Latest Updates
-
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు!
సింగిల్ కింగులకు బంపరాఫర్... పెళ్లి చేసుకుంటే పైసలిస్తారంట... అది కూడా రూ.లక్షల్లో...!
పెళ్లి చేసుకుంటామంటే పైసలిస్తామంటున్న జపాన్ ప్రభుత్వం. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
అక్కడ పెళ్లి కాని ప్రసాదులందరికీ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది ఆ ప్రభుత్వం.. అంతేకాదు ఎంత త్వరగా పెళ్లి చేసుకుని.. పిల్లల్ని కంటే అంత పైసలిస్తామని ఓపెన్ గా ప్రకటించింది.

అంతేకాదండోయ్ పైసలతో పాటు పెళ్లి చేసుకున్న వారికి విలువైన బహుమతులిస్తామని బంపరాఫర్లు చేసినా కూడా.. అక్కడ సింగిల్ కింగ్స్ పెళ్లిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదంట.

కరోనా వైరస్ మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా కళ్యాణం వంటి కార్యక్రమాల ఖర్చులు భారీగా తగ్గిపోయాయి. పరమిత సంఖ్యలో బంధువులు, స్నేహితులతో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మన దేశంలో ఎంతమంది పెళ్లి చేసుకున్నా మన ప్రభుత్వాలు ఎలాంటి ఆఫర్లు ఇవ్వవు. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కేవలం ఆడవారికి మాత్రం కొంత సొమ్మును ఖాతాలో వేస్తున్నారు.

ఇదిలా ఉంటే జపాన్ దేశంలో దేశంలో పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికీ సుమారు 5 లక్షల రూపాయలిస్తామని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. అయితే అకస్మాత్తుగా అక్కడి గవర్నమెంట్ ఎందుకని ఇలాంటి నిర్ణయం తీసుకుంది.. అయినా అక్కడి పెళ్లి కాని ప్రసాదులు వివాహం అంటే ఎందుకంత విపరీతంగా భయపడిపోతున్నారనే కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పెళ్లి చేసుకుంటే..
చాలా మందికి పెళ్లి చేసుకుంటే అదనపు కొత్త బాధ్యతలు.. కొత్త సమస్యలు వంటివి ఎన్నో ఉంటాయని.. అందుకే మన దేశంలో పెళ్లిని వాయిదా వేస్తూ... లైఫ్ లో సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకుంటామంటారు కొందరు.. మరికొందరు పెళ్లి చేసుకుని పిల్లల్ని కని జనాభా ఎందుకు పెంచడం అని భావిస్తుంటారు.

జనాభా తగ్గిపోతోందట..
అయితే జపాన్ దేశంలో రోజురోజుకు జనాభా తగ్గిపోతోందట. దీనంతటికి యువత ఎక్కువగా పెళ్లిళ్లు చేసుకోకపోవడమే కారణమని భావించిందట. అందుకే యూత్ మ్యారేజ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టిందట. ఈ నేపథ్యంలోనే పెళ్లి చేసుకున్న జంటకు సుమారు నాలుగున్నర లక్షల రూపాయలను ప్రోత్సాహకంగా ఇస్తామని బంపరాఫర్ ఇచ్చేసింది.

జపాన్ జనాభా..
ఇటీవల జపాన్ లో జరిపిన సర్వేలో ఆ దేశ జనాభా 12.68 కోట్లు ఉండగా, అందులో వయసు పైబడిన వారే ఎక్కువగా ఉన్నారట. అందుకే అక్కడి ప్రభుత్వం యువత పెళ్లి చేసుకుని.. త్వరగా పిల్లల్ని కనండ్ర బాబూ.. దేశ జనాభాను పెంచడ్రా బాబూ అని వేడుకుంటోందంట.

పెళ్లిపై అనాసక్తి..
అయితే అక్కడ యువత పెళ్లిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదంట. దీనంతటికి ఆర్థిక సమస్యలే ప్రధానమని కారణమని అక్కడి ప్రభుత్వం నిర్ణారణకొచ్చిందట. అందుకే అక్కడ త్వరగా పెళ్లి చేసుకుని.. పిల్లల్ని కనేవారికి ప్రోత్సాహాకాలతో పాటు విలువైన బహుమతులను ఇస్తామని ఓపెన్ గా బంపరాఫర్ ప్రకటించింది.

ఒక కండిషన్..
అయితే పెళ్లి చేసుకునే వారి వయసు 40 సంవత్సరాలకు మించకూడదనే నిబంధన విధించిందట. అంతేకాదు పెళ్లి చేసుకుని ఏడాది లోపు ఎవరైతే పిల్లల్ని కంటారో వారికి మరిన్ని ప్రోత్సాహాకాలిస్తామని.. అక్కడి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

గతేడాది..
జపాన్ దేశంలో కేవలం గత ఏడాది సుమారు 8 లక్షల 65 వేల మంది జన్మించినట్లు.. మరణించిన వారు మాత్రం సుమారు 13 లక్షల 77 వేల మంది ఉండటమే దీనంతటికి కారణంగా తెలుస్తోంది.

ఇలాగే కంటిన్యూ అయితే..
ఇదే పరిస్థితి జపాన్ దేశంలో కంటిన్యూ అయితే.. 2040లోపు ఇప్పుడున్న జనాభాకు మరో 35 శాతం ముసలివారి సంఖ్య ఎక్కువగా పెరుగుతుందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా జపాన్ తోపాటు ఎస్తోనియా(యూరప్), ఇటలీ, ఇరాన్ వంటి దేశాలు కూడా యువత పెళ్లి చేసుకోవడానికి కొన్ని ప్రోత్సాహాకార బహుమతులు ఇస్తున్నాయి.

పనికే ప్రాధాన్యత..
అయితే జపాన్ వాసులు పెళ్లి చేసుకోవడానికి మరో ప్రధాన కారణం పని. అక్కడి నివసించే వారు ఎక్కువగా పనీ పనీ అంటూ నిత్యం పనికే పరిమితమవ్వడం.. పనికే అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల పెళ్లి మీద అస్సలు ధ్యాస పెట్టడం లేదంట. ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా పిల్లల్ని కనడం వంటి వాటిపై ధ్యాస పెట్టడం లేదంట. అందుకే జపాన్ ప్రభుత్వం అక్కడ యువత పెళ్లి చేసుకోవడంపై ఫోకస్ పెట్టింది. పెళ్లి చేసుకుంటే పైసలిస్తామంటూ బంపరాఫర్లు ఇస్తామంటోంది. ఇలా అయినా అక్కడి పెళ్లి కాని ప్రసాదులలో మార్పు వస్తుందో లేదో చూడాలి మరి.



Click it and Unblock the Notifications