For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Anant Chaturdashi 2021:అనంత చతుర్దశి శుభ ముహుర్తం ఎప్పుడు? ఈ పండుగ ఆచారాలు, ప్రాముఖ్యతలేంటి?

అనంత చతుర్దశి 2021 తేదీ, శుభ ముహుర్తం, ఆచారాలు మరియు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ పంచాంగం ప్రకారం అనంత చతుర్దశి చాలా ప్రత్యేకమైనది. భాద్రపద మాసంలో వచ్చే ఈ పవిత్రమైన రోజు వినాయకుని నిమజ్జనం జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 19వ తేదీన అనంత చతుర్దశి ఉత్సవాలను జరుపుకోనున్నారు. ఈ రోజున ఉపవాసం ఉంటే అన్ని కష్టాలు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈరోజున ఉపవాసానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పండుగను చౌడాస్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ సందర్భంగా అనంత చతుర్దశి శుభ ముహుర్తం ఎప్పుడు? ఈ పండుగ యొక్క ఆచారాలు, ప్రాముఖ్యతలేంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Anant Chaturdashi 2021 date, shubh muhurat, rituals and significance

పితృత్వం అనేది హిందూమతంలో పెద్దలను గౌరవించడం, ఆరాధించడం.. వారి ఆత్మల కోసం ప్రార్థించడం..!పితృత్వం అనేది హిందూమతంలో పెద్దలను గౌరవించడం, ఆరాధించడం.. వారి ఆత్మల కోసం ప్రార్థించడం..!

శుభ ముహుర్తం..

శుభ ముహుర్తం..

ప్రతి సంవత్సరం హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలోని 14వ రోజున చతుర్దశి నాడు అనంత చతుర్దశిని జరుపుకుంటారు. 2021 సంవత్సరంలో సెప్టెంబర్ 19వ తేదీన అంటే ఆదివారం రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఇదే రోజున వినాయక నిమజ్జనం కూడా జరుగుతుంది.అనంత చతుర్దశి శుభ ముహుర్తం ఉదయం 6:07 గంటల నుండి ఉదయం 9:30 గంటల వరకు ఉంటుంది. ఈ పవిత్రమైన శుభ ముహుర్తంలో ప్రజలంతా అనంత చతుర్దశి ప్రత్యేక పూజలు చేస్తారు.

సూర్యోదయం తర్వాత..

సూర్యోదయం తర్వాత..

పురాణాల ప్రకారం, భాద్రపద మాసంలో వచ్చే అనంత చతుర్దశి రోజున కచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ పవిత్రమైన రోజు సూర్యోదయం తర్వాత రెండుసార్లు పూజ చేయాలి. అయితే అంత కంటే ముందే మీరు నిద్ర లేచి ఇళ్లను శుభ్రపరచుకోవాలి. అనంతరం స్నానం చేసి కొత్త బట్టలను ధరించాలి. దీని తర్వాత ఉపవాసం ఉంటామని తీర్మానం చేయాలి. ఈ పవిత్రమైన దేవుని ఊరేగింపు, వేడుకలు ఉత్సాహంగా జరుపుకోవాలి. ఉపవాసం ఉంటూ ఆచారాల పవిత్రతను కాపాడాలి.

ఇవి సమర్పించాలి..

ఇవి సమర్పించాలి..

అనంత చతుర్దశి రోజున ఆచారాల ప్రకారం దేవుళ్లకు పూలు, పండ్లు, మిఠాయిలు నైవేద్యాలుగా సమర్పించాలి. అనంతరం మీ చేతులకు పవిత్రమైన దారాన్ని కట్టుకోవాలి. పురుషులు తమ కుడి చేతిపై పసుపు దారాన్ని కట్టుకుంటే... మహిళలు ఎడమ చేతిపై కట్టుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. ఈ అనంత చతుర్దశికి 14 రకాలైన సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలన్నీ విష్ణువున మరియు 14 లోకాలపై అతని పరిపాలనను సూచిస్తారు.

విశ్వకర్మ ఎవరు? విశ్వకర్మ జయంతి ఎప్పుడు జరుపుకుంటారు?విశ్వకర్మ ఎవరు? విశ్వకర్మ జయంతి ఎప్పుడు జరుపుకుంటారు?

అనంత చతుర్దశి ప్రాముఖ్యత..

