For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Stress: ఒత్తిడి బంధాలను దెబ్బతీస్తుంది.. దానిని ఎలా తగ్గించుకోవాలంటే

|

Stress: ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరినీ పీడిస్తున్న సమస్య ఒత్తిడి. మానసిక ఒత్తిడితో సతమతం అవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మారిన జీవన విధానం, తీరిక లేని పని, మానసిక సంఘర్షణ ఇలా చాలా కారణాలు ఒత్తిడికి దారి తీస్తున్నాయి. ఈ ఒత్తిడి వల్ల అసహనం పెరుగుతుంది.. అలాగే కోపం ముంచుకొస్తుంది.

ఒత్తిడి వల్ల కేవలం ఆ వ్యక్తి మాత్రమే ప్రభావితం కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్లు కూడా దాని వల్ల ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా మన దగ్గరి వారిపై దానిని చూపించడం వల్ల వాళ్లను బాధకు గురి చేసిన వాళ్లం అవుతుంటాం. దీని వల్ల వారు క్షోభ పడుతుంటారు. ఇది పెరుగుతున్న కొద్దీ వాళ్లు ఒత్తిడిగా ఫీలయ్యే ప్రమాదం ఉంటుంది. ఇది సంబంధాలను దెబ్బతిస్తుంది.

ఒత్తిడి సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది:

ఒత్తిడి సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది:

1. రిలేషన్ షిప్ స్ట్రెస్ అనేది శారీరక, మానసిక రోగ నిరోధకతపై ప్రభావం చూపుతుంది. ఎండోక్రైన్, హృదయనాళ వ్యవస్థలను మార్చగలదు.

2. నూతన వధూవరుల మధ్య చిన్న పాటి గొడవలు జరిగినా అది పెద్ద ప్రభావం చూపుతుంది ఒక అధ్యయనం ప్రకారం హార్మోన్లు ఎక్కువ స్థాయిలు విడుదల కావడం వల్ల వాళ్లు విపరీతంగా స్పందిస్తారని తేలింది.

3. అదే విధంగా మరొక అధ్యయనంలో, శత్రు సంబంధాలలో ఉన్న వ్యక్తులకు గాయాలు అయితే చాలా నెమ్మదిగా నయం అవుతున్నాయని తేలింది. అలాగే అధిక వాపు, అధిక రక్తపోటు లాంటి సమస్యలను గుర్తించారు.

4. మధ్య వయస్కులు మరియు వృద్ధులు వారి భార్యలు ఎక్కువ ఒత్తిడిని నివేదించిన సమయాల్లో అధిక రక్తపోటును కలిగి ఉంటారు.

సంఘర్షణ మరియు కార్టిసాల్:

సంఘర్షణ మరియు కార్టిసాల్:

కార్టిసాల్ అనేది శరీరం యొక్క ఒత్తిడి ప్రతిస్పందనలో కీలక పాత్ర పోషించే హార్మోన్. కార్టిసాల్ రోజు వారీ లయను కలిగి ఉంటుంది. కాబట్టి దాని స్థాయిలు సాధారణంగా మేల్కొన్న వెంటనే ఎక్కువగా ఉంటాయి తర్వాత క్రమంగా తగ్గుతాయి. కానీ దీర్ఘకాలిక ఒత్తిడి అనారోగ్యకరమైన కార్టిసాల్ నమూనాలకు దారి తీస్తుంది. మేల్కొన్నప్పుడు తక్కువ కార్టిసాల్ స్థాయిలు లేదా కార్టిసాల్ రోజు చివరిలో తగ్గిపోకుండా అదే స్థాయిలో ఉంటుంది. ఈ నమూనాలు వ్యాధి అభివృద్ధి మరియు మరణాల ప్రమాదాల పెరుగుదలతో సంబంధం కలిగి ఉంటాయి. ఒత్తిడికి గురైన భాగస్వామితో వాదించడం వల్ల ఆ సంబంధంపై తీవ్ర ప్రభావం ఉంటుందని పలు అధ్యయనాల్లో తేలింది.

ఒత్తిడిని నిర్వహించడం:

ఒత్తిడిని నిర్వహించడం:

1. ఒత్తిడితో ఉన్న భాగస్వామితో సున్నితంగా మాట్లాడాలి. వారి బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒత్తిడికి దారి తీసిన కారణాలపై చర్చించాలి.

