For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు మిథునరాశికి చెందినవారా? మీకు ఈ సమస్యలు ఎదురుకావచ్చు.

|

మిధునరాశి వారు ఎప్పటికీ వారి సృజనాత్మక కళల పట్ల ప్రశంసలను పొందుతూనే ఉంటారు. అంత గొప్ప ఆలోచనా శక్తి వీరి సొంతం. ఏది మాట్లాడినా బాహాటంగా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడేలా కనిపించే వీరు, అవసరమైన మేరకే మాట్లాడేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. వారితో సంభాషణలు జరిపినప్పుడు, చర్చ మొత్తం వారికి అనుకూలంగానే ఉండేలా కనిపిస్తుంది మరియు వారిలో మంచితనం ప్రస్పుటంగా కనిపిస్తుంది. వారి ఆలోచనా విధానాన్ని తెలుసుకోవడం ఇతరులకు క్లిష్టతరమైన అంశంగానే ఉంటుంది. మానసిక పరిపక్వతకి మారుపేరుగా ఉంటారు మరియు ఒక్క చిన్ననవ్వుతో ఎటువంటి చర్చనైనా తమకు అనుకూలంగా మార్చుకునే నైపుణ్యం కలవారిగా ఉంటారు.

Are You A Gemini? You Might Face These Relationship Problems!

సంబంధ బాంధవ్యాల విషయంలోఈ మిధునరాశికి చెందిన వ్యక్తులు ఏవిదంగా వ్యవహరిస్తారు ?

విశ్వసనీయత కలిగి, అంకితభావం కూడుకుని, భావోద్వేగాలకు విలువిస్తూ, సంబంధ బాంధవ్యాలలో శ్రద్ధ వహించే మిధునరాశి వారు కూడా ఊహించని విధంగా, ఇతర రాశి చక్రాలతో పోల్చినప్పుడు కొన్ని విపరీత సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి.

1. స్వీయ శోషణ :

1. స్వీయ శోషణ :

మిధున రాశి వారు పూర్తిగా వారి వారి సొంత నిర్ణయాలు, నమ్మకాలు, ఎంపికల ప్రకారమే ముందుకు సాగుతుంటారు. మీరు ఎంతగా వారిని ప్రేమిస్తున్నా సరే, వారి నిర్ణయాలు వారివే అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. అంతేకాక, వారు అధిక మేధాసంపత్తికి కేంద్రబిందువుగా, తీవ్రమైన ఆలోచనలు చేసేవారిగా, మరియు భావాలను వ్యక్తపరచడంలో సాటిలేని వారిగా ఉంటారు. ఎక్కువగా వీరు తమ ఆలోచనలను రాత పూర్వకంగా తెలుపుటకు సుముఖత వ్యక్తం చేస్తుంటారు. వారి ఆలోచనా సరళిని అనుసరించే నిర్ణయాలు, అభిప్రాయాలు ఉంటాయి. మీరెన్ని ప్రణాళికలు చేసినా, వారి ఆలోచనలకు భిన్నంగా మాత్రం నిర్ణయాలు తీసుకోడానికి సిద్దంగా ఉండరు. ఇతరుల కన్నా తామే మంచి ఆలోచనలు కలిగి ఉన్నవారిగా భావిస్తుంటారు. అలా ప్రతి విషయంలోనూ స్వీయ మేధస్సు మీదే ఆధారపడడం మూలంగా కొన్ని సార్లు సంబంధాలలో సమస్యలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు; క్రమంగా వీరు కోరుకున్న వ్యక్తులు జీవిత భాగస్వాములుగా ఉన్నా, వారి మనసులో పూర్తి స్థాయిలో స్థానాన్ని సంపాదించలేని వారిగా ఉంటారు. ఇతరుల ఆలోచనలకు కూడా విలువిచ్చేలా మానసిక దృక్పధాన్ని అలవరచుకోవలసి ఉంటుంది.

2. ప్రేమతో ప్రేమలో పడడం :

2. ప్రేమతో ప్రేమలో పడడం :

మిధునరాశి వారు ప్రేమలో పడినా కూడా, ఎటువంటి జీవనశైలి మార్పులను అంగీకరించని వారిగా ఉంటారు. అనగా తమ తమ జీవితాల్లో ఎప్పటికీ తమలాగే నిలచి ఉండాలని కోరుకునే వారిగా ఉంటారు. క్రమంగా మార్పులను పూర్తి స్థాయిలో అంగీకరించని వారిగా ఉంటారు. తమ జీవిత భాగస్వామి కూడా, తమ యందు ప్రేమని కలిగి ఉండి తమ అభిప్రాయాలకు విలువనిచ్చేలా ఉండాలని ఆకాంక్షిస్తూ ఉంటారు. అలా లేనిచో, అసంతృప్తికి లోనవ్వడమే కాకుండా, చిరాకులు పరాకులను చూపిస్తూ ఉంటారు. క్రమంగా కొన్ని సమస్యలను కూడా ఎదుర్కోవలసిన పరిస్థితులు దాపురిస్తుంటాయి. ఒకవేళ ఇటువంటి మనస్తత్వం మీలో కనిపిస్తే, బంధాలు దూరం కాకుండా కొంతమేర సర్దుకుపోయే మనస్తత్వాన్ని అలవరచుకునేలా ప్రయత్నించాలి.

