For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్కూల్ లో పిల్లల పెర్ఫార్మెన్స్ పూర్ గా ఉన్నప్పుడు పాటించవలసిన ఆస్ట్రాలజికల్ రెమెడీస్

|

ఈ పోటీ ప్రపంచంలో, తల్లితండ్రులు తమ బిడ్డల ఎడ్యుకేషన్ విషయంలో ఎంతో శ్రద్ధను కనబరుస్తున్నారు. సరిగ్గా మార్క్స్ తెచ్చుకోని పిల్లలు తల్లిదండ్రులకు తలనొప్పిని తీసుకువస్తున్నారు. నిజానికి, తల్లిదండ్రులు పిల్లల పెర్ఫార్మెన్స్ పట్ల అమితమైన ఒత్తిడికి గురవుతున్నారు. నిజానికి, ఎన్నో సందర్భాలలో, పిల్లలు ఏకాగ్రతను చూపించలేకపోయారు. ఎక్కువగా ఎలెక్ట్రానిక్ గాడ్జెట్స్ ని వాడటం అన్నిటికంటే ముఖ్యమైన ఒక విషయం. ఇది అటెన్షన్ ను డిస్టర్బ్ చేస్తుంది.

ఈ కారణాలతో పాటు, ఇంటి వాస్తు, పిల్లల స్టడీ రూమ్, పిల్లల రాశిచక్రం అలాగే చదివేటప్పుడు వారు కూర్చునే డైరెక్షన్ వంటివి కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విషయాన్నే, మనం ఈ రోజు ఈ ఆర్టికల్ లో చర్చించుకోబోతున్నాము.

గదిలోని వాస్తుకు సంబంధించిన చిట్కాలతో ప్రారంభిస్తూ పిల్లలు చదువుపై ఆసక్తిని పెంపొందించుకోవడానికి తోడ్పడే రెమెడీస్ ను చర్చించుకుందాం.

Astrological Remedies for Poor School Performance Of Children At School

గదిలోని వాస్తును చెక్ చేయడం మరచిపోకండి

1. ఇంటి నిర్మాణం జరిపేటప్పుడు లేదా ఇంటిని డిజైన్ చేసేటప్పుడు గదిని స్టడీ రూమ్ అనేది ఈశాన్యమూలలోఉండేలా జాగ్రత్త పడండి. ఇది సాధ్యం కాకపోతే, ఉత్తరం దిశగా ఉండటం కూడా తోడ్పడుతుంది. అయితే, ఆ గది తలుపు ఈశాన్యాన్ని ఫేస్ చేయాలి అన్న విషయాన్ని మరచిపోకండి.

2. మీరిక్కడ గుర్తుంచుకోవలసిన ఇంకొక విషయం ఏంటంటే, పిల్లల గదిపైన బాత్ రూమ్ ని నిర్మించకూడదు. ఒకవేళ అలా చేస్తే శక్తి మొత్తం డ్రెయిన్ అవుతుంది. నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. పిల్లల్లో పాజిటివ్ వైబ్స్ తో పాటు యాక్టివ్ నెస్ లు తగ్గుముఖం పడతాయి. అలాగే వాష్ రూమ్ అనేది బెడ్ కి అలాగే స్టడీ టేబుల్ కి ఎదురుగా ఉండకూడదు. ఒకవేళ ఆలా ఉంటే, డోర్ ను మూసి ఉంచండి.

3. డైరెక్షన్ తో పాటు గది యొక్క షేప్ కూడా ఎంతో కౌంట్ అవుతుంది. స్టడీ రూమ్ స్క్వేర్ షేప్ లో ఉండటం మంచిది. తద్వారా, అన్ని గదుల నుంచి వచ్చే వైబ్రేషన్స్ అనేవి బాలన్స్డ్ గా ఉంటాయి.

4. గ్రీన్ పెయింట్ ను ఎంచుకోండి అలాగే కర్టెన్స్ కూడా గ్రీన్ కలర్ లో ఉండేవి మంచిది. ఇది ఏకాగ్రతను మెయింటెయిన్ చేసేందుకు తోడ్పడుతుంది. మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. ఏకాగ్రతకు అడ్డుపడే వాటిని తొలగిస్తుంది.

