బల్లి అక్కడ పడితే ఏమవుతుందో తెలుసా? మగవారి తలపై బల్లి పడితే ఏమవుతుంది? స్త్రీల కుడిభుజంపై పడితే!

Subscribe to Boldsky

బల్లి శరీరంపై పడితే మనలో చాలా మంది ఆందోళనపడుతుంటారు. బల్లిశాస్త్రంపై అవగాహన లేక ఏం చెయ్యాలో అర్థం కాక సతమతం అవుతూ ఉంటారు. అయితే బల్లి మన శరీరంపై ఎక్కడ పడినప్పటికీ వెంటనే తలస్నానం చేసి, దీపం పెట్టి, నైవేద్యంతో ఇష్ట దైవమును ప్రార్థించాలి. బల్లి లేదా తొండ తల మీద నుంచి కిందకు దిగితే మంచిది కాదు. కింద నుంచి పైకి పాకి వెంటనే దిగితే మంచిది. శరీరంపై కొన్ని ప్రత్యేక స్థానాల్లో బల్లి పడటం వల్ల కొన్ని రకాల ఫలితాలు కలుగుతాయి. అలాగే కొన్ని రకాల నష్టాలు కూడా కలుగుతాయి.

విషాహారం

విషాహారం

ఇక బల్లిని విష పురుగుగా చెబుతుంటారు. బల్లి కరువకపోయినా, బల్లి పడిన ఆహారాన్ని తీసుకుంటే దాన్ని విషాహారంగా చెబుతుంటారు. అప్పుడప్పుడు బల్లి మన మీద పడ్డటప్పుడు కానీ, మీద పాకుతూ వెళ్ళినప్పుడు లేదా మనల్ని తాకినప్పుడు భవిష్యత్తులో ప్రమాదమని పెద్దలు చెబుతుంటారు. బల్లి మీద పడితే ఏమవుతుంది? బల్లి శరీరంపై పడితే ఏమవుతుందని చాలా మంది భయపడతుంటారు.

మగవారి తలపై బల్లి పడితే మరణం

మగవారి తలపై బల్లి పడితే మరణం

మగవారి తలపై బల్లి పడితే మరణం వెంటాడుతుందని సంకేతం. ముఖంపై పడితే ఆర్థిక సమస్యల నుంచి బయట పడి లాభాల బారిన పడతారు. ఎడమ కన్నుపై పడితే అంతా శుభమే జరుగుతుంది. కుడి కన్నుపై పడితే చేసే పని విజయవంతం కాదు. అపజయం కలుగుతుంది. నుదురుపై పడితే ఇతర సమస్యలు రావడం, విడిపోవడం లాంటివి జరుగుతుంది.

రెండు పెదవుల మధ్య పడితే మృత్యువు

రెండు పెదవుల మధ్య పడితే మృత్యువు

కుడి చెంపపై పడితే బాధలు ఎక్కువవుతాయి. ఎడమ చెవిపై పడితే ఆదాయం బాగా వస్తుంది. పైపెదవి అయితే కలహాలు వెంట పడతాయి. కింది పెదవి ఆదాయంలో లాభం కలుగుతుంది. రెండు పెదవుల మధ్య పడితే మృత్యువు సంభవిస్తుంది. వీపుపై ఎడమ భాగం విజయం కలుగుతుంది. మణికట్టు అలంకార ప్రాప్తి కలుగుతుంది. మోచేయి డబ్బు నష్టం.

మీసాలపై పడితే కష్టాలు

మీసాలపై పడితే కష్టాలు

వేళ్ళపై పడితే అనుకోకుండా బంధువులు, స్నేహితుల రాక, కుడి భుజంపై పడితే కష్టాలు, సమస్యలు. ఎడమ భుజం పదిమందిలో అవమానం జరుగుతుంది. తొడలపై పడితే దుస్తులు, వస్త్రాలు నాశనమవుతాయి. మీసాలపై పడితే కష్టాలు వెంటాడుతాయి. కాలి వేళ్ళపై అయితే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. పాదములపై అయితే ప్రయాణానికి సిద్ధం అని అర్థం. ఇవన్నీ పురుషులపై బల్లి పడితే కలిగే విషయాలు.

