For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గణేష్ చతుర్థి 2019 : వినాయక మండపాల వద్ద అందమైన అలంకరణలు..

ఇది పండుగల వేళ, పవిత్ర సందర్భాలలో నేలపై రూపుదిద్దుకునే అపురూపమైన కళారూపం. వీటిని బట్టి ప్రాంతం లేదా పండుగను బట్టి సంప్రదాయాలను గుర్తించొచ్చు.

|

మన దేశంలో ఏ పండుగ వచ్చినా మన ఇంటిని అలంకరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అదే వినాయక చవితి రోజున మాత్రం మన ఇంటితో పాటు మన కాలనీలను కూడా అంగరంగ వైభవంగా అలంకరిస్తాం. ముందుగా మన ఇంటితో పాటు వినాయక మండపాల వద్ద రంగు రంగుల రంగోలి (ముగ్గులు)ని వేస్తాం. ఈ అలంకరణను చూసి భక్తులలో ఉల్లాసం మరియు ఉత్సాహం పెరుగుతుంది. అంతకంటే ముందు ప్రజలంతా కొత్త బట్టలు ధరిస్తారు. ఇళ్లలో రకరకాల పిండి వంటలు తయారు చేస్తారు.

ఇక ఆయా ప్రాంతాలను బట్టి వినాయకుని విగ్రహాలను మూడు రోజులు లేదా ఐదు రోజులు, తొమ్మిది, పదకొండు రోజుల వరకు మండపాలలో ఉంచి పూజలు చేస్తారు. వినాయకుడు మండపాలలో ఉన్నన్ని రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవాలి. సాయంత్రం వేళలో చాలా మంది భక్తులు వినాయక విగ్రహాలను చూడటానికి వస్తుంటారు. అందుకనే అందరూ మండపాల వద్ద రంగు రంగుల విద్యుత్ కాంతులను సిద్ధం చేసుకోవాలి. ఇక ఉదయం, సాయంత్రం సమయంలో రంగు రంగుల రంగోలిలను వేస్తే చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది.

ఇక రంగోలి విషయానికొస్తే.. ఇది పండుగల వేళ, పవిత్ర సందర్భాలలో నేలపై రూపుదిద్దుకునే అపురూపమైన కళారూపం. వీటిని బట్టి ప్రాంతం లేదా పండుగను బట్టి సంప్రదాయాలను గుర్తించొచ్చు.

రంగోలి రూపొందించడం వల్ల ఇంట్లో అదృష్టం, శ్రేయస్సు లభిస్తాయని అందరూ నమ్ముతారు. అందుకనే మేము మీకోసం కొన్ని అద్భుతమైన రంగోలి డిజైన్లను తీసుకొచ్చాము.

వీటిలో మీకు నచ్చిన దానిని మీ ఇంటి వద్దనే ఉండే ప్రయత్నించొచ్చు. మీ నివాస ప్రవేశాన్ని లేదా వినాయక మండప ద్వారాన్ని అద్భుతంగా మార్చవచ్చు.

అంతేకాదు వినాయక మండపాలు ఉండే చోట ఒక్కోరోజు ఒక్కో విధంగా అలంకరించుకోవచ్చు. వీటి గురించి వినాయక మిత్ర మండలి సభ్యులకు నిర్వాహకులకు పెద్దగా చెప్పాల్సిన పనిలేదు.

ఎందుకంటే వారు ఇదివరకే ఎన్నో సంవత్సరాల నుండి వాటిని అమలు చేస్తున్నారు. ఇక కొత్తగా ట్రై చేయాలనుకునేవారు..

వినూత్నంగా ప్రయత్నించాలనుకునే వారు చిన్నపిల్లలతో శివ,పార్వతుల వేషం ఒకరోజు.. ఇంకోరోజు సుబ్రమణ్యం వేషం.. ఇలాంటి వేషాలు వేయించి భక్తులను ఆకట్టుకోవచ్చు.

అంతేకాదు వినాయక మండపాల ముందు మీకు నచ్చిన డిజైన్లను రూపొందించొచ్చు.

English summary

Ganesh Chaturthi 2019: Beautiful decorations at Ganesh venues

The idols of Lord Ganesha are worshiped in the mandapas for three days or five days, nine and eleven days, depending on the region. All days of Ganesha Mandapas are worshiped with the utmost devotion. In the evening, many devotees come to see the idols of Lord Ganesha. That is why everyone should prepare colorful magnets at the mandapala. In the morning, in the evening, it is very beautiful to see the colorful Rangoli.
Story first published:Saturday, August 31, 2019, 19:58 [IST]
Desktop Bottom Promotion