For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భర్తలు భార్యల నుండి రహస్యంగా ఏం కోరుకుంటారో తెలుసా...

|

భార్యభర్తల మధ్య సంబంధం అనేది 'ఫిష్ అండ్ వాటర్ లాగా ఉండాలని.. ఫిష్ అండ్ ఫిషర్ మెన్ లా' ఉండకూడదని ఓ సినీ రచయిత అన్నారు. ఆలుమగల మధ్య ప్రేమతో ముడిపడిన బంధం.. ప్రేమ ఉన్నంత కాలం వారి జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది.

ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు ప్రేమలో పడి వారి మధ్యలో అర్థం చేసుకునేతత్వం ఉంటే చాలాు.. వారి రిలేషన్ షిప్ ఎంతో హాయిగా.. ఆనందంగా కొనసాగుతుంది. ఇలాంటి వాటిలో రొమాన్స్ ముందువరుసలో ఉంటుందని చాలా మందికి తెలిసిన విషయమే.

ఏ జంట అయినా ఇలాంటివే ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. అయితే కొందరు మగవారు మాత్రం మహిళా భాగస్వాముల నుండి కొన్ని విషయాలను రహస్యంగా కోరుకుంటూ ఉంటారట.

ఇంతకీ పురుషులు తమ భార్యల నుండి ఎలాంటి వాటిని కోరుకుంటున్నారు... వారు తమ భార్యల నుండి ఏమి ఆశిస్తున్నారనే విషయాల గురించి కొందరు భర్తలను ప్రశ్నలడిగినప్పుడు వారు కొన్ని ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ రాశి స్త్రీలు బ్యాడ్ బాయ్స్ తోనే బాగా ఎంజాయ్ చేస్తారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...

టూర్ ప్లాన్ చేయడం..

టూర్ ప్లాన్ చేయడం..

సాధారణంగా భర్తలందరూ తమ భార్యలను ఏ వీకెండో లేదా ఏదైనా అకేషన్ కో బయటికి తీసుకెళ్తుంటారు. కొన్నిసార్లు కొత్త సినిమాలకు, మరికొన్నిసార్లు షాపింగుకు తీసుకెళ్లడం వంటివి చేస్తారు. ఇలాంటి సమయాల్లో భార్యలు తమ భర్తలతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతారు. అయితే అబ్బాయిలు ఏదైనా టూర్ ప్లాన్ చేయడం.. వారితో కలిసి డేట్ కు వెళ్లడం వంటి విషయాలను బాగా ఇష్టపడతారట. అలాగే వారిని ఎక్కువగా సర్ ప్రైజ్ చేసే విషయాలకు భర్తలకు బాగా ఇష్టమట. భార్యలను భర్తలు ఎలా బయటికి తీసుకెళ్తారో.. తమను కూడా అలాగే బయటకు తీసుకెళ్లి షాపింగ్ చేసిన తర్వాత.. ఆ బిల్లును వారే కడితే భర్తలు చాలా హ్యాపీగా పీలవుతారట.

సెల్ఫీలు దిగడం..

సెల్ఫీలు దిగడం..

ఈరోజుల్లో ఎక్కడికెళ్లినా.. ఏ చిన్న పని చేసినా.. ఎవరికైనా హెల్ప్ చేసినా.. ఏదైనా షాపింగ్ చేసినా.. సినిమాకు వెళ్లినా.. టూరిస్టు ప్లేసులకు వెళ్లినా.. నేచర్ తో కలిసి ఆనందిస్తున్నా.. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి.. రాత్రి పడుకునే వరకు ఎన్ని సెల్ఫీలు దిగుతామో లెక్కే లేదు. ఎందుకంటే ప్రస్తుతం చాలా మంది స్మార్ట్ ఫోన్లు చేతిలోకొచ్చేశాయి. అయితే కొందరు భర్తలు తాము తమ భార్య ఏదైనా పని చేస్తున్నప్పుడు వారితో కలిసి సెల్ఫీలు దిగడం మాకెంతో ఇష్టమని చెబుతున్నారు. సాధారణంగా ఆడవారికి ఫొటోలు దిగడమంటే చాలా ఇష్టం. అయితే ఇలా ఇద్దరు కలిసి ఫొటోలు దిగడం వల్ల వారిద్దరూ బాగా ఆనందిస్తారంట.

అందమైన పూలు..

అందమైన పూలు..

