For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘బతుకమ్మ’ఈ ఏడాది ఎందుకని ఆలస్యమైంది? ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా...

|

తెలంగాణ ఆడబిడ్డలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసే బతుకమ్మ పండుగ ఈ ఏడాది కాస్త ఆలస్యమవుతోంది. తాము నిత్య సుమంగళిగా ఉండాలని కోరుతూ గౌరమ్మకు అతివలు చేసే పూజలే బతుకమ్మ పండుగ.

అయితే ఈ సంవత్సరం అధిక మాసం రావడంతో బతుకమ్మ పండుగ కొన్నిరోజులు ఆలస్యమవుతోంది. ఈ అధిక మాసం సెప్టెంబర్ 18వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది.

ఈ అధిక మాసాన్నే 'మాల మాసం' అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం ఈ అధిక మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. తెలంగాణ సాంప్రదాయం ప్రకారం భాద్రప్రద అమావాస్య'పెత్తర్లమాస' రరోజున కుటుంబంలో పరమపదించిన పెద్దలకు మధ్యాహ్నం లోపు బియ్యాన్ని'స్వయం పాకాన్ని' దానం చేసి అదే రోజు మధ్యాహ్నం ఆనవాయితీగా 'ఎంగిలిపూల' బతుకమ్మను పేర్చుకుని తొమ్మిది రోజుల పాటు సద్దుల బతుకమ్మ వరకు వరుసగా బతుకమ్మలు పేర్చుకుని ఆడుకుంటారు.

అయితే ఈ ఏడాది ఈ పండుగ సమయంలో కొన్ని మార్పులు వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో అమావాస్య ఐదు రోజుల ముందు బహుళ దశమి తిథి నుండి ప్రారంభిస్తే.. మరికొన్ని ప్రాంతాల్లో మూడు రోజుల ముందు నుండి అంటే బహుళ ద్వాదశి నుండి బొడ్డెమ్మను పేర్చుకున్నారు. అయితే తెలంగాణలో అమావాస్య రోజున పువ్వులను ఎందుకు కోయకూడదు.. అసలు ఎందుకని ఆ నియమం ఉంది.. అమావాస్యకు ముందుగానే అంటే చతుర్దశి నాడే పువ్వులను ఎందుకు కోయాలి.. అమావాస్య రోజే బతుకమ్మను ఎందుకు పేర్చుకోవాలనే ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

2020లో అధిక మాసం ఎప్పుడొచ్చింది.. ఈ మాసంలో శుభకార్యాలు చేయొచ్చా? చేయకూడదా?2020లో అధిక మాసం ఎప్పుడొచ్చింది.. ఈ మాసంలో శుభకార్యాలు చేయొచ్చా? చేయకూడదా?

ఎంగిలిపూల బతుకమ్మ అంటే..

ఎంగిలిపూల బతుకమ్మ అంటే..

తెలంగాణ సంప్రదాయం ప్రకారం మొదటి బతుకమ్మను అశ్వీయుజ బహుళ అమావాస్యరోజున పేర్చుకుంటారు. అమావాస్య రోజున పువ్వులను కోయకూడదు అనే శాస్త్ర నియమం ఉంది. అందుకే అమావాస్య రోజు ముందు అనగా చతుర్దశి రోజున చెట్ల నుండి పువ్వులను కోసి, అమావాస్య రోజున బతుకమ్మను పేర్చుటకు వాడుంటారు. అప్పుడు అవి తాజాదనాన్ని కోల్పతాయి, కాబట్టి వాటిని ఎంగిలి పూలు అంటారు.

మరో కథనం..

మరో కథనం..

పువ్వులన్నీ మొగ్గ స్థాయి నుండి పుష్పంగా మారే క్రమంలో తుమ్మెదలు.. ఇతర కీటకాలు, పక్షులు పూల మకరందం కోసం వాటిపై వాలి మకరందాన్నిసేకరించడం వల్ల ఆ పూలన్నీ ఎంగిలిగా మారిపోతాయి. ఇలా ఏదో ఒక విధంగా తాజాదనాన్ని కోల్పోయిన పూలతో బతుకమ్మను పేర్చడం వల్ల లేదా కీటకాల వల్ల ఎంగిలి జరిగిందనే కారణంగా వీటికి ఎంగిలి పూల బతుకమ్మ అనే పేరు వచ్చింది.