3. రొటీన్ జీవితం వద్దు :

3. రొటీన్ జీవితం వద్దు :

వారి ప్రేమ జీవితంలో కూడా తమ శైలిలో మార్పు ఉండకూడదని భావించే మిధున రాశి వారు, రొటీన్ జీవితాన్ని కూడా ఇష్టపడని వారిగా ఉంటారు. క్రమంగా ఒకరకమైన మానసిక గందరగోళానికి గురవుతూ ఉంటారు. కానీ తమ ఆలోచనా సరళి తమ ప్రేమ జీవితానికి ముగింపును ఇస్తుందేమో అన్న భ్రమలో, భయం కూడుకుని ఉంటారు. తాము ఎంతగా ప్రేమిస్తున్నారో, తమ భాగస్వామి లేదా కుటుంబ సభ్యులు కూడా అదేవిధమైన ప్రేమను తిరిగి పంచాలనే కోరికను బలంగా కలిగిన వారిగా ఉంటారు. మరియు రొటీన్ జీవితం భవిష్యత్తు మీద ఆశలు లేకుండా చేస్తుందన్న ఆలోచన వీరిది.

 4. అసంబద్దమైన విషయాలకు కూడా స్పందించడం :

4. అసంబద్దమైన విషయాలకు కూడా స్పందించడం :

మిధునరాశి వారు రెండు మనస్తత్వాల వ్యక్తిత్వ ధోరణులు కలిగిన వారుగా ఉంటారు కాబట్టి, ఇతరుల కన్నామెరుగైన ఆలోచనలు చేయగలిగిన వారిగా, మరియు చిన్నచిన్న విషయాల పట్ల కూడా పునరాలోచనలు చేసేవారిలా ఉంటారు. మరియు విశ్లేషణాత్మక అభిప్రాయాలు కలిగినవారిగా ఉంటారు. ఒక మంచి ఆలోచనాపరునిగా తమ సామర్థ్యాలను గురించిన పూర్తి అవగాహన కలిగిన వారిగా ఉంటారు. కానీ, ఇతరుల అభిప్రాయాలను మాత్రం పరిగణనలోనికి తీసుకునే ఆలోచనలు చేయరు. ఇటువంటి ఆలోచనా ధోరణులు అసంబద్దమైన సమస్యల గురించి కూడా తీవ్రమైన ఆలోచనలు చేసేలా ప్రోత్సహిస్తుంది. క్రమంగా వాదనలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా ఉంటారు. తమ అభిప్రాయాలతో ఏకీభవించని వారిని చిన్నపిల్లల మనస్తత్వాలు కలిగినవారిగా అభిప్రాయాలను ఏర్పరచుకుంటూ ఉంటారు. క్రమంగా సంబంధాలలో కొన్ని బేధాభిప్రాయాలు కలగడం సర్వసాధారణంగా ఉంటుంది.

5. నివసించే ప్రాంతంలో కూడా ప్రాదేశిక మార్పులు అవసరం :

5. నివసించే ప్రాంతంలో కూడా ప్రాదేశిక మార్పులు అవసరం :

మిధునరాశి వారు, వారి గది అలంకరణ దగ్గర నుండి ప్రతి చిన్న అంశం పట్ల, అంతర్గత ఆలోచనలు చేస్తుంటారు. వీరి ఆలోచనలు ప్రత్యేకంగా ఉండడమే కాకుండా, ఫలితాలు ఇతరులను ఆశ్చర్యపరచేవిలా కూడా ఉంటాయి. ఇతరుల నుండి స్వల్ప సహాయం కూడా తీసుకోకుండా, వారి స్వంత ఆలోచనలపైనే ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడంలో వీరి నిర్ణయాత్మక ధోరణులు ప్రతిబింబిస్తుంటాయి. నిజానికి ఆహ్వానించదగిన విషయమే అయినప్పటికీ, వాస్తవ కోణంలో భాగస్వాముల మద్య చిచ్చురేపేదిలా ఉంటుంది. తమ నిర్ణయాలలో ఆటంకాన్ని ఎన్నటికీ అంగీకరించనివారిగా ఉంటారు. తాము చెప్పినట్లుగానే, తమకు అనుకూలంగానే తమ నివాస స్థలం ఉండాలని భావించే వీరు, భాగస్వామి అభిప్రాయాలకు కూడా విలువివ్వాలని గమనించవలసి ఉంటుంది. లేనిచో కొన్ని అపార్ధాలకు, వాగ్వాదాలకు కారణంగా మిగిలిపోతారు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆద్యాత్మిక, జ్యోతిష్య, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Are You A Gemini? You Might Face These Relationship Problems! మీరు మిథున రాశికి చెందినవారా? మీకు ఈ సమస్యలు ఎదురుకావచ్చు.

Geminis are quick witted, generally silent people who would break their silence when with friends. They hold calculated opinions about everything that ever has existed in the world. You might think they have a double personality, which is a reflection of the twins representing Gemini sign. They mainly face five major problems when in relationships.
Story first published: Wednesday, October 3, 2018, 15:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more