అందమైన అమ్మాయిలను ఆకట్టుకోవడానికి.. వారి నుండి బెస్ట్ ఇంప్రెషన్ కొట్టేయడానికి చాలా మంది మగవారు మంచి పువ్వులను బహుమతులుగా ఇస్తుంటారు. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలకు పువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి. అయితే పురుషులు కూడా పువ్వులను బాగానే ఇష్టపడతారట. వారి భార్యలు తమకు సందర్భాన్ని బట్టి పువ్వులను ఇస్తే వారు చాలా సంతోషంగా ఫీలవుతారంట. ఇదే విషయాన్ని కొందరు మాతో షేర్ చేసుకున్నారు.

సర్వే! ఒక అమ్మాయి కోసం ఎంతమంది అబ్బాయిలు పోటీ పడుతున్నారో తెలుసా...!

జుట్టును అలా తాకితే..

జుట్టును అలా తాకితే..

అమ్మాయిలు ఎవరైనా అబ్బాయలతో మాట్లాడేటప్పుడు జుట్టును అస్తమానం తిప్పుతూ ఉంటారు. అయితే ఇలా చేయడం వారికి చాలా చిన్న విషయంలాగా అనిపిస్తుంది. కానీ ఇలా చేస్తే చాలా మంది పురుషులకు వారి మీద ఇష్టం పెరుగుతుందట. అదే విధంగా తాము ఏదైనా ఒత్తిడిలో ఉన్నప్పుడు తమ భార్య ఒడిలో తల పెట్టుకుని నిద్రిస్తున్నప్పుడు తను నా జుట్టుపై వేళ్లు పెట్టి సుకుమారంగా తాకుతుంటే నాకు ఎంతో హాయిగా ఉంటుందని కొందరు చెబుతున్నారు.

ఎదురు రావడం..

ఎదురు రావడం..

నేను ప్రతిరోజూ ఎక్కడికైనా బయటకు వెళ్తున్న సమయంలో.. మరియు బయటి నుండి ఇంటికొచ్చినప్పుడు నా భార్య ఎదురొస్తే చాలా ఆనందం వేస్తుందని కొందరు భర్తలు చెబుతున్నారు. తాము ఆఫీసు నుండి ఎప్పుడెప్పుడు ఇంటికి చేరుకుంటామా అని ఎదురుచూసే భార్యలంటే భర్తలకు బాగా ఇష్టమట. తాము ఇంటి కాంపౌండ్లోకి ఎంట్రీ ఇవ్వగానే తమ కోసం వచ్చి డోర్ తీస్తే.. చాలా బాగుంటుందని చెప్పారు.

ఏదైనా సెలక్షన్ విషయంలో..

ఏదైనా సెలక్షన్ విషయంలో..

తనకు తమ నుండి ఏమి కావాలన్నా ఓపెన్ గా అడగడం.. ఉదాహరణకు ఏదైనా పండుగకు గాని.. లేదా ఏదైనా అకేషన్ కు ఏవైనా వస్తువులు లేదా డ్రస్సులు కావాలంటే వారు కనీసం పదింటిని చూసి తమకు ఏది సూటవుతుందో సెలెక్ట్ చేయడమంటే మాకిష్టమని కొందరు చెప్పారు.

పడకగదిలో మహిళలు ఈ విషయాల గురించి ఖచ్చితంగా పురుషులతో మాట్లాడకూడదు ... సమస్య ఉండదు!

డెసిషన్స్ విషయంలో..

డెసిషన్స్ విషయంలో..

సాధారణంగా మన దేశంలో ఇంట్లో ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే, అందులో మగవారే ముందుంటారు. ఆడవారికి అవకాశం చాలా తక్కువగా ఇస్తారు. స్త్రీలు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలన్నా పురుషులపైనే ఆధారపడతారు. అయితే కొందరు పురుషులు మాత్రం ఆడవారు నిర్ణయాలు తీసుకోవాలని.. అయితే వారు అవి తీసుకుంటూ తమతో బాధ్యతగా వ్యవహరిస్తే.. తామంతా చాలా ఆనందిస్తామని..దీని వల్ల మా లైఫ్ హ్యాపీ ఉంటుందని చెప్పారు.

ప్రశంసలు..

ప్రశంసలు..

సాధారణంగా అమ్మాయిలను అబ్బాయిలు ఎక్కువగా పెడుతుంటారు. ఎందుకంటే వారు వాటిని బాగా ఇష్టపడతారని తెలుసు. కానీ కొంతమంది మగవారు కూడా లేడీస్ మాదిరిగానే తాము కూడా ప్రశంసలను కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే అమ్మాయిలు కోరుకునేంత ఎక్కువగా కాకుండా కొంతమేరకు కోరుకుంటామని చెప్పారు. ముఖ్యంగా వారి పార్ట్ నర్స్ చిన్న చిన్న విషయాలకు కనీసం అభినందనలు తెలపాలని కోరుకుంటారట.

English summary

Things Men Want From Their Wives in telugu

Here are these things men want from their wives in telugu. Take a look