For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్తగా పెళ్లయిన మగాళ్లు ఈ చిట్కాలు పాటిస్తే పడకగదిలో మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు...!

ఈ చిట్కాలు పాటిస్తే కొత్త పెళ్లికొడుకు పడకగదిలో పార్ట్ నర్ తో రెచ్చిపోతారంట..

|

శృంగారం అంటే చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. చాలా మంది పురుషులు పెళ్లికి ముందు తాము పడకగదిలో పార్ట్ నర్ తో రతి మన్మథుడిలా రెచ్చిపోవాలని ఏవేవో ఊహించుకుంటూ ఉంటారు. తమ భాగస్వామితో ఎక్కువ సమయం కలయికలో పాల్గొనాలని.. తాము ఆ ఆనందాన్ని బాగా ఆస్వాదించాలని కోరుకుంటూ ఉంటారు.

Tips to improve your performance in bed for grooms in Telugu

ఇక కొత్తగా పెళ్లి అయిన మగాళ్లు తొలి మూడు రోజుల్లో మూడు రాత్రుల్లో తమ భాగస్వామికి తమ సామర్ఘ్యం ఏంటో చూపాలని తహతహలాడుతూ ఉంటారు. దీని కోసం కొందరు మార్కెట్లో లభించే మందులను వాడుతూ ఉంటారు. అయితే అలాంటి వాటి వల్ల ప్రయోజనం తాత్కాలికమేనని గుర్తుంచుకోవాలి.

Tips to improve your performance in bed for grooms in Telugu

అంతేకాదు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. మరి అలా జరగకుండా మీరు బెడ్ రూమ్ లో మీ పార్ట్ నర్ తో ఎంజాయ్ చేయాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

సర్వే! పడకగదిలో పార్ట్ నర్ పక్కనే ఉన్నా.. పురుషులు 'ఆ' కార్యంపై ఆసక్తి చూపలేదట...!సర్వే! పడకగదిలో పార్ట్ నర్ పక్కనే ఉన్నా.. పురుషులు 'ఆ' కార్యంపై ఆసక్తి చూపలేదట...!

పార్ట్ నర్ ను అట్రాక్ట్..

పార్ట్ నర్ ను అట్రాక్ట్..

ఆలుమగల సంబంధం యొక్క ప్రారంభ దశలో ఉండే ఉత్సాహం, కాలం మారుతున్న కొద్దీ తగ్గుతూ ఉంటుంది. అలాంటి సమయంలో మీలో ఏదో లోపం ఉందని సందేహపడే అవసరం లేదు. మీరు ఆ టైమ్ లో ఎలాంటి మందులు వాడనవసరం లేదు. మీరిద్దరూ కలయికలో కొంచెం కొత్తదనం తీసుకురావడానికి ప్రయత్నించాలి. మీరు మీ బిహేవియర్ తో కొంచెం కొత్తగా చేయొచ్చు.

అలా కనెక్ట్ అవ్వాలంటే..

అలా కనెక్ట్ అవ్వాలంటే..

చాలా మంది మగాళ్లు పెళ్లైన కొత్తలో, మీ పార్ట్ నర్ తో శారీరకంగా మాత్రమే ఎక్కువగా కలవాలని ఉత్సాహపడుతూ ఉంటారు. అయితే మీరు ఇక్కడే ఓ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీ భాగస్వామి ఆ స్థాయి మానసిక స్థితిలో లేకపోతే, వారిని ముందుగా ఆ కార్యానికి ప్రిపేర్ చేయడం మీ బాధ్యత అని గుర్తుంచుకోవాలి. ఇందుకోసం ఆమెతో ప్రేమగా మాట్లాడటం.. తనను పొగుడుతూ.. వారిని ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి.

మోహమాటం పక్కనపెట్టండి..

మోహమాటం పక్కనపెట్టండి..

చాలా మంది మగాళ్లు పెళ్లికి ముందు పడకగదిలో ఏవేవో చేయాలని ఊహించుకుంటూ ఉంటారు. అయితే అసలు ఘట్టం సమయంలో ఆడవారి కంటే ఎక్కువగా సిగ్గుపడుతూ ఉంటారు. అయితే ఆ సమయంలో మాత్రం మీరు అలాంటివి పక్కనపెట్టేయాలి. మీ ఇద్దరి మధ్య శారీరక స్పర్శ ఉన్నప్పుడు మాత్రమే మీరు సన్నిహితంగా ఉంటారు. ఇక బెడ్ పై చేరుకున్న తర్వాత సిగ్గు, బిడియం, భయం, అయిష్టత వంటి వాటిని పక్కనపెట్టేయాలి. ఇందుకోసం మీరు ముందే సిద్ధమవ్వాలి.

