For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శివుని అర్ధనారీశ్వర రూపం వెనుక అసలు రహస్యం..!!

|

ఇన్ యాంగ్ అంటే స్థూలంగా చీకటి వెలుగుల సమతుల్య సంగమం అని చెప్పవచ్చు. చీకటి వెలుగూ స్త్రీ పురుషులిద్దరిలో ఉంటాయి. ఒకరి వెలుగులో ఒకరు నిండిపోవడం ఒకరి చీకటిలో ఒకరు సేద తీరడం జీవన సూత్రం. అదే హిందూ జీవన విధానంలో అర్ధనారీశ్వర తత్వంగా చెప్పబడినది. ఇవన్నీ పరస్పర ప్రేమను దంపతు మధ్య బాంధవ్యం ఉండవలసిన తీరునూ అంతర్లీనంగా బోధిస్తూ ఉంటాయి. ఇవన్నీ ప్రపంచం పుట్టినప్పుటి నుండీ ఉన్నవే . తెలుసుకున్న వారికి తెలుసుకున్నంత..

ఆది దంపతులు - జగత్పితరులు 'జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ' అని 'జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ' అని స్తుతిస్తుంటారు. జగత్తుకంతటికీ తల్లిదండ్రులలాంటి వారు ఆ పార్వతీపరమేశ్వరులు. ఈ ఆది దంపతులు ఇద్దరూ దేహాన్ని పంచుకొని అర్ధనారీశ్వర అవతారంతో కన్పించటం కూడా అందరికీ తెలిసిందే. ఇంతకీ ఆ శివుడు అర్ధనారీశ్వరుడు ఎప్పుడయ్యాడు? ఆ అమ్మకు తన దేహంలో సగభాగాన్ని ఎలా కల్పించాడు? అసలు దాని వెనుక ఉన్న ప్రధాన కారణమేమిటీ? అనే విషయాలను వివరించి చెబుతుంది ఈ కథాసందర్భం.

శివుని అర్థనారీశ్వర రహస్యం?

శివుని అర్థనారీశ్వర రహస్యం?

సృష్టారంభ వేళలో బ్రహ్మ ద్వారా రచింపబడిన మానసిక సృష్టి విస్తరిల్లకపోవడంతో బ్రహ్మదేవునిలో తీవ్రమైన దుఃఖం కలిగింది. అప్పుడు ఆకాశవాణి వినవచ్చింది. బ్రహ్మా! మైథునీ సృష్టి చేయి. ఆకాశవాణిని ఆలకించి బ్రహ్మదేవుడు మైథునీ సృష్టిని చేయు సంకల్పించి నిశ్చయించాడు.

శివుని అర్థనారీశ్వర రహస్యం?

శివుని అర్థనారీశ్వర రహస్యం?

కానీ తత్సమయం వరకు నారీ జనోత్పత్తి కాకపోవడం వల్ల అతడు తన నిశ్చయంలో సఫలుడు కాలేకపోయాడు. శివపరమేశ్వరుని కృపారహితంగా మైథునీ సృష్టి కాజాలదు. అందులకే అతడు శివదేవుని ప్రసన్నుని చేసుకోవాలని కఠోరమైన తపస్సు చేయనారంభించాడు.

శివుని అర్థనారీశ్వర రహస్యం?

శివుని అర్థనారీశ్వర రహస్యం?

చిరకాల పర్యంతం బ్రహ్మదేవుడు తన హృదయంలో ప్రేమపూర్వకంగా శివమహేశ్వర ధ్యానం చేస్తూండిపోయాడు. అతని తీవ్ర తపస్సుకు ప్రసన్నుడైన ఉమామహేశ్వర భగవానుడు అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిచ్చాడు. దేవాదిదేవుడైన శివభగవానుని ఆ దివ్య స్వరూపాన్ని సందర్శించిన బ్రహ్మ అభిభూతుడై దండవత్ భూమిపై వరుండి అతని అలౌకిక విగ్రహానికి ప్రణమిల్లాడు.

శివుని అర్థనారీశ్వర రహస్యం?

శివుని అర్థనారీశ్వర రహస్యం?

అంత శివమహేశ్వరుడు : వత్సా! బ్రహ్మా! నాకు నీ మనోరథం అవగతమైంది. సృష్టి వర్థిల్లాలన్న భావంతో నీవు చేసిన కఠోరమైన తపస్సుకు నేను సంతుష్టి చెందాను. నేను నీ ఇచ్ఛను అవశ్యం నెరవేరుస్తాను. అంటూనే శివదేవుడు తన శరీరం నుండి ఉమాదేవిని వేరు చేశాడు. తదనంతరం శివపరమేశ్వరుని అర్ధాంగం నుండి వేరైన పరాశక్తికి బ్రహ్మదేవుడు సాష్టాంగప్రమాణం చేసి పలికాడు.

శివుని అర్థనారీశ్వర రహస్యం?

శివుని అర్థనారీశ్వర రహస్యం?

