For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రంగమ్మత్త ప్రేమ పెళ్లి జరిగి పదేళ్లు పూర్తయ్యిందట... అయినా ఏ మాత్రం జోరు తగ్గని అనసూయ...

|

యాంకర్ అనసూయ రీల్ లైఫ్ లో ఫేమస్ అయ్యిందో అందరికీ తెలుసు. యాంకర్ సుమ తర్వాత అనసూయనే ప్రేక్షకులు ఎక్కువగా మెచ్చుకున్నారు.

అయితే తన రియల్ లైఫ్ లో మాత్రం చాలా కష్టాలు ఎదుర్కొందట. ముఖ్యంగా తన ప్రేమ వివాహం కోసం వారి కుటుంబ సభ్యులను ఒప్పించేందుకు దాదాపు తొమ్మిదేళ్లు పట్టిందట. కొన్నిసార్లు ఆమెకు ఓపిక నశించి.. భరద్వాజ్ తో మనం ఇద్దరం కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్లిపోదాం అని కూడా చెప్పిందంట.

అయితే భరద్వాజ్ మాత్రం అందుకు ఒప్పుకోలేదట. పెద్దలందరినీ ఒప్పించి వారి ఆశీస్సులతోనే మనం పెళ్లి చేసుకుందాం అని తనకు నచ్చజెప్పేవాడట. ఇదిలా ఉంటే ఇప్పటివరకు, ఆమె అందమైన ప్రేమ కథ గురించి చాలా మందికి తెలీదు. అతికొద్ది మందికే తెలుసు.

ఈ సందర్భంగా రంగమ్మత్త(అనసూయ) ప్రేమ గురించి ఏమి తెలియని వారి కోసమే ఈ ప్రేమ కథను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రస్తుత యువతకు వీరి ప్రేమ ఒక ప్రేరణగా ఉంటుందని కచ్చితంగా చెప్పొచ్చు.

వాలెంటైన్స్ డే స్పెషల్ : వీరి ప్రేమ కథ వింటే... అసాధ్యమనేది అస్సలు ఉండదనిపిస్తుంది...

ఇంటర్మీడియట్ లోనే..

ఇంటర్మీడియట్ లోనే..

అనసూయ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న సమయంలో ఎన్ సిసి క్యాంపుకు వెళ్లిందట. ఆ క్యాంపులో ఆమె గ్రూప్ కమాండర్ గా ఉండేదట. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ఆమె వారికి అక్కడే శిక్షలు కూడా వేసేదట. అదే సమయంలో ఆ క్యాంపుకు మరో విద్యార్థి (హీరో) భరద్వాజ్ ఎంట్రీ ఇచ్చాడట.

తొలి చూపులోనే..

తొలి చూపులోనే..

అక్కడికి వెళ్లిన భరద్వాజ్ అనసూయను తొలిసారిగా చూసిన వెంటనే తన మనసును పారేసుకున్నాడట. అంతే అనుకున్నదే తడవుగా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అనసూయ దగ్గరకు వెళ్లి తన మనసులోని మాట చెప్పేశాడట. అంతే కాదు తను ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటాను అని చెప్పాడట.

ఆశ్చర్యపోయిన అనసూయ..

ఆశ్చర్యపోయిన అనసూయ..

ప్రేమంటే ఏమిటో తెలిసి తెలియని వయసులో భరద్వాజ్ అకస్మాత్తుగా అలా చెప్పేసరికి అనసూయ ఆశ్చర్యపోయిందట. అప్పుడు తనకు ఏమీ సమాధానం చెప్పకుండా మిన్నకుండి పోయిందట.తర్వాత క్యాంపు అయిపోవడంతో ఎవరి దారిన వారు వెళ్లిపోయారట.

PC : Insta

వాలెంటైన్స్ డే స్పెషల్ : ఈ చారిత్రక ప్రేమల గురించి ప్రతి ప్రేమికుడు తెలుసుకోవాలి...

తల్లికి తెలిసిన ప్రేమ..

తల్లికి తెలిసిన ప్రేమ..

ఆ తర్వాత ఏడాదిన్నర తర్వాత మళ్లీ వారిద్దరూ క్యాంపులో కలిసి మాట్లాడుకునే లోపే అనసూయకు భరద్వాజ్ పై పాజిటివ్ ఓపినీయన్ కలిగిందట.ఆ తర్వాత నెమ్మదిగా అనసూయకు అతనిపై ఇష్టం,ప్రేమ మొదలయ్యాయట. ఈ విషయం అప్పటివరకు కేవలం అనసూయ తల్లి మాత్రం తెలుసట.

PC : Insta

తండ్రి మాత్రం చాలా స్టిట్ అంట..

తండ్రి మాత్రం చాలా స్టిట్ అంట..

అనసూయకు ఇద్దరు చెల్లెళ్లు కూడా ఉండటంతో అనసూయకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే.. మిగతా వారికి కూడా మంచి సంబంధాలు వస్తాయనే అభిప్రాయంలో అనసూయ తండ్రి ఉండేవారట.

ఇంట్లో గొడవలు..

ఇంట్లో గొడవలు..

అయితే భరద్వాజ్ తో అనసూయ ప్రేమ కొనసాగుతన్న సమయంలో ఓ రోజు అనసూయకు ఇంట్లో వారు ఓ సంబంధం తీసుకువచ్చారట. అప్పుడే ఆమె తన ప్రేమ విషయం చెప్పిందంట. దీంతో వారి ఇంట్లో గొడవలు జరిాయట. ఆ తర్వాత ఆమె ఇంటి నుండి బయటకు వచ్చేసి.. కొన్నాళ్లు హస్టల్లో ఉందని.. తర్వాత ఆమెను ఇంట్లోకి రానిచ్చినా.. భరద్వాజ్ తో పెళ్లికి మాత్రం ఒప్పుకోలేదట.

PC : Insta

తనతోనే పెళ్లి..

తనతోనే పెళ్లి..

అనసూయ భరద్వాజ్ కోసం తన నిర్ణయాన్ని కరాఖండిగా చెప్పేసిందట. ‘‘మీరు నాకు నచ్చిన భరద్వాజ్ తో పెళ్లి చేసే వరకు నేను ఎక్కడికి వెళ్లాను‘‘ అంటూ మొండి పట్టుదలతో ఉండటంతో వారు ఏమి చేయలేకపోయారట.

PC : Insta

ప్రపోజ్ చేసిన కొన్నేళ్లకు..

ప్రపోజ్ చేసిన కొన్నేళ్లకు..

అలా అనసూయ, ఆమె తండ్రి మధ్య పెళ్లి విషయంపై సఖ్యత రావడానికి దాదాపు పదేళ్లు పట్టిందట. ఆ తర్వాతే వీరి పెళ్లికి ఆయన పచ్చజెండా ఊపారట.

PC : Insta

2010లో పెళ్లి..

2010లో పెళ్లి..

ఎట్టకేలకు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ లభించడంతో వీరి పెళ్లి 2010 ఫిబ్రవరి నెలలోనే అది కూడా వాలెంటైన్స్ నెలలోనే జరగడం విశేషం. ప్రస్తుతం వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 2020 సంవత్సరానికి వీరి పెళ్లి జరిగి దశాబ్ద కాలం పూర్తవుతోంది. ఈ సందర్భంగా ఈ ఆదర్శవంతమైసన ప్రేమ జంటకు మీరు కూడా శుభాకాంక్షలు చెప్పేయండి మరి..

English summary

Telugu Anchor Anasuya Bhardwaj shared her love story in instagram

Here we talking about anchor anasuya bhardwaj shared her love story in instagram. Read on