For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వామ్మో! పురుషాంగం ఊడిపోయిందని.. భార్య తనను వదిలేసిందట... కానీ దాన్ని చేతికి అమర్చారట..!

|

కొందరికి అంగం గురించి అప్పుడప్పుడు కొన్ని విచిత్ర సమస్యలు వస్తుంటాయి. అయితే అవన్నీ సాధారణ ఇన్ఫెక్షన్ వ్యాధులే అని, పెద్దగా భయపడాల్సిన పని లేదని వైద్యులు చాలా మందికి ధైర్యం చెబుతూ ఉంటారు.

అయితే ఓ వ్యక్తికి మాత్రం ఇన్ఫెక్షన్ కారణంగా అంగం ఊడిపోయిందట.. వినడానికి వింతగా ఉన్న ఇది పచ్చి నిజమండోయ్.. ఇప్పటికీ మీకు నమ్మకం కుదరకపోతే కింద వీడియో కూడా ఉంది.. అది చూశాక మీరు తప్పకుండా నమ్ముతారు.

అయితే అంగం ఊడిపోవడం ఒక ఎత్తు అయితే.. దాన్ని వైద్యులు ఎక్కడ అతని మోచేతికి అమర్చడం మరో ఎత్తు.. డాక్టర్లు ఇలా ఎందుకు చేశారో తెలియాలంటే మనం ఈ స్టోరీని పూర్తిగా చూడాల్సిందే...

మిరాకిల్ ! ఎవ్వరితో ఎలాంటి శారీరక సంబంధం లేకుండానే పండంటి పాపాయికి జన్మనిచ్చిన మహిళ...

పెరినియం ఇన్ఫెక్షన్..

పెరినియం ఇన్ఫెక్షన్..

ఇంగ్లాండ్ దేశానికి చెందిన మాల్కోలమ్ మెక్ డోనాల్డ్ 45 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తికి దీర్ఘకాలిక పెరినియం ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో అతని అంగం పూర్తిగా నల్లగా మారిపోయింది.

దాన్ని తొలగించారు..

దాన్ని తొలగించారు..

అతని ఇబ్బందిని చూడలేక వైద్యులు ఆ అంగాన్ని 2014లోనే పూర్తిగా తొలగించేశారు. అప్పటి నుండి అతను అంగం లేకుండానే జీవిస్తున్నాడు.

చేతిలో చేరిపోయింది..

చేతిలో చేరిపోయింది..

అయితే ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఊడిపోయిన అంగం ఇప్పుడు అతని చేతిలో చేరిపోయింది. నాలుగేళ్లుగా అతను దాన్ని అలా చేతిలో ఉంచుకునే తిరుగుతున్నాడు. వినడానికి వింతగా ఉన్నప్పటికీ ఇది పచ్చి నిజం.

తన ప్రేయసికి తానే స్వయంగా గుండు గీసిన ప్రియుడు... ఎందుకో తెలిస్తే కళ్లలో నీరు తిరుగుతాయి...!

భార్య కూడా వదిలేసింది..

భార్య కూడా వదిలేసింది..

ఈ విషయం తెలుసుకున్న తన భార్య అతడిని వదిలేసి వెళ్లిపోయింది. అంతేకాదు తనతో పాటు పిల్లలను కూడా తీసుకెళ్లిపోయింది. దీంతో అతను చాలా బాధపడ్డాడట.

అతడిలో ధైర్యాన్ని నింపారు..

అతడిలో ధైర్యాన్ని నింపారు..

అతను అలా బాధపడుతున్న సమయంలో తనకు ఊడిపోయిన అంగాన్ని మళ్లీ రప్పించవచ్చని వైద్యులు అతడికి తెలియజేశారు. ముందుగా అతనిలో ధైర్యం నింపారు.

ఆ చికిత్స చేస్తామన్నారు..

ఆ చికిత్స చేస్తామన్నారు..

లండన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డెవిడ్ రాల్ఫా అతనితో మాట్లాడారు. పురుషాంగం ఊడిపోతే మళ్లీ అతికించవచ్చని, ఇందుకు కష్టమైన చికిత్సను చేయాలని, ఎన్ఎహెచ్ఎఫ్ ఫండింగ్ కింద 50 వేల పౌండ్ల(భారత కరెన్సీ ప్రకారం అక్షరాల రూ.49 లక్షలు)తో ఈ ట్రీట్ మెంట్ చేస్తామని చెప్పారు.

నిద్రపోతున్నప్పుడు దుప్పటి వెలుపల ఒక కాలు మాత్రమే ఎందుకు ఉంటుందో మీకు తెలుసా?

అతను ఆశ్చర్యపోయాడు..

అతను ఆశ్చర్యపోయాడు..

ప్రొఫెసర్ రాల్ఫా చెప్పిన విధానం విని.. అతను ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతడు అమర్చే అంగాన్ని మరెక్కడి నుండో కాదు.. అతని చేతి చర్మం నుండే తయారు చేస్తామని చెప్పారు.. అది కూడా తన ఎడమ చేతికి దాన్ని అమర్చుతామని చెప్పారు.

అయిష్టంగానే అంగీకరించాడు..

