For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గణేషుడిని మీ ఇంటికి తీసుకొచ్చేముందు రెడీగా ఉంచాల్సిన పూజా సామాగ్రి..!

By Super Admin
|

ఇది పండగ సీజన్, మనందరికీ వినాయక చతుర్ధి జరుపుకోవడం చాలా ప్రీతిపాత్రం.మనింటికి గణేశుడిని తీసుకొచ్చేముందు తయారు గా ఉంచుకోవాల్సినవాటి గురించి ఈరోజు తెలుసుకుందాము.

ఈ పండగ ని హిందువులు అతి విలాసవంతంగా జరుపుకుంటారు. ఈ ఉత్సవాల్లో మహమ్మదీయులు కూడా పాల్గొంటారు.ఈ సమయం లో కొన్ని వస్తువులని తయారుగా ఉంచుకోవాలి.ఎందుకంటే ఈ వస్తువులన్నీ ఏదో ఒక ప్రాముఖ్యత కలిగి ఉన్నవే.గణేశుడిని ఇంటికి తీసుకువచ్చేముందు తయారు గా ఉంచుకోవాల్సిన సామాగ్రితో పాటు గణేశుడిని తీసుకొచ్చే ముహుర్తం కూడా ముఖ్యమే.

ఈరోజు మీరు మీ ఇంటికి గణేశుడిని తీసుకొచ్చేముందు తయారుగా ఉంచుకోవాల్సిన ముఖ్య సామాగ్రి గురించి ఇస్తున్నాము.చదవండి మరి.

అగరుబత్తులు:

అగరుబత్తులు:

అగరుబత్తుల లేదా సాంబ్రాణి ధూపం వెయ్యడమనే సంప్రదాయం అనాదిగా వస్తున్నదే.మీ ఇంటిలో కాసిని అగరుబత్తులని లేదా సాంబ్రాణిని సువాసన కోసం వెలిగించండి.ఈ ధూపం మిమ్మల్ని ప్రశాంతం గా ఉంచడంతో పాటు పూజలో మీ ధ్యానం చెదరకుండా ఉంచుతుంది.

హారతి పళ్ళెం:

హారతి పళ్ళెం:

దీనిలో దీపాలు పెట్టి అలంకరించండి.ఇంకా హారతి సమయం లో కావాల్సిన సామగ్రి(హారతి కర్పూరం, అగ్గిపెట్టె వంటివి) దీనిలో తయారుగా ఉంచండి.పూవులు,హారతి కర్పూరం,కొబ్బరికాయ, కుంకుమ హారతి పళ్ళెంలో ఉంచాల్సిన సామగ్రి.

గంట:

గంట:

గంట కి పూజలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో పూజ చేసి హారతి ఇచ్చే సమయంలో గంట ని మ్రోగించాలి. గంట మోగించడం వల్ల దేవతలు ప్రసన్నులవుతారు.

పచ్చి బియ్యం:

పచ్చి బియ్యం:

మనింటికి తెచ్చిన గణేశుడి విగ్రహాన్ని బియ్యం మీద నిలబెట్టడం ఆచారం.ఒక పళ్ళెంలో బియ్యం పోసి దానిలో గణేశుడిని నిలబెట్టి పూజా గృహం లో ఉంచి పూజ చెయ్యాలి.

పీట:

పీట:

దీనిమీద గణేశుడి ప్రతిమ ని ఉంచుతారు.దీనిని పూలతో అలకరించి ప్రతిమని మధ్యలో ఉంచాలి

ప్రతిమని కప్పి ఉంచడానికి తెల్లని వస్త్రం:

ప్రతిమని కప్పి ఉంచడానికి తెల్లని వస్త్రం:

పరిశుభ్రమైన తెల్లటి వస్త్రాన్ని గణేశుడి ముఖం మీద కప్పి ఉంచుతారు. పూజ అయ్యాకా ఆ వస్త్రాన్ని తొలగించాలి.

గంధంలో ముంచిన వస్త్రం:

గంధంలో ముంచిన వస్త్రం:

గంధం లో ముంచి తీసిన బట్టని గణేశుడిని నిమజ్జనానికి తీసుకెళ్ళేముందు చేసే పూజలో ఉపయోగిస్తారు.

పండ్లు:

పండ్లు:

పూజా సమయంలో గణేశునికి పండ్లు నివేదించాలి.పండ్లని నివేదించడం ద్వారా మనం గత జన్మలో చేసిన పాపాలనుండి విముక్తినివ్వమని భగవంతుని ప్రార్ధించడమే.

పువ్వులు:

పువ్వులు:

పువ్వులు సౌందర్యాన్ని, స్వఛ్ఛతని,మృదుత్వాన్ని సూచిస్తాయి.

ఇవీ పూజా సమయంలో ఇంటిలో తప్పక ఉంచుకోవాల్సిన సామగ్రి.

ఇవీ పూజా సమయంలో ఇంటిలో తప్పక ఉంచుకోవాల్సిన సామగ్రి.

ఇవీ పూజా సమయంలో ఇంటిలో తప్పక ఉంచుకోవాల్సిన సామగ్రి.వీటినన్నింటినీ సమకూర్చుకుని పూజ ప్రారంభిస్తున్నామంటే మన మనసులు కూడా పవిత్రమయ్యాయని గుర్తు.పైన చెప్పిన సామాగ్రినన్నింటినీ గణేశుని పూజలో వినియోగిస్తారు.

ఒకవేళ పూజకి కావాల్సిన వస్తువునేదైనా మర్చిపోతే కామెంట్ల రూపం లో తెలియచెయ్యండి.

English summary

9 Things Needed While You Get Ganesha Home

Its festive time and we all love to celebrate Ganesh Chaturti. Today we are here to discuss about the check list of things that need to be taken care of before you get the Ganesha idol home.
Desktop Bottom Promotion