48 రోజుల అయ్య‌ప్ప దీక్ష‌- క‌ఠోర నియ‌మ‌నిబంధ‌న‌లు!

Posted By: sujeeth kumar
Subscribe to Boldsky

అయ్య‌ప్ప దీక్షను చాలా నిష్ట‌తో నియ‌మ నిబంధ‌న‌ల‌తో చేయాల్సి ఉంటుంది. దీక్ష పాటించేవాళ్లు ఉద‌యాన్నే చ‌ల్ల‌ని నీళ్ల‌తో స్నానం చేసి దేవుడ్ని కొల‌వాలి. 48రోజుల‌పాటు క‌ఠోర దీక్ష చేయాల్సి ఉంటుంది. అందులో కొన్ని మేము మీకు అందిస్తున్నాం. ఈ అయ్య‌ప్ప దీక్షా కాలంలో వాటిని చ‌దివి భ‌క్తి పార‌వ‌శ్యంలో మునిగితేలండి.

1. పనిలో ప్ర‌తి నిమిషం దేవుడి పైనే ధ్యాస ఉండాలి.

1. పనిలో ప్ర‌తి నిమిషం దేవుడి పైనే ధ్యాస ఉండాలి.

పనిలో ప్ర‌తి నిమిషం దేవుడి పైనే ధ్యాస ఉండాలి. స్వాములు చేసే ప్ర‌తి ప‌ని దేవుడి ల‌య‌కారంలో నిబద్ధ‌మై ఉంటుంది. చేసే ప‌నిని దేవుడికే అంకిత‌మివ్వాలి. భ‌గ‌వ‌ద్గీత కూడా ఇదే విష‌యాన్ని చెబుతుంది.

2.కోరిక‌, కోపం, అత్యాశ‌, ఆక‌ర్ష‌ణ వంటి ఉండకూడదు

2.కోరిక‌, కోపం, అత్యాశ‌, ఆక‌ర్ష‌ణ వంటి ఉండకూడదు

కోరిక‌, కోపం, అత్యాశ‌, ఆక‌ర్ష‌ణ వంటి శ‌త్రువుల‌ను దీక్ష‌లో ఉన్న‌వారు త్య‌జించాలి.

3. చెడు అలవాట్లకు దూరంగా

3. చెడు అలవాట్లకు దూరంగా

పేకాట‌, పొగ‌, మ‌ద్య సేవ‌నం, మాంసం తిన‌డానికి అస్స‌లే కూడ‌దు.

4. ప్రవర్తన

4. ప్రవర్తన

మాట‌ల ద్వారా, చేత‌ల రూపంలో ఎవ‌రికీ ఏ హానీ త‌ల‌పెట్ట‌రాదు.

5.సాటి స్వామిని క‌లిసిన‌ప్పుప‌డు ఆయ‌న‌ను అయ్య‌ప్ప‌స్వామిగానే కొల‌వాలి

5.సాటి స్వామిని క‌లిసిన‌ప్పుప‌డు ఆయ‌న‌ను అయ్య‌ప్ప‌స్వామిగానే కొల‌వాలి

48 రోజుల అయ్య‌ప్ప దీక్ష‌లో ఉన్న సాటి స్వామిని క‌లిసిన‌ప్పుప‌డు ఆయ‌న‌ను అయ్య‌ప్ప‌స్వామిగానే కొల‌వాలి. ఆయ‌న‌కు ష‌ర‌న‌మ్ అని న‌మ‌స్క‌రించి ప్ర‌ణామాలు చేయాలి. ఇందులో వ‌య‌సు, హోదా లాంటి తార‌త‌మ్యాలేమి లేవు.

6. గురుస్వామే దీక్ష‌లోని వారికి అయ్య‌ప్ప‌.

6. గురుస్వామే దీక్ష‌లోని వారికి అయ్య‌ప్ప‌.

గురుస్వామే దీక్ష‌లోని వారికి అయ్య‌ప్ప‌. ఆయ‌న‌కు సేవ చేయ‌డమంటే దేవుడ్ని కొల‌వ‌డ‌మే.

7. ఇగోల‌కు తావివ్వ‌రాదు.

7. ఇగోల‌కు తావివ్వ‌రాదు.

అయ్య‌ప్ప స్వామిని అత్యంత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో కొల‌వాలి. ఇందులో ఎలాంటి ఇగోల‌కు తావివ్వ‌రాదు.

8. కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం చాలా అవ‌స‌రం.

8. కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం చాలా అవ‌స‌రం.

దీక్ష‌లో ఉన్న‌వారికి కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం చాలా అవ‌స‌రం. మాన‌సికంగా, ఆర్థికంగా వారి తోడ్పాటు కావాల్సిందే. దీక్ష గొప్ప‌త‌నాన్ని తెలుసుకొని వారు అన్ని ర‌కాలుగా స‌హాయం చేయాలి. వారి దీక్ష‌కు ఏమాత్రం ఆటంకం క‌లిగించ‌రాదు. దీక్ష‌లోని లోతుపాతుల‌ను వాళ్లు అర్థం చేసుకోగ‌ల‌గాలి.

