For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

February Vrat And Festival List 2022: మాఘ మాసంలో ముఖ్య పండుగలు, వ్రతాలెప్పుడొచ్చాయో చూడండి...

2022 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో పండుగలు మరియు వ్రతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

మన దేశంలో ప్రతి ఏటా ప్రతి నెలా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే మన భారతదేశం సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లకు పుట్టినిల్లు. ఇప్పటికే మనమందరూ జనవరి నెలలో సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నాం.

Festivals and Vrats in the month of February 2022

ఇప్పుడు ఫిబ్రవరి నెలలోకి కూడా అడుగు పెట్టేశాం. హిందూ క్యాలెండర్ ప్రకారం, మాఘ మాసాన్ని కుంభ మాసం అని కూడా అంటారు. ఈ మాసంలో వసంత పంచమి, రథసప్తమి, గణేష్ జయంతి, నవరాత్రులతో పాటు అనేక పండుగలు మరియు వ్రతాలను జరుపుకుంటారు.

Festivals and Vrats in the month of February 2022

ఈ సందర్భంగా ఫిబ్రవరి నెలలో ఏయే రోజున ఏయే పండుగలు, వ్రతాలు జరుగుతాయి.. ఏయే తేదీలలో ఉపవాసాలు ఉంటారు అనే వివరాలను పూర్తిగా తెలుసుకుందాం...

February 2022:ఈ నెలలో ఈ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందట...! ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి...February 2022:ఈ నెలలో ఈ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందట...! ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి...

ఫిబ్రవరి 1న..

ఫిబ్రవరి 1న..

2022 సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో తొలిరజే మౌని అమావాస్య వచ్చింది. ఈరోజును హిందువులు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈరోజున గంగా నదిలో లేదా ప్రవహించే నీటిలో ఉదయాన్నే స్నానం చేస్తారు. అనంతరం దేవాలయాలకు వెళ్లి పూజలు చేస్తారు. ఈరోజున నువ్వులు, పప్పులు ఇతర పదార్థాలతో పాటు పేదలకు కొంత ఆర్థిక సహాయం చేస్తే సర్పదోషం కూడా పోతుందట. ఈ పవిత్రమైన రోజున మౌనం కూడా ఉంటారు.

ఫిబ్రవరి 5న..

ఫిబ్రవరి 5న..

హిందూ మతంలో వసంత పంచమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున చాలా మంది భక్తులు సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల తమకు, తమ కుటుంబానికి సరస్వతీ దేవి ఆశీస్సులు లభిస్తాయి.

ఫిబ్రవరి 7న..

ఫిబ్రవరి 7న..

ఫిబ్రవరి ఏడో తేదీన అంటే సోమవారం నాడు దేశవ్యాప్తంగా రథసప్తమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా మన ఏపీలోని శ్రీకాకుళం అరసవల్లిలోని సూర్యదేవాలయంలో, ఒడిశాలోని కోణార్క్ టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పవిత్రమైన రోజున సూర్యోదయం కాలంలో ఏడు జిల్లేడు ఆకులను, వాటిలో రేగికాయలను తలపై ఉంచుకుని స్నానం చేస్తే ఏడు రకాల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు. ఈరోజున చిక్కుడు కాయలతో రథం చేసి కొత్త బియ్యంతో వండి చిక్కుడు ఆకులలో పెట్టి సూర్యుని నివేదన చేయడం కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా వస్తోంది. ఇదే రోజున నర్మదా జయంతి వేడుకలు జరుగుతాయి.

Mauni Amavasya 2022: మౌని అమావాస్య రోజున ఇలా చేస్తే.. ఈ దోషాల నుండి విముక్తి లభిస్తుందట...Mauni Amavasya 2022: మౌని అమావాస్య రోజున ఇలా చేస్తే.. ఈ దోషాల నుండి విముక్తి లభిస్తుందట...

ఫిబ్రవరి 8న..

ఫిబ్రవరి 8న..

మాఘ మాసంలో ఫిబ్రవరి ఎనిమిదో తేదీన కొన్ని ప్రాంతాల్లో దుర్గాష్టమి వేడుకలను జరుపుకుంటారు. అలాగే 13వ తేదీన కుంభ సంక్రాంతి వేడుకలను జరుపుకుంటారు.

ఫిబ్రవరి 12న..

ఫిబ్రవరి 12న..

ఫిబ్రవరి 12వ తేదీన మాఘ మాసంలో వచ్చే రెండో ఏకాదశినే ‘జయ ఏకాదశి' అని అంటారు. ఈ పవిత్రమైన రోజున భక్తులందరూ ఉపవాసం ఉండి ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు.

ఫిబ్రవరి 14న..

ఫిబ్రవరి 14న..

మాఘ మాసంలో ప్రదోష వ్రతాన్ని జరుపుకుంటారు. ఫిబ్రవరి 14వ తేదీన ఈ పవిత్రమైన రోజున ఈశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల తమకు అన్ని సమస్యల నుండి విముక్తి లభిస్తుందని.. తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు.

ఫిబ్రవరి 16న..

ఫిబ్రవరి 16న..

మాఘ పూర్ణిమ రోజున చంద్రుడిని ఆరాధించడం వల్ల ప్రత్యేక ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు. ఈ పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే ప్రవహించే నదిలో స్నానం చేయడం, దానం చేయడం వంటి పనుల వల్ల ఎన్ని మంచి ఫలితాలొస్తాయట. ఇదే రోజున గురు రవిదాస్ జయంతి, లలితా జయంతి వేడుకలను జరుపుకుంటారు.

ఫిబ్రవరి 19న..

ఫిబ్రవరి 19న..

ప్రతి సంవత్సరం మరాఠా యోధుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. 2022 సంవత్సరంలో ఫిబ్రవరి 19న శనివారం ఛత్రపతి శివాజీ జయంతి వచ్చింది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

FAQ's
  • ఫిబ్రవరి నెలలో వసంత పంచమి ఎప్పుడొచ్చింది?

    హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని శుద్ధ పంచమి రోజున వసంత పంచమి వస్తుంది. 2022 సంవత్సరంలో ఫిబ్రవరి ఐదో తేదీన అంటే శనివారం నాడు వసంత పంచమి వచ్చింది. ఈ పవిత్రమైన రోజున సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు.

  • రథ సప్తమి వేడుకలను ఎప్పుడు జరుపుకుంటారు?

    ఫిబ్రవరి ఏడో తేదీన అంటే సోమవారం నాడు దేశవ్యాప్తంగా రథసప్తమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా మన ఏపీలోని శ్రీకాకుళం అరసవల్లిలోని సూర్యదేవాలయంలో, ఒడిశాలోని కోణార్క్ టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పవిత్రమైన రోజున సూర్యోదయం కాలంలో ఏడు జిల్లేడు ఆకులను, వాటిలో రేగికాయలను తలపై ఉంచుకుని స్నానం చేస్తే ఏడు రకాల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు. ఈరోజున చిక్కుడు కాయలతో రథం చేసి కొత్త బియ్యంతో వండి చిక్కుడు ఆకులలో పెట్టి సూర్యుని నివేదన చేయడం కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా వస్తోంది.

English summary

Festivals and Vrats in the month of February 2022

Here we are talking about the festivals and vrats in the month of febrauary 2022. Have a look
Desktop Bottom Promotion