5. మీరెంత శ్రమపడినా పిల్లలు ఏకాగ్రతను పెంచుకోలేకపోతే వారిని నిద్రించేటపుడు పాదాలను ఉత్తర దిశగా పెట్టుకుని నిద్రించమని చెప్పండి. దీని వలన ఏకాగ్రత స్థాయి పెరుగుతుంది. తూర్పు దిక్కుగా తలపెట్టి పడుకోవడం కూడా మంచిదే. దీంతో, సాత్విక్ వేవ్స్ అనేవి మనసుకు తాకుతాయి. నిద్ర లేవగానే పాజిటివ్ గా ఛార్జ్ అయినట్టు కనిపిస్తుంది.

6. స్టడీ రూమ్ లో బుక్ షెల్ఫ్ అనేది మీ పిల్లలకి ఎదురుగా ఉన్న స్టడీ టేబుల్ పైన ఉండకూడదు. ఇది చదివేటప్పుడు వారి ఏకాగ్రతను భగ్నం చేస్తుంది.

Astrological Remedies for Poor School Performance Of Children At School

7. కిటికీలు గదిలోని తూర్పు దిక్కున ఉండాలి.

8. తూర్పు లేదా ఈశాన్యం మూలలో స్టడీ టేబుల్ ను ఉంచాలి. కిటికీల వద్ద కాదు.

9. టేబుల్ పై ఎల్లప్పుడూ స్టడీ లాంప్ ను దగ్గరగా ఉంచండి. పిల్లలు వాడినా వాడకపోయినా స్టడీ లాంప్ ఉండాలి. ఇది చదివేందుకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగిస్తుందని అలాగే ఏకాగ్రతను పెంపొందించుతుందని నమ్ముతారు.

10. పరిగెత్తే గుర్రాలు, ఉదయించే సూర్యుడు మరియి ఇతర పాజిటివ్ మరియు శక్తివంతమైన సీన్స్ కలిగిన ఇమేజెస్ ను గదిలో అమర్చండి. నెగటివ్ ఇమేజెస్ ను పిల్లల గదిలోంచి తక్షణమే తొలగించండి.

11. సరస్వతీ మాత విజ్ఞానాన్ని అందించే దేవత. మాత ప్రతిమను దక్షిణ దిశలో అమర్చండి.

12. దక్షిణ దిశలో పిల్లలు సాధించిన ట్రోఫీస్, సర్టిఫికేట్స్ మరియు ఇతర అవార్డ్స్ ని పెట్టండి. ఇవి పిల్లల్ని మోటివేట్ చేసేందుకు తోడ్పడతాయి.

13. గాలి ఏ దిశలో వీచుతుందో అదే దిశలో పిల్లలు కూర్చుని చదువుకోవడం వారికంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ఇది చదివేటప్పుడు, ఏకాగ్రతను భగ్నం చేస్తుంది. అలాగే, గదులకు మరియు విండోలకు దగ్గరగా కూర్చోవడం కూడా మంచిది కాదు. ఏకాగ్రత భగ్నమవుతుంది.

14. చదివేటప్పుడు మీ పిల్లలు గోడను గాని లేదా ఏదైనా కార్నర్ ను గాని ఫేస్ చేయకుండా ఉండాలి. లేదంటే, ఎనర్జీ బ్లాక్ అవుతుంది. పిల్లల ఏకాగ్రత భగ్నమవుతుంది.

కొన్నిసార్లు, పిల్లలు ఎక్కువగా స్కోర్ చేయలేకపోవచ్చు. ఏకాగ్రత లోపం వలన కావచ్చు లేదా చదివింది జ్ఞప్తికి తెచ్చుకోలేక ఎగ్జామ్ లో సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోవచ్చు. అటువంటి సందర్భాలలో, ఇటువంటి కొన్ని రెమెడీస్ మీకు తోడ్పడతాయి.