2. కొన్ని సార్లు భాగస్వాములు ఒకరినొకరు రక్షించుకోవడానికి సమస్యలను దాచుకుంటారు. కానీ ఇది వాస్తవానికి విషయాలను మరింత దిగజార్చవచ్చు. మీ భావాలను పంచుకోండి అలాగే మీ భాగస్వామి పంచుకుంటే ఆపకుండా వినండి.

3. భాగస్వామి పట్ల శ్రద్ధ వహించడం మరియు అర్థం చేసుకోవడం మీ భావోద్వేగ శ్రేయస్సుకు మంచిది. ఆరోగ్యకరమైన కార్టిసోల్ నమూనాలను ప్రోత్సహిస్తుంది.

4. భాగస్వామి పట్ల ప్రేమను చూపించండి.

4. భాగస్వామి పట్ల ప్రేమను చూపించండి.

ఒకరినొకరు కౌగిలించుకుని, చేతులు పట్టుకుని మాట్లాడుకోండి. దీని వల్ల ఒత్తిడి కాస్తా అయిన తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల కార్టిసోల్ హార్మోన్ తగ్గుతుంది.

5. సమస్యలకు ఇరువురు కూర్చుని పరిష్కారాలు వెతకాలి. అలాగే ఒకరి విజయం పట్ల మరొకరు ఛీర్ ‌లీడర్ ‌లుగా ఉండాలి. చిన్న విజయాలను కూడా పెద్దగా సెలబ్రేట్ చేసుకోవాలి.

6. మీ భాగస్వామి ఒత్తిడికి గురైనప్పుడు కలిసి ఉండేందుకు ప్రయత్నించాలి. కలిసి మాట్లాడుకోవాలి. కలిసి భోజనం చేయడం లేదా ఇతర పనులు చేయాలి.

7. తగినంత విశ్రాంతి తీసుకోవాలి.

7. తగినంత విశ్రాంతి తీసుకోవాలి.

8. గత కాలపు మధురానుభూతులను ఆస్వాదించాలి. ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ గడపాలి.

9. కలిసి కొత్త రెస్టారెంట్, డ్యాన్స్ లేదా వ్యాయామం చేయాలి.

వైద్యుల వద్దకు వెళ్లడం తప్పేం కాదు:

వైద్యుల వద్దకు వెళ్లడం తప్పేం కాదు:

కొన్ని సార్లు ఒత్తిడిని జయించడానికి ఈ దశలు సరిపోవు. చాలా మంది జంటలకు ఇప్పటికీ ఒత్తిడిని నిర్వహించడానికి మరియు ఇబ్బందులను అధిగమించడానికి సహాయం కావాలి. కపుల్స్ థెరపీ వివాదాలను సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడం మరియు పరిష్కరించడానికి భాగస్వాములు నేర్చుకోవడంలో సహాయపడుతుంది. యాక్టివ్‌గా ఉండటం మరియు కొనసాగుతున్న సంబంధాల సమస్యలను ఎదుర్కోవటానికి శిక్షణ పొందిన వారి నుండి సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం.

అండగా ఉన్నామని తెలియజేయాలి:

అండగా ఉన్నామని తెలియజేయాలి:

భాగస్వామి ఒత్తిడిగా ఉన్నప్పుడు వారిని కౌగిలించుకుని మీకు నేనున్నా అని చెప్పాలి. అండగా నేనెప్పటికీ ఉంటానన్న భరోసా కల్పించాలి. అది వారిలో మంచి ఫీలింగ్ ను తీసుకువస్తుంది. అలాగే ఒకరు ఒత్తిడిగా ఫీల్ అవుతుంటే.. దానిని సీరియస్ గా తీసుకోవాలి. అలాంటి వారిని కంటికి రెప్పలా చూసుకోండి. ఇద్దరూ కలిసి ఎక్కడికైనా దూరంగా వెళ్లి కొన్ని రోజులు సంతోషంగా గడపండి. కొత్త ప్రాంతంలో కొంత అనుభూతులు ఒత్తిడి నుండి దూరం చేస్తాయి. ఇది తెలియని మధురానుభూతులను ఇస్తుంది.

Read more about: stress
English summary

Stress Affecting Your Relationship; Know How to reduce in telugu

read on to know Stress Affecting Your Relationship; Know How to reduce in telugu
Story first published: Saturday, July 23, 2022, 16:00 [IST]
Desktop Bottom Promotion