అయిష్టంగానే అంగీకరించాడు..

సాధారణంగా అంగం అంటే కాళ్ల మధ్యలో ఉండాలి కదా అని మనకు సందేహం రావచ్చు. అయితే ఇలా ఎందుకంటే.. అది పూర్తిస్థాయి అంగంలా తయారు కావాలంటే.. ఈ విధానం పాటించాలంట.. దాదాపు రెండు సంవత్సరాల పాటు ఆ అంగం అతడి ఎడమ చేతిలో ఉంచాలని చెప్పడంతో.. అతనికి ఇంతకంటే మరో మార్గం లేక అయిష్టంగాగానే ఒప్పుకున్నాడు.

అలా ఏర్పాటు చేశారు..

అలా ఏర్పాటు చేశారు..

ఆ తర్వాత డాక్టర్లు ఆర్టీఫిషియల్ గా అతని చర్మంతోనే తయారు చేసిన పురుషాంగాన్ని, తన ఎడమ చేతిపై ఉన్న చర్మాన్ని కొంత తొలగించి.. అనంతరం దాన్ని గుండ్రంగా చుట్టారు. అందులో రక్తనాళాలు, నరాలను ఏర్పాటు చేశారు..

అక్కడే ఉంచేశారు..

అక్కడే ఉంచేశారు..

తనకు యాంత్రికంగా స్కలనం కోసం ఒక చేతి పైపును ఏర్పాటు చేశారు. అనంతరం దాన్ని ఎడమ చేతిలోనే ఉంచేశారు. అయితే, దాన్ని చర్మంతో కలిసిపోయేలా కాకుండా పక్కన ఎదిగేలా క్రియేట్ చేశారు. దాన్ని చూడగానే చేతి నుండి పురుషాంగం బయటికి ఉబికొచ్చినట్టు కనిపిస్తుంది.

రెండు అంగుళాలు పెద్దగా..

రెండు అంగుళాలు పెద్దగా..

ఈ సందర్భంగా మాల్కోలమ్ మాట్లాడుతూ ‘ఎలాగో తనకు కొత్త పురుషాంగాన్ని ఏర్పాటు చేస్తున్నారు.. కదా అందుకే గతంలో రెండు అంగుళాలు పెద్దగా ఉండే అంగాన్న ఏర్పాటు చేయాలని వైద్యులను కోరాను. ఇందుకు వారు అంగీకరించారు. నా కొత్త అంగానికి ‘జిమ్మీ'అని పేరు పెట్టుకున్నా' అని చెప్పాడు.

వాయిదా పడుతూ వచ్చింది..

వాయిదా పడుతూ వచ్చింది..

‘అయితే అప్పట్లో రెండు సంవత్సరాల తర్వాత ఈ ప్రక్రియ చేపడతామన్న డాక్టర్లకు అది సాధ్యం కాలేదు. ఎందుకంటే 2018లో నేను ఆపరేషన్ కు ప్రీపేరవుతున్న సమయంలో నాకు ఫీవర్ వచ్చింది. ఆ తర్వాత ఆసుప్రతిలో కొన్ని సమస్యల కారణంగా ఏడాది గడిచిపోయింది. దీంతో 2020 ఏప్రిల్ లో అంగాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అది కూడా కరోనా పుణ్యమా అని వాయిదా పడింది' అని వాపోయాడు.

అంతవరకు చేతిలోనే..

అంతవరకు చేతిలోనే..

కరోనా మహమ్మారి ఆఖరికి ఈ వ్యక్తి అంగం ఆపరేషన్ కు అడ్డుపడింది. దీంతో తనకు ఎప్పుడు ఆపరేషన్ జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అతను మాత్రం నాలుగేళ్లుగా అంగాన్ని తన చేతికే ఉంచుకుని తిరుగుతున్నాడు.

ఫుల్ హ్యాండ్స్ దుస్తులు..

ఫుల్ హ్యాండ్స్ దుస్తులు..

తన అంగం ఎవ్వరికీ కనిపించకుండా నిత్యం ఫుల్ హ్యాండ్స్ దుస్తులను ధరిస్తున్నాడు. అయితే కొన్నిసార్లు దాన్ని ఎవరైనా చూసినప్పుడు కొందరు దాన్ని చూసి ఎగతాళి చేస్తుంటారని అతను తెలిపాడు.

ఇతనే తొలి వ్యక్తి..

ఇతనే తొలి వ్యక్తి..

ఈ సంవత్సరం ఆఖరిలోపు డాక్టర్లు తన చేతిలో ఉన్న అంగాన్ని తీసి అక్కడ అమర్చుతారని ఆశిస్తున్నానని చెప్పాడు. ఇదిలా ఉండగా.. ఇలాంటి సంఘటన ఎదుర్కొన్న తొలి వ్యక్తిగా ప్రపంచంలో ఇతను రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు ఈ విశ్వంలోనే ఇలాంటి మొట్టమొదటి వ్యక్తిగా గుర్తింపు కూడా పొందాడు.

English summary

Viral : British dad whose penis dropped off has new one built on his ARM in world first

Here we talking about british dad whose penis dropped off has new one built on his ARM in world first. Read on