For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Navratri 2021 : దసరా వేళ బొమ్మల పండుగకు ఎందుకంత ప్రాధాన్యతో తెలుసా...!

|

హిందూ సంప్రదాయం ప్రకారం, దేవీ శరన్నవరాత్రులంటే దుర్గాపూజను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో అలంకరించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. మూలానక్షత్రం రోజు సరస్వతీ పూజను, అష్టమి రోజు దుర్గాష్టమిగా, ఆయుధ పూజలను, నవమిని మహర్నవమిగా జరుపుకుంటారు.

పదో రోజు కూడా శరన్నవరాత్రులకు అనుబంధంగా ఉంటుంది. ఈ దశమిని విజయదశమి అంటారు. మహాభారతంలో అజ్ణాతవాసానికి ముందు పాండవులు ఆయుధాలన్నింటినీ జమ్మి చెట్టుపై ఉంచి తర్వాత ఆ చెట్టును పూజించారు. ఆరోజు ఈ చెట్టును పూజించడం సాంప్రదాయంగా వస్తోంది.

ఇదిలా ఉండగా.. దసరా పండుగ సమయంలో బొమ్మల కొలువు పెట్టడం దక్షాణాది ప్రజలు ఆనవాయితీగా పాటిస్తున్నారు. ఇదే సంప్రదాయాన్ని ఉత్తరాది ప్రజలు సంక్రాంతికి, మరికొందరు దీపావళికి పాటిస్తారు.

ఏడు, తొమ్మిది లేదా పదకొండు మెట్లు పెట్టి పూజిస్తారు. తొలిరోజున కలశంతో పూజను ప్రారంభించి.. శ్రీవిష్ణుమూర్తి యొక్క దశావతారాలను, అష్టలక్ష్ములూ, క్రిష్ణ లీలలు, త్రిమూర్తులు, శ్రీరామ కుటుంబం, శివ కుటుంబం, క్రిష్ణ బ్రుందావనం, కుచేల స్నేహం, రామాయణ ఘట్టాలవంటివన్నీ ఈ బొమ్మల కొలువులో ఉంటాయి. అలాగే గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి దేశ నాయకుల బొమ్మలను కూడా ప్రదర్శిస్తారు. మన భారతీయ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను, వారసత్వ విలువలను భవిష్యత్ తరాలకు తెలియజెప్పే వ్యవహారమే ఈ బొమ్మల కొలువు లక్ష్యంగా అనిపిస్తుంది.

దుర్గాదేవికి మీరు ఏమి సమర్పిస్తే మీ మనస్సులోని కోరికలు నెరవేరుతాయో మీకు తెలుసా?

బొమ్మల ఉత్సవం..

బొమ్మల ఉత్సవం..

హిందూ సంప్రదాయం ప్రకారం దక్షిణాదిన వివిధ రకాల బొమ్మల ప్రదర్శన ద్వారా కర్నాటకలో దసరా బొమ్మల పండుగను జరుపుకుంటారు. బొమ్మలను బేసి సంఖ్యలో దశలు లేదా శ్రేణులు(7,9 లేదా 11) ఉన్న మెట్ల రూపంలో ఏర్పాటు చేస్తారు. వీటిపై తెల్లని బట్టని అమర్చి, దాని మీద క్రమ పద్ధతిలో బొమ్మలను పెడతారు.

తొమ్మిది దశలను..

తొమ్మిది దశలను..

నవరాత్రి యొక్క తొమ్మిది రాత్రులను సూచించడానికి చాలా మంది తమ ఇళ్లలో బొమ్మల ప్రదర్శన కోసం తొమ్మిది దశలను ఉపయోగిస్తారు. ఈ పవిత్రమైన సమయంలో బొమ్మలను పూజించడం ఆనవాయితీగా పాటిస్తారు.

కొత్త వధువుకు..

కొత్త వధువుకు..

ఈ పండుగ సమయంలో కొత్తగా పెళ్లి చేసుకున్న పెళ్లికూతురికి తన సొంత కుటుంబాన్ని ప్రారంభించడానికి మరియు పండుగ సంప్రదాయాన్ని కొనసాగించడానికి ఈ బొమ్మలను ఆమె తల్లిదండ్రులు అందజేస్తారు. ఈ బొమ్మలను పట్టాడా గొంబే లేదా పట్టాత్ బొమ్మాయికల్ అని పిలుస్తారు.

దుర్గా పూజ సందర్భంగా తల్లి దుర్గాదేవి ఆశీర్వాదం పొందడానికి ఏమి చేయాలో మీకు తెలుసా?

తొమ్మిది రూపాల్లో..

తొమ్మిది రూపాల్లో..

