For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శివలింగానికి ఎట్టిపరిస్థితిలో సమర్పించకూడని 7 వస్తువులు!

|

శివలింగం పరమశివునికి ప్రతిరూపం. శివలింగాన్ని సరిగ్గా ఆచారాలతో విధివిధానాలతో పూజిస్తే, పరమశివుడు మెచ్చి మీ కోరికలన్నీ తీరుస్తారు. అదే కాదు, శివలింగాన్ని పూజించటం వలన ఇతర దేవతలను కూడా మెప్పించవచ్చు.

శివపురాణం ప్రకారం, కొన్ని వస్తువులు శివలింగానికి అస్సలు సమర్పించకూడదు. శివలింగాన్ని తప్పుగా పూజించటం అపాయకరం కావచ్చు.ఆ వస్తువులేంటో ఇప్పుడు చూద్దాం.

పసుపు (హల్దీ)

పసుపు (హల్దీ)

పసుపును ప్రతి దేవుడికి సమర్పిస్తారు. కానీ శివలింగానికి మాత్రం పెట్టకూడదు. ఎందుకంటే పసుపు స్త్రీల అందాన్ని పెంపొందించే వస్తువుగా పేరొందింది మరియు శివలింగం ఏమో పరమశివునికి ప్రతిరూపం.

తులసి

తులసి

ఇంకా ఏ పూజకైనా, మొదలుపెట్టేముందు భక్తుడు శుద్ధిగా స్నానం చేయాలి. శివలింగాన్ని పూజించేటప్పుడు, గుర్తుంచుకోండి తులసి ఆకులు ఎప్పుడూ పెట్టకూడదు. ఎప్పుడూ బిల్వపత్రాలనే సమర్పించండి.

కొబ్బరినీళ్ళు

కొబ్బరినీళ్ళు

శివలింగానికి ఎప్పటికీ కొబ్బరినీళ్ళు సమర్పించకూడదు, కొబ్బరికాయ కొట్టవచ్చు.

ఖేవ్డా మరియు చంపా

ఖేవ్డా మరియు చంపా

శివలింగం పరమశివుని ప్రతిరూపం కాబట్టి ఆయనకి ఇష్టమైన తెల్లని పువ్వులను శివలింగానికి కూడా సమర్పించవచ్చు. ఖేవ్డా మరియు చంపా పువ్వులను మాత్రం పెట్టకండి ఎందుకంటే వాటిని శివుడు శపించాడని నమ్ముతారు.

కుంకుమ తిలకం

కుంకుమ తిలకం

శివలింగానికి కుంకుమ తిలకం ఎప్పుడూ వాడవద్దు. భక్తులు కానీ పార్వతీ మరియు గణేషుడి విగ్రహాలకు దీన్ని వాడతారు.

సమర్పించే దేన్నీ మీరు తినవద్దు లేదా తాగవద్దు

సమర్పించే దేన్నీ మీరు తినవద్దు లేదా తాగవద్దు

భక్తులు శివలింగానికి సమర్పించే దేన్నీ తినకూడదు, తాగరాదు. అది చెడ్డశకునాన్ని తెచ్చి, అదృష్టం, డబ్బు , ఆరోగ్యం నష్టమవుతాయి.

స్టీలు స్టాండు

స్టీలు స్టాండు

అభిషేకానికి ఎప్పుడూ స్టీలు స్టాండు వాడకండి. మీరు శివలింగాన్ని ఇంట్లో వుంచుకున్నట్లయితే, దానితో ఎప్పుడూ జలధార ఉండాలని గుర్తుంచుకోండి. జలధార లేకుండా శివలింగాన్ని పూజిస్తే, అది నెగటివ్ శక్తులను ఆకర్షిస్తుంది.

English summary

7 Things that should never be offered on a Shivling

7 Things that should never be offered on a Shivling,
Desktop Bottom Promotion