Astrological Remedies for Poor School Performance Of Children At School

స్కూల్ లోని పిల్లల పెర్ఫార్మెన్స్ ను పెంపొందించే ఆస్ట్రాలజికల్ రెమెడీస్

1. మీ పిల్లలు బద్దకంగా ఉంటూ అందువలన చదివేందుకు ఆసక్తి కనబరచకపోతే వారు రాగిలో అమర్చబడిన పంచ్మేష రత్నాన్నీ లేదా బంగారంలో అమర్చబడిన నవమేష రత్నాన్ని ధరించేలా చూడండి.

2. వారు తీపి పదార్ధాలను ఎక్కువగా తినేలా చూడండి. ఏకాగ్రత లోపం వారి సమస్యైతే సాల్టీ ఫుడ్స్ ను వారు తక్కువగా తీసుకోవాలి.

3. వేపచెట్టుకు చెందిన కొమ్మను చిన్నది తీసుకుని దాన్ని గదిలోని డోర్ వద్ద అమర్చండి. ఇది నెగటివ్ ఎనర్జీని తరిమేందుకు తోడ్పడుతుంది.

4. ఏకాగ్రత కుదిరేందుకు బ్రహ్మముహూర్తం తోడ్పడుతుందని అంటారు. అందువలన, పిల్లలు బ్రహ్మముహూర్తంలో చదువుకోడాన్ని అలవాటుగా చేసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో చదివే సబ్జెక్టును ఎక్కువ సేపు గుర్తుంచుకోగలుగుతారు. ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు బ్రహ్మముహూర్తంగా పేర్కొంటారు.

5. చదువుకునేటప్పుడు పిల్లలు హెయిర్ ను కవర్ చేసుకోకూడదు. ఇది ఏకాగ్రతను భగ్నం కలిగించవచ్చు.

6. సులమని అకీక్ అనే ఒక రకమైన రాయిని స్టడీ రూమ్ లో ఆకుపచ్చని బట్టలో కవర్ చేయాలి. ఇది కూడా ఏకాగ్రతను పెంపొందించేందుకు తోడ్పడుతుంది.

7. కొన్ని సార్లు లెఫ్ట్ నాస్ట్రిల్ యాక్టివ్ గా ఉంటుంది. మరికొన్ని సార్లు రైట్ నాస్ట్రిల్ యాక్టివ్ గా ఉంటుంది. రైట్ నాస్ట్రిల్ ఎక్కువగా యాక్టివ్ గా ఉన్నప్పుడు పిల్లలు డిఫికల్ట్ సబ్జెక్టు పై దృష్టిపెట్టాలి. అలాగే, రైట్ నాస్ట్రిల్ యాక్టివ్ గా ఉన్నప్పుడు కుడి కాలు బయట పెట్టి స్కూల్ కి గాని ఎగ్జామ్ కి గాని వెళ్లినట్టయితే మంచే జరుగుతుంది. అలాగే ప్రవేశించేటప్పుడు లెఫ్ట్ నాస్ట్రిల్ యాక్టివ్ గా ఉంటే ఎడమ కాలు లోనికి పెట్టి ప్రవేశించాలి.

8. స్టడీ టేబుల్ పై ఎర్రటి క్లాత్ లో శ్రీ యంత్రాన్ని ఉంచాలి. చదవడానికి ఉపక్రమించే ముందు కొన్ని సార్లు శ్రీ యంత్రాన్ని చూస్తూ ఈ మంత్రాన్ని పఠించాలి.

"ఓం భావయే విద్యామ్ దేహి దేహి ఓం నమో"

ఈ రెమెడీస్ ను పాటించడం వలన పిల్లల స్కోర్ మెరుగవుతుందని మీరు భావించవచ్చు. అకాడెమిక్స్ లో వారు చక్కగా పెర్ఫార్మ్ చేయవచ్చు. ఈ రెమెడీస్ తప్పకుండా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము.

English summary

Astrological Remedies for Poor School Performance Of Children At School

Along with the vastu of the room of your children, there are some astrological remedies which you can adopt so that they start performing well at academics. The room should be located in the north or the northeast. The child must study facing east or north while studying. You can keep neem leaves at the door to keep negative energy at bay.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more