ఎప్పుడు పేర్చుకోవాలంటే..

ఎప్పుడు పేర్చుకోవాలంటే..

సాధారణంగా ఎంగిలిపూల బతుకమ్మను సెప్టెంబర్ 17వ తేదీ గురువారం అమావాస్య నాడు పేర్చుకోవాలి. కానీ సెప్టెంబర్ 18 నుండి అధిక మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయం అనుకూలం కాదు కాబట్టి, నెలరోజుల తర్వాత అంటే అక్టోబర్ 17వ తేదీన శనివారం నాడు అశ్వీయుజ మాసంలో తొమ్మిది రోజుల వరకు సద్దుల బతుకమ్మను జరుపుకోవాలి.

వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతికూల శక్తి తొలగిపోవాలంటే ఈ చిట్కాలు పాటించండి...వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతికూల శక్తి తొలగిపోవాలంటే ఈ చిట్కాలు పాటించండి...

విభిన్నమై పూలను..

విభిన్నమై పూలను..

తెలంగాణలో గౌరీదేవిని తమకు నిత్య సుమంగళిత్వం అందించాలంటూ బతుకమ్మగా పూజించే రోజులు రానుండటంతో ఆడపడుచుల్లో అమితమైన ఆనందం కలుగుతుంది. ప్రపంచ చరిత్రలోనే విభిన్నమైన పూలను కొలిచే సాంప్రదాయం కేవలం బతుకమ్మ పండుగలోనే ఉండటం విశేషం.

తొమ్మిది రకాల బతుకమ్మలు..

తొమ్మిది రకాల బతుకమ్మలు..

బతుకమ్మ పేర్పులో వినియోగించే పూలన్నింటిలో ఔషధగుణాలు ఇమిడి ఉంటాయి. తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ.. రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ (ప్రసాదంగా ముద్దపప్పు, బెల్లం, పాలతో ప్రసాదం), నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజున బతుకమ్మ అలిగిన రోజు కావడంతో అర్రెం అంటూ బతుకమ్మను ఆడరు. ఏడో రోజు వేపకాయల బతుకమ్మ. ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మ. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా కొలుస్తారు.

తొమ్మిది రకాల నైవేద్యాలు..

తొమ్మిది రకాల నైవేద్యాలు..

తెలంగాణలోని బతుకమ్మ పండుగ జరిగే తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ప్రసాదాలను నైవేద్యంగా పెడతారు. దీన్నే వానయం ఇచ్చిపుచ్చుకోవడం అంటారు. వరి, సజ్జ రొట్టెలను, ముక్కలు చేసి చక్కెర పాకంలో వేసి ముద్దలుగా చేస్తారు. వీటినే మలీద ముద్దలని, కులీదని అంటారు. వీటితో పాటు రకరకాల సద్దులు చేస్తారు. అయితే ఈ నైవేద్యాలన్నీ జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా వేర్వేరుగా ఉంటాయి. వాయినాలతో తమ మధ్య మరింత బంధం పెరుగుతుందని తెలంగాణ ఆడబిడ్డలు భావిస్తారు.చివరి రోజైన తొమ్మిదో రోజు మాత్రం బతుకమ్మకు పెరుగన్నం సద్ది, చింతపండు పులిహోర సద్ది, నిమ్మకాయ పులిహోర సద్ది, కొబ్బరి తురుము సద్ది, నువ్వుల పొడి కలిపిన సద్ది చేస్తారు. కొన్ని చోట్ల ఐదు రకాల చేస్తే, మరికొన్ని చోట్ల తొమ్మిది రకాల సద్దులు చేస్తారు.

గ్రహాల మార్పుతో ఈ రాశుల వారు చాలా అదృష్టవంతులవుతారు... మీ రాశి ఉందేమో చూడండి...గ్రహాల మార్పుతో ఈ రాశుల వారు చాలా అదృష్టవంతులవుతారు... మీ రాశి ఉందేమో చూడండి...

ఒక్కో పువ్వుకు ఒక్కో గుణం..

ఒక్కో పువ్వుకు ఒక్కో గుణం..

