Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
తనంటే నాకు పిచ్చి.. కానీ నన్ను కనీసం తాకనివ్వడం లేదు.. ఎందుకు?
కొందరు అమ్మాయిలు శృంగారం అంటే ఎందుకు అంతలా భయపడుతుంటారు.
వివాహం తర్వాత ఎవరైనా తమ జీవితాన్ని హాయిగా, ఆనందంగా కొనసాగించేందుకు శృంగారం అనేది చాలా కీలకం.

ఆడవారు, మగవారి మధ్య బంధం బలంగా మారేందుకు.. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగేందుకు ఈ కార్యం ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు సైతం చెబుతుంటారు.

అయితే కొంతమంది అమ్మాయిలకు మాత్రం శృంగారం విషయంలో అనేక అనుమానాలు.. అపొహలు ఉంటాయి. తాము అందులో పాల్గొన్న వెంటనే ప్రెగ్నెంట్ అయిపోతామా?

అసలు కలయిక అనేది కరెక్టేనా? ఆ విషయం గురించి భాగస్వామితో మాట్లాడొచ్చా లేదా? అనే సందిగ్ధం లో ఉంటారు. మరికొందరైతే శృంగారం గురించి మాట్లాడటానికి అస్సలు ఇష్టపడరు.

దీనంతటికి కారణం శృంగారంపై వారికి అవగాహన ఉండకపోవడమేనా? అది వారి ఇష్టంపై ఆధారపడి ఉంటుందా? లేదా భాగస్వాములంటే ఇష్టం లేకనా? అనే ప్రశ్నలకు సమాధానలు తెలుసుకుందాం...

పది నెలలైనా..
నాకు పెళ్లయి పది నెలలు పూర్తవుతోంది. నా భాగస్వామి బెంగళూరులో పుట్టింది. అక్కడే మంచి సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం కూడా చేస్తోంది. మాములుగా సిటీలో ఉండే యువతులు చాలా ఫాస్టుగా ఉంటారని నాకు తెలుసు.

నన్ను తాకనివ్వడం లేదు..
అయితే, నా భార్య మాత్రం అలా లేదు. కనీసం వారిలో సగం కూడా స్పీడు లేనట్టుంది. పెళ్లి అయి పది సంవత్సరాలు అవుతున్నా.. నన్ను కనీసం తాకనివ్వడం లేదు.

పలుమార్లు ప్రయత్నించా..
తనతో శారీరకంగా కలిసేందుకు కొన్నిసార్లు ప్రయత్నించినా.. ఆమె నాకు సహకరించడం లేదు. పైగా నాకు ఫీలింగ్స్ రావడం లేదని మొహం మీదే చెబుతోంది.

తొందరపడటం లేదు..
మాది అరెంజెడ్ మ్యారేజ్. అందుకే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుందని పెద్దలు మా ఇద్దరికి సర్దిచెబుతున్నారు. దీంతో నేను కూడా ఆ విషయం గురించి అంతగా తొందరపడటం లేదు.

ఆ ఉద్దేశ్యంతోనే..
తనకు నాపై ఎప్పుడు కోరిక కలుగుతుందో అప్పుడే ఆమెతో శృంగారం చేయొచ్చనే ఉద్దేశ్యంతోనే ఇన్ని నెలల వరకు ఎదురుచూశాను. కానీ తను మాత్రం నన్ను అర్థం చేసుకోవడం లేదనే అసహనం పెరుగుతోంది.

ఓ రాత్రి..
ఈ నేపథ్యంలోనే ఓ రాత్రి నేను విరహ వేదనను తట్టుకోలేక ఆమెను లైంగింకంగా ప్రేరేపించడం ద్వారా ఆమెతో బలవంతంగా కోరిక తీర్చుకుందామని ప్రయత్నించాను. కానీ అది కూడా సాధ్యపడలేదు.

ఇదంతా ఎందుకు...
ఆమె అనునిత్యం నాకు సహకరించకపోవడంతో నాకు ఏమి చేయాలో తోచడం లేదు. ఇదంతా ఆమెకు శృంగారం అవగాహన లేకపోవడం వల్లేనా? నిజంగానే ఆమెకు నాపై కోరికలు కలగడం లేదా? నేనంటే ఇష్టం లేకపోవడమా?

నిపుణుల సమాధానం..
ఏ స్త్రీ, పురుషులిద్ధరి మధ్య అయినా అనుబంధం ఏర్పడటానికి, శృంగార జీవితాన్ని మొదలుపెట్టేందుకు పది నెలల సమయం అనేది చాలా ఎక్కువ. ఆమె పట్ల మీరు ఇప్పటివరకు చాలా ఓపికగా వ్యవహరించారు.

ఇదే సరైన సమయం..
అయితే మీ ఇద్దరూ కలిసి ముందుగా ఆ విషయం గురించి ఓపెన్ గా మాట్లాడుకోవాలి. ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకోవడానికి ఇదే సరైన సమయం. ఆమెకు శృంగారం గురించి ఏవైనా అపొహలు, సందేహాలు ఉంటే వాటిని ప్రేమతో అడిగి తెలుసుకోండి.

వివాహ బంధానికి ఇబ్బంది..
అలా కాకుండా మీరు కోపంగా అడిగితే.. మీరు ఆమె పట్ల అసహనం చూపితే.. అది మీ వివాహా బంధానికే ఇబ్బందిని తీసుకొస్తుంది. మీకు వీలైతే ముందుగా ఓ మంచి మానసిక నిపుణుడిని సంప్రదించండి. దీని వల్ల మీకు కచ్చితంగా ఫలితం ఉంటుంది. ఆమెలో శృంగారం గురించి ఏవైనా అపొహలుంటే, వాటిని పోగేట్టేందుకు మానసిక నిపుణులు సహకారం, సహాయం మీకు కచ్చితంగా ఉపయోగపడే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications