చు. మీరు మీ భాగస్వామి ప్రయత్నాన్ని కూడా గౌరవించాలి. ‘‘హే నా కుటుంబానికి ఇంత అద్భుతమైన విందు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. నేను మీ గురించి నిజంగా చాలా గర్వపడుతున్నాను‘‘ అని చెప్పడం ద్వారా మీరు మీ భాగస్వామిని అభినందించవచ్చు.

అదే తప్పులను చేయకండి.

అదే తప్పులను చేయకండి.

మీ మొదటి వివాహం విచ్ఛిన్నం అయ్యేందుకు గల కారణాలు తెలుసుకోవాలి. అలాంటి తప్పులను మళ్లీ చేయకుండా మీరే జాగ్రత్త వహించాలి. మీరు కోపంగా లేదా చిన్న విషయాలపై స్పందిస్తున్నారని భావిస్తే, వాటిని నివారించడానికి ప్రయత్నించాలి. ఆర్డర్ వేయడానికి బదులుగా మర్యాదపూర్వకంగా అభ్యర్థనలు చేయొచ్చు.

మాట్లాడుకోండి.. అనుమానాలను తొలగించుకోండి..

మాట్లాడుకోండి.. అనుమానాలను తొలగించుకోండి..

ప్రతి సంబంధంలోనూ అపార్థాలు, అనుమానాలు సహజమే. మీ తలలోనే సందేహాలను పెట్టుకోకండి. మీరు అపార్థం చేసుకున్న దాని గురించి మీ భాగస్వామితో మాట్లాడండి. మీ వివాహ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

కొత్త వాతావరణాన్ని అంగీకరించండి..

మీ మొదటి వివాహం నుండి బయటపడినంత మాత్రాన మీ పాత జ్ఞాపకాలను తొలగించలేరు, కాబట్టి మీరే వాటిని సానుకూల రీతిలో ఛానెల్ చేయడానికి ప్రయత్నించవచ్చు. మీరు రెండో వివాహ ప్రయాణంలో ఉన్నారని గుర్తించండి. మీరు కొత్త వాతావరణానికి అనుగుణంగా ఉండండి. మీ చుట్టుపక్కల వారు మిమ్మల్ని గౌరవిస్తున్నారని నిర్ధారించుకోండి. ఇది మీ వివాహ జీవితాన్ని ఆనందంగా ఉంచుతుంది.

సమయం ఇవ్వాలి..

మీరు మీ భాగస్వామి సర్దుకునేందుకు సమయం ఇవ్వాలి. రిలేషన్ షిప్ అంటే రెడీమేడ్ కాదు. దీనికి ప్రయత్నం, ప్రేమ మరియు సంరక్షణ అవసరం. మీరు మీ జీవిత భాగస్వామితో సర్దుకునేందుకు సమయం పడుతుంది. కొన్నిసార్లు మీరు ఇరుక్కుపోయినట్లు కూడా అనిపించవచ్చు.

టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రెటీలే ఉదాహరణ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ని రెండో పెళ్లి చేసుకుని సక్సెస్ ఫుల్ లైఫ్ ను లీడ్ చేశారు. ప్రస్తుతం ఆమెతో విడిపోయారనుకోండి అదే వేరే విషయం. ఆమెతో ఉన్నన్ని రోజులు సంతోషంగానే గడిపారు. అలాగే మెగాస్టార్ కూతురు శ్రీజ కూడా రెండో వివాహాన్ని అత్యంత ఘనంగా చేసుకుంది. తన సెకండ్ ఇన్సింగ్స్ ను సాఫీగా కొనసాగిస్తుంది. ప్రముఖ నటులు సూపర్ స్టార్ క్రిష్ణా, ప్రకాష్ రాజ్, శరత్ బాబు, యాంకర్ ఝాన్సీ వంటివారెందరో ఉన్నారు. ఇక బాలీవుడ్ విషయానికొస్తే సైఫ్ అలీఖాన్ నుండి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ వరకు అందరూ రెండో పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు.

సో మీరు కూడా రెండో పెళ్లి అనేది తప్పు అనే భావనలో ఉంటే వెంటనే దాని నుండి బయటపడండి. రెండో పెళ్లి చేసుకున్న వారిని గౌరవించండి.

English summary

Saif Ali Khan To Aamir Khan, Bollywood Celebs In Successful Second Marriages

From Tollywood to Bollywood, many celebrities are at the forefront. Wanting love and comfort in a second marriage. Any relationship requires patience, time, love and trust. That is why marrying a second is not easy. There are new responsibilities. Children take time to accept you as their parents. But there are many things you can do to live happily and wonderfully in your second marriage.
Story first published: Saturday, September 14, 2019, 18:45 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more