For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశవ్యాప్తంగా ఆకట్టుకుంటున్న ఉత్తమ వినాయక విగ్రహాలివే..

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న పర్యావరణ కాలుష్యం గురించి అవగాహన పెంచుకున్న ప్రజలు ఈ ఆది దేవుని పండుగను జరుపుకునేందుకు పర్యావరణ అనుకూల పద్ధతులను పాటించారు.

|

వినాయక చవితి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా విఘ్నేశ్వరుని విగ్రహాలు కొలువుదీరిన సంగతి తెలిసిందే. అయితే మన దేశంలో ఇటీవల పర్యావరణ అనుకూలమైన గణేశుడి విగ్రహాలను రూపొందించేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని అందరూ అత్యంత గొప్పగా సద్వినియోగం చేసుకున్నారు.

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న పర్యావరణ కాలుష్యం గురించి అవగాహన పెంచుకున్న ప్రజలు ఈ ఆది దేవుని పండుగను జరుపుకునేందుకు పర్యావరణ అనుకూల పద్ధతులను పాటించారు. ఈ వినాయక చవితి పండుగకు రంగులు తక్కువగా ఉండేందుకు ప్రయత్నించారు. మట్టి గణపతి విగ్రహాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తయితే పలు రాష్ట్రాలలో ఆయా పదార్థాలతో ప్రతిష్టించిన విగ్రహాలు దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వాటి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Ganesh Chaturthi

తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత పొడవు గల విగ్రహం..

ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ లో అత్యంత ఎత్తు ఉండే విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ ఏడాది వినాయక విగ్రహం 61 అడుగుల ఎత్తు వరకు ఉండి అందరినీ ఆకట్టుకుంటోంది.
కర్నాటక రాజధాని బెంగళూరులోని జెపి నగర్ఆ వద్ద ఉన్న శ్రీ సత్య గణపతి దేవాలయంలో తొమ్మిది వేల కొబ్బరికాయలను ఉపయోగించి పర్యావరణ అనుకూల వినాయక విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహాన్ని చూడటానికి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు.

1) తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని పూంపూకర్ నగర్ లో రుద్రాక్షలతో వినాయక విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్టించారు. కోలథూర్ లోని కలబంద ఆకులు మరియు వలంపూరిలో శంఖం షెల్ తయారు చేశారు. చెన్నై నగరంలోని మరో ప్రముఖ ప్రాంతమైన ఎగ్మోర్ లో ఇండియన్ ఆర్మీ అవతారంలో ఉన్న వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించారు.

2) ఒడిశాలో ఇసుక గణపతి..

ప్రముఖ ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని సముద్రపు ఒడ్డు వద్ద ఇసుక గణేశుడిని రూపొందించాడు. ప్లాస్టిక్ లకు వ్యతిరేకంగా శక్తివంతమైన సందేశాలను సృష్టించాడు. ఆ వినాయకుడి చుట్టూ వెయ్యి రకాల ప్లాస్టిక్ వస్తువులను ఏర్పాటు చేశాడు. పర్యావరణాన్ని కాపాడమనే నినాదాలను ఇసుకలో అద్భుతమైన రంగులతో రూపొందించాడు.

3) ఆంధ్రప్రదేశ్ లోని రాజధాని ప్రాంతమైన కృష్ణా జిల్లాలోనూ అత్యంత ఆసక్తికరమైన వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. నందిగామ పట్టణంలో మొత్తం చెరకుతో తయారు చేసిన వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహం కూడా భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

4) మహారాష్ట్రలోని ముంబై మహానగరంలో అయితే ఈ సంవత్సరం వినూత్నమైన వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించారు. మన దేశంలో ఈ విగ్రహం గురించే చాలా మంది చర్చించుకుంటున్నారు. ఎందుకంటే అది అంతగా పాపులర్ అయ్యింది. ఇంతకీ ముంబైలో ఎలాంటి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించారంటే ప్రసిద్ధ పండల్ యొక్క ఇతివృత్తం భారతదేశ చంద్ర మిషన్ చంద్రయాన్-2 వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించారు. అలాగే ముంబైలోని ఓ ప్రాంతంలో నాయకుడి విగ్రహం చూసేందుకు ఒకరోజు మొత్తం మహిళలకు కేటాయిస్తారంట. ఆ రోజున మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుండి మహిళా భక్తులంతా కలిసి ఒకే రకమైన వస్త్రాలను ధరించి వినాయకుని దర్శకుని నిమిత్తం వస్తారంట. ఆ సమయంలో మహిళా లోకమంతా కలసి వచ్చినట్టు కనిపిస్తుంది.

English summary

Ganesh Chaturthi 2019: Best Ganesha Idols From Around The Country

This year for Ganesh Chaturthi festival, in Lalbaugcha Raja, Mumbai, the theme of the famous pandal is India's lunar mission Chandrayaan-2.
Desktop Bottom Promotion