బతుకమ్మ పండుగలో వినియోగించే పూలన్నింటిలో అనేకరకాల ఔషధగుణాలు ఉంటాయి. తంగేడు పువ్వుకు సూక్ష్మజీవులను చంపే గుణం ఉంటుంది. చెరువులో నీరు శుద్ధి కావడానికి తంగేడు పువ్వు ఉపయోగపడుతుంది. గునుగు పువ్వులో జీర్ణకోశాన్ని శుద్ధి చేసే గుణం ఉంటుంది. సీత జడ పువ్వు జలుబు, ఆస్తమాను దూరం చేస్తుంది. మందారపువ్వు చండ్రు రాకుండా చేస్తుంది. కట్ల పువ్వు తొడిమలు అజీర్ణం కాకుండా అరికడతాయి. గుమ్మడి పువ్వులో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇలా బతుకమ్మలో ఉపయోగించే వివిధ రకాల పూలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.

బతుకమ్మ నిమజ్జనంతో చెరువులన్నీ శుద్ధి జరిగి స్వచ్ఛమైన నీటిని కలిగి ఉంటాయి.

ఎలాంటి భేదం లేకుండా..

ఎలాంటి భేదం లేకుండా..

ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలంతా అందరూ ఒకేచోటకు చేరి, ఒకేసారి చప్పట్లు కొడుతూ, ఒక్కొక్కరూ పాడుకుంటూ అందరూ వారికి గొంతులు కలుపుతుంటారు. బతుకమ్మను ఆడటంలో కులమతాలు, పేద, ధనిక తేడాలే ఉండవు. పాటల్లో పల్లవుల ప్రతీపాదం చివరన కోలు, ఉయ్యాల, చందమామ, గౌరమ్మలో ఏదో ఒకటి తప్పనిసరిగా ఉంటుంది. శ్రమైక్య సౌందర్యానికి నిదర్శనంగా వ్యవసాయ పనులు చేసుకుంటూ పాటలు పాడటం ఇప్పటికీ చాలా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది.

తొమ్మిదిరోజులు విశ్రాంతి..

తొమ్మిదిరోజులు విశ్రాంతి..

తెలంగాణ ఆడబిడ్డల్లో ఎక్కువగా వంటింటికీ పరిమితమై, రోజు వారీ లేదా ఇతర పనులతో అలసిపోయే వారంతా సాయంత్రం ఒకచోటకు చేరి ఆటపాటలతో గడుపుతారు. వివాహం చేసుకున్న వారంతా పుట్టింటికి చేరుకుంటారు. ఇలా తొమ్మిదిరోజులు వారికి విశ్రాంతి లభిస్తుంది. దేశవ్యాప్తంగా దసరా నవరాత్రుల పేరుతో దుర్గాదేవిని పూజిస్తే తెలంగాణ ఆడపడుచులు మాత్రం దుర్గామతను గౌరీదేవిగా కొలుస్తారు.

ఈ రెండు సందర్భాలే..

ఈ రెండు సందర్భాలే..

ఓనం కూడా కొంచెం ఇలానే.. సందె చీకట్ల మధ్య చెరువులోని నటి అలలమీద బతుకమ్మలు ముందుకు వెనుకకు కదులుతూ ఉంటే అదొక ఉద్వేగం. పోయిరావమ్మ బతుకమ్మ.. పోయిక రావమ్మ.. మళ్లీ వచ్చే ఏడాది తిరిగి రావమ్మ అంటూ శ్రీ లక్ష్మీ నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ అంటూ పాటలు పాడతారు. వారు తెచ్చిన ప్రసాదాలు, ఫలహారాలు తబకుల్లో పోసి ఒక్క దగ్గర అందరూ కలసిపోతారు. తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన బతుకమ్మ గురంచి సినిమాలు కూడా వచ్చాయి. కేరళలో ఓనం పండుగ అటూ ఇటూగా ఇలాగే ఉంటుంది. ఆడబిడ్డలు ఆడుకునే అందమైన, అద్భుతమైన పూల జాతర. ఈ రెండు సందర్భాలను మినహాయిస్తే పూల సమ్మేళనంతో కూడిన పండుగలు ప్రపంచంలో మరెక్కడా కనిపించవు.

English summary

Bathukamma Festival 2020 Dates, Importance and Why it is Celebrated?

Here we talking about Bathukamma Festival 2020 : Why is Bathukamma celebrated? about the festival and its importance. Read in.