9. కుటుంబంలో ఎవ‌రైనా చ‌నిపోయినా లేదా కొత్త‌గా ఎవరైనా జ‌న్మించినా

9. కుటుంబంలో ఎవ‌రైనా చ‌నిపోయినా లేదా కొత్త‌గా ఎవరైనా జ‌న్మించినా

అనుకోని సంఘ‌ట‌న‌లో కుటుంబంలో ఎవ‌రైనా చ‌నిపోయినా లేదా కొత్త‌గా ఎవరైనా జ‌న్మించినా మాల‌ను అయ్య‌ప్ప చిత్ర‌ప‌టానికి స‌మ‌ర్పించి దీక్ష‌ను విర‌మించాలి. ఒక సంవ‌త్స‌రం ఆగాలి. అప్పుడే దీక్ష చేసేందుకు అర్హ‌త పొంద‌గ‌ల‌రు.

10. ప్ర‌తి సారీ క‌న్య‌స్వామిగా అయ్య‌ప్ప‌కు అర్పించుకోవ‌చ్చు

10. ప్ర‌తి సారీ క‌న్య‌స్వామిగా అయ్య‌ప్ప‌కు అర్పించుకోవ‌చ్చు

ప్ర‌తి సారీ క‌న్య‌స్వామిగా అయ్య‌ప్ప‌కు అర్పించుకోవ‌చ్చు. ఆయ‌న ఆశీర్వాదాన్ని పొందొచ్చు.

11. దీక్ష‌లో ఉన్న‌వారిని అయ్య‌ప్ప స్వామిగా ప‌రిగ‌ణిస్తారు.

11. దీక్ష‌లో ఉన్న‌వారిని అయ్య‌ప్ప స్వామిగా ప‌రిగ‌ణిస్తారు.

దీక్ష‌లో ఉన్న‌వారిని అయ్య‌ప్ప స్వామిగా ప‌రిగ‌ణిస్తారు. అందుకే త‌గిన గౌర‌వం ఇస్తారు. స్వామి అని పిలుస్తారు. ప్ర‌ణామాలు చెబుతారు. ఇక్క‌డ ఇలా చేస్తున్నందుకు ఏదో పెద్ద‌త‌నం వ‌చ్చింద‌ని భావించ‌న‌క్క‌ర్లేదు. ఆ ప్ర‌ణామాల‌న్నీ దేవుడికే చెందుతాయి. విన‌మ్రంగా వాటిని దేవుడికే స‌మ‌ర్పించాలి.

12. అంద‌రు మ‌హిళ‌లు భార్య‌తో స‌హా త‌ల్లితో స‌మానం

12. అంద‌రు మ‌హిళ‌లు భార్య‌తో స‌హా త‌ల్లితో స‌మానం

దీక్ష‌లో ఉన్న‌వారికి అంద‌రు మ‌హిళ‌లు భార్య‌తో స‌హా త‌ల్లితో స‌మానంగా అవుతారు. వాళ్ల‌ను అదే దృష్టితో చూడాలి.

13. ముఖ సౌంద‌ర్యంపై శ్ర‌ద్ధ చూప‌రాదు.

13. ముఖ సౌంద‌ర్యంపై శ్ర‌ద్ధ చూప‌రాదు.

ముఖ సౌంద‌ర్యంపై శ్ర‌ద్ధ చూప‌రాదు. దీంట్లో భాగంగా దీక్ష‌లో ఉన్న‌వారు త‌ల‌కు నూనె అంటించ‌డం, గెడ్డం తీసుకోవ‌డం, నూనె, స‌బ్బుల‌తో స్నానం చేయ‌డం నిషిద్ధం.

14. బ‌య‌ట తినేందుకు నిరాక‌రించాలి

14. బ‌య‌ట తినేందుకు నిరాక‌రించాలి

సాధ్య‌మైనంత వ‌ర‌కు బ‌య‌ట తినేందుకు నిరాక‌రించాలి. గ‌త్యంతరం లేని ప‌రిస్థితుల్లో వెజిటేరియ‌న్‌ ఆహారాన్ని భుజించాలి.

15. తుల‌సి ఆకుల‌ను వెంట ఉంచుకోవాలి

15. తుల‌సి ఆకుల‌ను వెంట ఉంచుకోవాలి

తుల‌సి ఆకుల‌ను వెంట ఉంచుకోవాలి. అది చెడు నుంచి దూరం ఉంచ‌గ‌లుగుతుంది.

భ‌క్తి పార‌వ‌శ్యంలో మునిగి తేలే అయ్య‌ప్ప స్వామి భ‌క్తుల‌కు ఈ ప్ర‌మాణాల‌న్నీ పాటిస్తుంటారు. దేవుడి ఆశీర్వాదం వారి వెంట ఎల్ల‌ప్పుడూ ఉంటుంది.

Ayyappa (48-day) Observation- Rules and Restrictions
Ayyappa (48-day) Observation- Rules and Restrictions

English summary

Ayyappa (48-day) Observation -- Rules and Restrictions

While my pocket books are in Tamil, I am attempting to compile the same in English. Should you find discrepancies, share your thoughts and observations as comments. Most of the rules and observationary regulations are purely for our own control and development -- to streamline our day-to-day chores.