For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు.. తల్లిదండ్రులతో తెగదెంపులు చేసుకోవాలంట...’

|

పంచభూతాల సాక్షిగా తమ మనసుకు నచ్చిన వారితో లేదా పెద్దలు చెప్పారని కొత్త వ్యక్తితో ఏడడుగులు వేసే వారికి కళ్యాణం జరిగిన కొత్తలో అంతా ఉత్సాహంగా ఉంటుంది. ఇలాంటి నూతనోత్సాహం జీవితాంతం ఉండాలని ప్రతి ఒక్క జంట కోరుకుంటుంది.

అయితే పెద్దలు కుదర్చిన పెళ్లయినా.. ప్రేమ పెళ్లయినా భార్యభర్తల మధ్య ఏదో ఒక సందర్భంలో గొడవలు రావడం అనేది అత్యంత సహజం. అయితే వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం, అర్థం చేసుకునే తత్వం వారిని మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుంది.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే తన భర్త తనను సంతోషంగా చూసుకుంటున్నప్పటికీ, తన తల్లిదండ్రులపై మాత్రం చాలా కోపంగా ఉన్నారట. తనతో కలిసి ఉండాలంటే.. తన పేరేంట్స్ ను ఎప్పటికీ కలవకూడదు అని కండీషన్లు పెడుతున్నారట.

అది కూడా పెళ్లయిన ఆరు సంవత్సరాల తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడట. అయితే తను ఇలాంటి కఠినమైన కండిషన్లు ఎందుకు పెడుతున్నాడు.. అందుకు గల కారణాలేంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

రతిక్రీడను రఫ్ గా ప్రయత్నించాలంటే.. ముందు వీటి గురించి తెలుసుకోవాలట...!

లవ్ మ్యారేజ్..

లవ్ మ్యారేజ్..

హాయ్.. ‘నా పేరు శిరీష(పేరు మార్చాం). నా వయసు 35 సంవత్సరాలు. నాకు పెళ్లి జరిగి ఆరు సంవత్సరాలు పూర్తవుతోంది. నేను మావారు పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నాం. మా ఆరేళ్ల కాపురానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. మా ఆయన నన్ను బాగానే చూసుకుంటున్నారు.

పేరేంట్స్ పేరేత్తితే..

పేరేంట్స్ పేరేత్తితే..

అయితే నా భర్తకు నా తల్లిదండ్రులంటే ఏ మాత్రం గౌరవం లేదు. మా వివాహంసమయంలో మా కుటుంబంలో ఎవ్వరూ సపోర్ట్ చేయలేదనే కోపం తను ఇప్పటికీ మరచిపోలేకపోతున్నాడు. దీని గురించి మా ఇద్దరి మధ్యన చాలాసార్లు గొడవ జరిగింది.

విడాకులు ఇస్తానని..

విడాకులు ఇస్తానని..

ఇలా గొడవ జరిగిన చాలా సందర్భాల్లో తను నాకు విడాకులు ఇస్తానని బెదిరించడంతో.. నేను కాస్త తగ్గేదాన్ని. తప్పు నాదే క్షమించమని కోరుకునేదాన్ని. కానీ తను మాత్రం నా పేరేంట్స్ అప్పటి నుండి అదే భావనలో ఉండిపోయాడు. చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు. అది నేను తలచుకుని చాలా బాధపడుతున్నాను. ఆ మాటలను తేలిగ్గా తీసుకోలేకపోతున్నాను.

శాశ్వతంగా దూరమవ్వమంటున్నారు..

శాశ్వతంగా దూరమవ్వమంటున్నారు..