శివే! సృష్ట్యారంభంలో నీనాథుడూ దేవాది దేవుడు అయిన శంభు భగవానుడు నన్ను సృజించాడు. భగవతీ! ఆయన ఆదేశానుసారమే దేవతాది సమస్త ప్రజల మానసిక సృష్టి చేశాను. అనేక ప్రయాసల తరువాత కూడా ఆ సృష్టిని వర్థిల్లజేయడంలో నేను అసఫలుడనయ్యాను.

శివుని అర్థనారీశ్వర రహస్యం?

శివుని అర్థనారీశ్వర రహస్యం?

కనుక ఇప్పుడు స్త్రీ పురుష సమాగమం ద్వారా నేను ప్రజోత్పత్తిని చేసి సృష్టిని వర్ధిల్లజేయదలచాను. కానీ ఇంత వరకూ నారీకులం ప్రకటింపబడలేదు. నారీ కులాన్ని సృష్టించడం నాకు శక్తికి అతీతంగా ఉంది. దేవీ! నీవు సంపూర్ణ సృష్టికీ, శక్తులకూ ఉద్గమస్థానానివి.

శివుని అర్థనారీశ్వర రహస్యం?

శివుని అర్థనారీశ్వర రహస్యం?

హే మాతేశ్వరీ! నీవు నాకు నారీకుల సృష్టిని చేసే శక్తిని ప్రసాదింతువు గాక! నేను మరో ప్రార్థన చేస్తున్నాను. చరాచర సృష్టి వర్థనార్థం నా దక్షపుత్రునికి పుత్రీరూపంలో అవతరించ నీవు దయ చూపెదవు గాక! అని బ్రహ్మ అర్ధించాడు.

శివుని అర్థనారీశ్వర రహస్యం?

శివుని అర్థనారీశ్వర రహస్యం?

బ్రహ్మ ప్రార్థననాలకించి శివాని తథాస్తు అంటూ అతనికి నారీ కులాన్ని సృష్టించగలుగునట్టి శక్తిని ప్రసాదించింది. లక్ష్య సాధనకై ఆమె తన భృకుటీ మధ్యభాగం నుండి తనతో సమానమైన కాంతిమతి అయిన ఓ శక్తిని ప్రకటింపజేసింది. దానిని తిలకించి దేవదేవేశ్వరుడైన శివుడు చిరునవ్వు నవ్వుతూ దేవీ! బ్రహ్మ తపస్సు ద్వారా నిన్ను ఆరాధించాడు.

శివుని అర్థనారీశ్వర రహస్యం?

శివుని అర్థనారీశ్వర రహస్యం?

నీవతనిపై ప్రసన్నరాలవై అతని మనోభీష్టాన్ని నెరవేర్చుము అన్నాడు. పరమేశ్వరాజ్ఞను శిరోధార్యం చేసి ఆ శక్తి బ్రహ్మ ప్రార్థనానుసారం దక్షపుత్రి అయినది. అలా బ్రహ్మకు అనుపమ శక్తిని అనుగ్రహించి శివాని మహాదేవుని శరీరంలో ప్రవేశించింది. తరువాత మహాదేవుడు కూడా అంతర్థానమై పోయాడు. నాటి నుండియే ఈ లోకంలో మైథానీ సృష్టి కొనసాగింది. సఫల మనోరథుడైన బ్రహ్మ శివపరమేశ్వరుని స్మరించుకుంటూ నిర్విఘ్నంగా సృష్టిని విస్తరిల్లజేశాడు.

శివుని అర్థనారీశ్వర రహస్యం?

శివుని అర్థనారీశ్వర రహస్యం?

అలా శివ- శక్తులు పరస్పరాభిన్నులై సృష్టికి ఆదికారణులైనవారు. పుష్పంలో గంధమూ, చంద్రునిలో వెన్నెల, సూర్యునిలో ప్రభ నిత్యులై, స్వభావ సిద్ధులై ఉన్నట్లే శివునిలో శక్తి కూడా స్వభావ సిద్ధయై రాజిల్లుతూ ఉంటుంది. శివునిలో ఇ కారమే శక్తి అయి ఉన్నది. శివుడు కూటస్థతత్వం కాగా శక్తి పరిణామ తత్త్వమై భాసిల్లుతూ ఉంటుంది. శివుడు అజన్ముడు, ఆత్మకాగా శక్తి జగత్తులో నామరూపాల ద్వారా వ్యక్తి సత్తాగా ఉంటుంది. అర్థనారీశ్వర శివుని రహస్య మిదియే.

English summary

Facts about Ardhanarishvara

Ardhanarishvara – When the Ultimate Man Became Half-Woman,Generally Shiva is referred to as the ultimate man, he is the symbolism of ultimate masculinity, but you will see in the Ardhanarishvara form of Shiva, one half of him is a fully developed woman. Let me tell you the story of what happened.
Story first published: Saturday, August 13, 2016, 7:46 [IST]
Desktop Bottom Promotion