మగువల నుండి మగవారు ఎక్కువగా ‘అవే'ఆశిస్తున్నారంట...!మగువల నుండి మగవారు ఎక్కువగా ‘అవే'ఆశిస్తున్నారంట...!

హస్త ప్రయోగం..

హస్త ప్రయోగం..

బెడ్ రూమ్ మీ లైంగిక సామర్థ్యం సరిగా లేదనుకుంటే.. మీరు అప్పుడప్పుడు హస్త ప్రయోగం చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల మీరు కొన్ని సమస్యల నుండి బయటపడొచ్చు. ఎందుకంటే హస్త ప్రయోగం వల్ల దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇలా చేయడం వల్ల మీరు కలయికను ఆస్వాదించేందుకు అనుకూలంగా మారుతుంది.

మంచి ఆహారం..

మంచి ఆహారం..

మీరు లైంగికంగా పడకగదిలో రెచ్చిపోవాలంట.. మీరు ఫుడ్ పై ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మీరు మీ పడకగదిలో ఆరోగ్యకరమైన లైంగిక జీవితం గడపడానికి మీరు తీసుకునే ఆహారంలో తరచుగా పుచ్చకాయ, స్ట్రాబెర్రీ, బాదం, జీడిపప్పు, డార్క్ చాక్లెట్ మొదలైన వాటిని చేర్చాలి. వీటితో పాటు ఉల్లిపాయలు, వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవాలి. ఇవి మీ రక్తప్రసరణను బాగా మెరుగుపరుస్తాయి. అలాగే అరటి పండ్లు తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది.

చెడు అలవాట్లు వద్దు..

చెడు అలవాట్లు వద్దు..

మీకు పొగతాగడం వంటి అలవాట్లు ఉంటే వాటిని పక్కన పెట్టేయాలి. ఎందుకంటే ఇది పడకగదిలో మీ లైంగిక పనితీరును ప్రభావితం చేస్తుంది. మీరు ఎలాంటి మందులు వాడకుండా బెడ్ రూమ్ లో ఎంజాయ్ చేయాలంటే పొగతాగడం పక్కనబెట్టి.. ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంజాయ్ చేయాలి. అలాగే మద్యం తీసుకోవడంపై జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయంలో కొద్దిగా రెడ్ వైన్ తీసుకుంటే రక్తప్రసరణ మెరుగవుతుంది.

ఒత్తిడి తగ్గించుకుంటే..

ఒత్తిడి తగ్గించుకుంటే..

మీరు తొలిసారి కలయికలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపే సమయంలో కొంత ఒత్తిడి ఉంటుంది. దీని వల్ల మీ హెల్త్ పై నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అప్పుడు మీ లైంగిక కోరికలు తగ్గుతాయి. అదే సమయంలో గుండె కూడా వేగంగా కొట్టుకుంటుంది. బిపి కూడా వేగం పెంచుకుంటుంది. ఫలితంగా మీ లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది. ఇలా మీ మానసిక ఒత్తిడి కారణంగా అంగ స్తంభన సమస్యలు వస్తాయి. ఇలా జరగకుండా ఉండాలంటే మీరు రెగ్యులర్ గా వ్యాయామం చేస్తే ఒత్తిడిని జయించొచ్చు.

సూర్యుని వేడి..

సూర్యుని వేడి..

మీ శరీరానికి సూర్యరశ్మి తగిలేలా చూసుకోండి. ఎందుకంటే సూర్యుని వేడి మీ బాడిని తాకితే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఈ హార్మోన్ నిద్ర పట్టేలా చేస్తుంది. అదే విధంగా లైంగిక కోరికలను తగ్గిస్తుంది. అయితే మెలటోనిన్ తగ్గితే.. లైంగిక కోరికలు పెరుగుతాయి. ముఖ్యంగా చలికాలంలో శరీరం ఎక్కువగా మెలటోనిన్ ను ఉత్పత్తి చేస్తుంది. అందుకే మీ బాడీకి కొంచెం సూర్యుని వేడి తగిలేలా చేయాలి.

English summary

Tips to improve your performance in bed for grooms in Telugu

Here are the tips to improve your performance in bed for grooms in Telugu. Take a look
Story first published:Monday, January 4, 2021, 18:07 [IST]
Desktop Bottom Promotion