ఇప్పుడు తను నా తల్లిదండ్రులు శాశ్వతంగా రిలేషన్ షిప్ కట్ చేసుకోవాలని కండిషన్లు పెడుతున్నారు. పెళ్లి జరిగిన నాటి నుండి ఇప్పటివరకు ఒక్కసారి కూడా మేం కలిసి ఉన్న సందర్భమే రాలేదు. కానీ నా పేరేంట్స్ తనకు తెలీకుండా అప్పుడప్పుడు వచ్చి చాటుగా కలిసి వెళ్లేవారు. ఇలాంటి సమస్య ఎవ్వరికీ రాకూడదు. ఇలాంటి పరిస్థితిని ఎలా అధిగమించాలో నాకు అర్థం కావడం లేదు' అని ఓ వివాహిత తన బాధను నిపుణులకు చెప్పింది. ఇందుకు ఆమెకు ఏం సమాధానం దొరికిందో ఇప్పుడు తెలుసుకుందాం.

Zodiac signs: రాశిచక్రాన్ని బట్టి తమ లైఫ్ లో ఇలాంటి భాగస్వామి కావాలని కోరుకుంటారట...!

పరిస్థితులు క్లిష్టంగా..

పరిస్థితులు క్లిష్టంగా..

భర్తకు, పేరేంట్స్ మధ్య ఏదైనా సమస్యలుంటే.. అవి అంత సులభంగా పరిష్కారం కావు. అంతటితో ఆగకుండా అవి మరింత పెద్దవయ్యే ప్రమాదం కూడా ఉంది. మీరు ఎవరికి మద్దతు ఇచ్చినా కష్టమే. నాకెందుకులే అని మౌనంగా ఉన్నా మీకు ఇబ్బందులే. ఇలాంటి వాటినే ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అని కూడా అంటూ ఉంటారు.

మీ సంసారంలో సమస్యలు..

మీ సంసారంలో సమస్యలు..

మీ పార్ట్ నర్ మీ పేరేంట్స్ ను కాదనడం.. మీరు వారితో తిరిగి రిలేషన్ కావాలనుకుంటే.. మాత్రం మీ సంసార జీవితంలో మరిన్నిసమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మీరు నిమిత్తమాత్రులుగా ఉంటారు.

సమయం చూసి..

సమయం చూసి..

అయితే మీ జీవితంలో మీ పేరేంట్స్ పాత్ర ఎంత విలువైనదో.. మీ భర్తకు వివరించే ప్రయత్నం చేయండి. అందుకు సరైన సమయం కోసం వేచి చూడండి. మీరు చిన్నప్పటి నుండి పెద్దయ్యే వరకు వారు చేసిన సాయం, మీ మీద చూపిన ప్రేమ, ఇతర విషయాలన్నింటినీ చెప్పండి. వారు చెప్పిన పెళ్లి చేసుకోలేదనో.. మీపై ఎలాంటి వ్యతిరేకతా లేదనే విషయాన్ని క్లియర్ గా చెప్పండి. మీ భర్తకు, పేరేంట్స్ కు మధ్య మీరొక మధ్యవర్తిలా వ్యవహరించండి.

వింధు భోజనం..

వింధు భోజనం..

మీకు పరిస్థితులు అనుకూలిస్తే.. మీ పేరేంట్స్ తో కలిసి మీ భర్త ప్రత్యేక విందు భోజనానికి హాజరయ్యేలా చూడండి. అలా చేయడం వల్ల వారి మధ్య కొంత దూరం తగ్గొచ్చు. అప్పటి నుండి మీ పేరేంట్స్ పై ఏమైనా సానుకూలత ఏర్పడొచ్చు. ఎందుకంటే కొన్ని బంధాలు బలంగా మారేందుకు కాస్త సమయం పడుతుంది. కాకపోతే సహనంతో ఉండాలి. ఏదో ఒక రోజు మీ పేరేంట్స్ ను గౌరవించే రోజు వస్తుంది.

English summary

What should I do that my husband wants me to cut off all the ties with my parents?

Check out the details, what should I do that my husband wants me to cut off all the ties with my parents? Read on
Story first published: Wednesday, May 5, 2021, 17:14 [IST]