అనంత చతుర్దశి ప్రాముఖ్యత..

ఈ పవిత్రమైన రోజు విష్ణుమూర్తి మరియు వినాయకుడికి అంకితమిచ్చిన రోజు. ఈరోజున చాలా మంది హిందువులు ఉపవాసం ఉంటూ చేతులపై పవిత్రమైన దారాన్ని కట్టుకుంటారు. వినాయకుడిని తమ ఇళ్లల్లో, ఇతర ప్రాంతాల్లో ప్రతిష్టించిన వారు.. ఈరోజు స్వామి వారిని నిమజ్జనం చేస్తారు. ఈరోజున గణపతి తన లోకానికి అంటే స్వర్గలోకానికి తిరిగి వెళతాడని చాలా మంది నమ్మకం. వినాయక నిమజ్జనానికి ముందు గణపతికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఊరేగింపు తర్వాత వినాయకుని విగ్రహాలను నదులు, కాలువలు, చెరువులు, సముద్రాలలో నిమజ్జనం చేస్తారు.

పూజా విధానం..

పూజా విధానం..

అనంతర చతుర్దశి రోజున శ్రీ విష్ణుమూర్తికి సంబంధించిన అనంత రూపాలను స్మరించుకోవాలి. ఈరోజు స్నానం చేసిన తర్వాత ఒక పీట తీసుకొని దాని మీద కలశం ఉంచాలి. అలాగే విష్ణువు యొక్క చిత్రపటాన్ని కూడా ఉంచాలి. అనంతరం పసుపు, కుంకుమతో ముంచిన ఓ దారాన్ని సిద్ధం చేయాలి. దీనికి 14 నాట్లు ఉండాలి. ఈ దారాన్ని విగ్రహం ముందు ఉంచాలి. పూజ అనంతరం ఆ దారన్ని మీ చేతికి ధరించాలి. పూజ సమయంలో విష్ణు మంత్రాలను జపించాలి.

అనంత చతుర్దశి కథ..

అనంత చతుర్దశి కథ..

పురాణాల ప్రకారం.. కౌరవులు, పాండవులను ఓడిస్తారు. పాండవులు తమ రాజ్యాన్ని, తమ సంపదలను మరియు అన్ని విలాసాలను కోల్పోయి అరణ్యవాసానికి వెళ్లాల్సి వచ్చింది. ఈ కాలంలో వారు అనేక బాధలు పడాల్సి వచ్చింది. ఈ సమయంలో శ్రీక్రిష్ణుడు వారిని పలకరించేందుకు అడవికి వెళ్లాడు. పాండవులలోని యుదిష్టరుడు తనను గౌరవంతో పలకరించి.. తమకు ఒక మార్గం చూపమని కోరతాడు. దీని ద్వారా వారు తిరిగి ట్రాక్ కు వచ్చి తాము కోల్పోయిన రాజ్యం మరియు సంపదను గౌరవంతో తిరిగి పొందొచ్చు. ఇది విన్న ఆ భగవంతుడు అనంత చతుర్దశి రోజున ఉపవాసం ఉండి విష్ణువును స్మరించుకుంటే కచ్చితంగా ఫలితం ఉంటుందని చెబుతాడు. ఈరోజున విష్ణువు మరో అవతారం ఎత్తాడని చెబుతాడు. ఈ కాలంలో వామనవాతరంలో విష్ణుమూర్తి భూమి మీద ఉంటాడని.. కాబట్టి ఈ కాలంలో మీరు విష్ణువును పూజిస్తే మీ కష్టాలు, సమస్యలన్నీ తొలగిపోతాయని చెబుతాడు. అనంతరం యుదిష్టరుడు తన కుటుంబసభ్యులతో కలిసి ఈ అనంత చతుర్దశి రోజున ఉపవాసం పాటించాలని ప్రతిజ్ణ చేశాడు. అది విజయవంతంగా పూర్తయిన తర్వాత తాము కోల్పోయిన రాజ్యాన్ని మరియు సంపదను తిరిగి పొందుతారు.

English summary

Anant Chaturdashi 2021 date, shubh muhurat, rituals and significance

Here we are talking about the anant chaturdashi 2021 date, shubh muhurat, rituals, and significance in Telugu. Read on
Story first published:Friday, September 17, 2021, 14:55 [IST]
Desktop Bottom Promotion