పట్టాడా గొంబే జత చెక్కతో తయారు చేసిన సాంప్రదాయ బొమ్మల సముదాయాన్ని కాగితాలు లేదా పట్టువస్త్రాలు ఉపయోగించి రంగురంగులుగా ధరిస్తారు. ఈ ప్రధాన జత బొమ్మలను ఎల్లప్పుడూ సాంప్రదాయ శైలిలో ధరిస్తారు. సాధారణంగా ఈ పండుగలో రాముడు, లక్ష్మణ, సీత, క్రిష్ణ, రాధ, శివ, విష్ణు, దుర్గా, లక్ష్మీ, సరస్వతి మొదలైన ప్రతిమలను ఉపయోగిస్తారు.

శుభ సమయంలో..

శుభ సమయంలో..

ప్రతి ఇల్లు బొమ్మల పండుగను ప్రారంభించడానికి ఒక సమయాన్ని ఎంచుకుంటుంది. బొమ్మల శ్రేణులు లేదా దశలపై నిర్దిష్ట క్రమం ప్రకారం అమర్చబడి ఉంటాయి.

దేవుళ్లకు అంకితం..

దేవుళ్లకు అంకితం..

దసరా పండుగ సందర్భంగా తొలి మూడు దశలలో ఈ విగ్రహాలు దేవతలకు అంకితం చేయబడ్డాయి. నాలుగు నుండి ఆరు దశలలో గొప్ప సాధువులు లేదా రాజులు మరియు రాణులను వర్ణించే బొమ్మలను ఏర్పాటు చేస్తారు. ఈ పండుగ సందర్భంగా మైసూరు రాజులకు తగిన ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది.

నవరాత్రి: సంధి పూజ సందర్భంగా దుర్గాదేవి ముందు 108 తామరలను అర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

చివరి మూడు దశలు..

చివరి మూడు దశలు..

ఏడో దశలో హిందూ పండుగలు, వేడుకలు మరియు సందర్భాలను ప్రదర్శించడానికి అంకితం చేయబడింది. ఎనిమిదో దశలో ఒక ఉద్యానవనం, దుకాణం, కూరగాయల అమ్మకందారుల చిత్రాలతో అలంకరించబడి ఉంటుంది. చివరగా మానవజాతి లేదా జీవుల పరిణామాన్ని సూచిస్తుంది.

బొమ్మల పండుగ చరిత్ర..

బొమ్మల పండుగ చరిత్ర..

పురాణాల ప్రకారం, దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించేందుకు దేవతలు ఆమెకు అన్ని శక్తులను ఇచ్చారు. ఈ సమయంలో దేవతలు బలహీనులుగా మారారు. అయితే మహిషాసురుడిపై అమ్మవారు పదో రోజు విజయం సాధించారు. ఆ డైటీల ఆత్మబలిదానానికి గౌరవం ఇవ్వడానికి బొమ్మల పండుగను దేవతలను బొమ్మల రూపంలో పూజించడం ద్వారా పాటిస్తారు. ఈ ఆచారం విజయనగర రాజ్యం ఉనికిలో ఉన్నప్పటి నుండి ప్రబలంగా ఉందని చాలా మంది నమ్ముతారు.

బొమ్మల పండుగ ప్రాముఖ్యత..

బొమ్మల పండుగ ప్రాముఖ్యత..

ఈ బొమ్మల పండుగను ఎక్కువగా, కర్నాటకలో ఘనంగా నిర్వహిస్తారు. కొత్త తరం భూమి యొక్క గొప్ప కల్చర్ మరియు పురాణాలను పరిచయం చేస్తుంది. దసరా పండుగ సందర్భంగా దైవిక ఆశీర్వాదం పొందడం మరియు పిల్లలను అలరించడం కూడా ఒక మార్గం. అయితే సాంప్రదాయ బొమ్మల తయారీ రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. దసరా పండుగ సందర్భంగా మైసూర్ బొమ్మల భూమి అవుతుంది. పండుగ సమయంలో బంకమట్టి బొమ్మల తయారీని సజీవంగా ఉంచడాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రతి ఏడాది కొన్నిరోజులు పెద్దవాళ్లు పిల్లలుగా మారడానికి అనుమతిస్తుంది.

దసరా పంండుగ వేళ దుర్గా పూజతో పాటు ఇంకా ఏ వేడుకలు జరుగుతాయి?

నవరాత్రులు ముగిసిన తర్వాత వచ్చేదే దసరా పండుగ. ఈ సమయంలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇదే సమయంలో బొమ్మల వేడుకలు కూడా ప్రముఖంగా నిర్వహిస్తున్నారు.

English summary

Dasara Doll Festival, History, Importance and Significance of in Bommala Koluvu in Telugu

Here we talking about navratri 2021:dasara doll festival - history, rituals, customs and significance. Read on