స్త్రీలకు వక్షస్ధలంపై పడితే

స్త్రీలకు వక్షస్ధలంపై పడితే

ఇక స్త్రీలపై బల్లి పడితే... తలపై పడితే మరణ భయం, కొప్పుపై రోగాల భయం, పిక్కలపై బంధువుల రాక, ఎడమ కన్ను భర్త వేరొకరి ప్రేమను పొందుతారట, కుడి కన్ను మనోవ్యధ, రొమ్ము (వక్షస్ధలం) మంచి జరుగుతుంది, కుడి చెంప మగ శిశువు జన్మిస్తాడని, కుడి చెవి ధనలాభం.. ఆదాయం, పై పెదవి విరోధములు కలుగుతాయి, కింది పెదవి కొత్త వస్తువులు మీ చెంతకు చేరుతాయి.

స్త్రీలకు కుడిభుజంపై పడితే

స్త్రీలకు కుడిభుజంపై పడితే

స్త్రీలకు రెండు పెదవులపై పడితే కష్టాలు, సమస్యలను ఫేస్ చెయ్యాలి. వీపు పైన పడితే మరణవార్తను వింటారు.. గోళ్ళపై పడితే చిన్నచిన్న కలహాలు గొడవలు.స్త్రీల ఎడమ చేయిపైన బల్లి పడితే మెంటల్ స్ట్రెస్, వేళ్ళపై పడితే నగల ప్రాప్తి కలుగుతుంది. కుడిభుజం కామరతి ప్రాప్తి కలుగుతుంది, తొడలు- కామము, మోకాళ్ళు ఆదరణ, అభిమానం, చీలమండలము కష్టాలు, కుడి కాలిపై పడితే గొడవలు, కాలివేళ్ళు పుత్రుడు జన్మిస్తాడు.

బ్రహ్మరంధ్రం మీద భయం

బ్రహ్మరంధ్రం మీద భయం

ఇక బల్లి ఎవరిపైనా అయినా సరే తలమీద పడితే కలహము, బ్రహ్మరంధ్రం మీద భయం కలుగుతాయి. జుట్టుమీద అయితే కష్టం, వెనుక జుట్టుపైన పడితే మృత్యు భయం, జడమీద మృత్యు భయం వంటివి కలుగుతాయి. అదేవిధంగా ముఖంపైన పడితే బందు దర్శనం, కనుబొమ్మల మీద కలహం, కుడి కన్నుమీద ఓటమి, ఎడమకన్ను మీద అవమానం, కుడిచెవి మీద దుర్వార్త వినటం, ఎడమచెవి మీద వర్తక లాభం, ముక్కుమీద ఆరోగ్య సమస్యలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది.

ఎడమ భుజముపైన పడితే స్త్రీ భోగము

ఎడమ భుజముపైన పడితే స్త్రీ భోగము

బల్లి పై పెదవిపైన పడితే వ్యయం, క్రింది పెదవి పైన లాభం, గడ్డము మీద కారాగృహప్రాప్తి, కంఠముపై శతృహాని, మెడపైన భయం, రొమ్ముమీద విజయం, కుడి భుజంపైన ఆరోగ్యం, ఎడమ భుజముపైన పడితే స్త్రీ భోగము కలుగుతాయి.

కడుపుపై పడితే సంతాన లాభం

కడుపుపై పడితే సంతాన లాభం

బల్లి గుండెలపైన పడితే భయం, కడుపుపై పడితే సంతాన లాభం, మోచేతినందు నష్టం, అరచేతినందు ధనలాభం, వెన్నుమీద భయం, పిరుదుల మీద శయ్యాలాభం, తొడ భాగంపైన విషపు జంతువుల వలన ప్రాణ భయం, మోకాలిపైన వాహనలాభం, పాదములమీద ప్రయాణము, వ్రేళ్ళపైన రోగము, అరికాలిపైన బల్లి పడితే ఉన్నత పదవులు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    effects of lizard falling on body parts of men and women

    effects of lizard falling on body parts of men and women
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more