For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గణేష్ చతుర్థి 2019: ప్రాముఖ్యత, విశేషాలు, వినాయక చవితిని ఎలా జరుపుకుంటారో తెలుసా..

|
Ganesh Chaturthi 2019:Tithi, Vidhi,Puja Timings And Muhurat | వినాయక వ్రత పూజా సమయం, శుభముహూర్తం ఇదే

వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి (గణేష్, గణపతి, లంబోదర) అన్ని అడ్డంకులను తొలగించేవాడు (విఘ్నేశ్వరుడు), అన్ని పనులకు, పూజలకు ప్రథమ పూజ అందుకునే ఆదిదేవుడు. విజయానికీ, విద్యకూ, జ్ఞానానికి దిక్కు అయిన దేవుడు. హిందువుల అన్ని ఆచారాలు, సంప్రదాయాలు, అన్ని ప్రాంతాలలో వినాయకుడికి పూజ తప్పకుండా జరుగుతుంది. ఇక తెలుగువారి పండుగల విషయానికొస్తే వినాయక చవితి చాలా ముఖ్యమైన పండుగ. పంచాయతన పూజా విధానంలో గణేశుడి పూజ కూడా ఒకటి (వినాయకుడు, శివుడు, శక్తి, విష్ణువు, సూర్యుడు - వీరి పూజా సంప్రదాయాలు పంచాయతన విధానములు)

ప్రాణులకు హితాన్ని బోధిస్తాడు కాబట్టే పార్వతీ పుత్రుడిని వినాయకుడు అంటారని అమరం చెబుతోంది. సర్వ ప్రకృతికి మేలు చేకూర్చే గణపతిని పూజ చేసే విధానం విశిష్టమైనదే. ఈ వినాయకచవితిని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చేస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు.. మరికొన్ని ప్రాంతాల్లో తొమ్మిది రోజుల పాటు.. పెద్ద పెద్ద నగరాల్లో అయితే 11 రోజుల పాటు వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. ఈ పూజల వలన పర్యవారణ పరిరక్షణ, అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గణపతితత్వం నేటి పర్యావరణ లక్ష్యానికి దగ్గరగా ఉంటుంది. ప్రకృతికీ, ప్రాణికి మధ్య ఉండాల్సిన సామరస్యాన్ని సూచిస్తుంది.

Ganesh Chaturthi

మహోన్నతమైన హైందవ ధర్మంలో మహర్షులు మూలికల్ని, ఔషధాలను పూజద్రవ్యాలుగా, యాగాది క్రతువుల్లో సమిధలుగా వినియోగించడమనే సంప్రదాయాన్ని ఆరంభించారు. భారతీయులకు వినాయకుడు జీవనాధారమైన ఒక మూలతత్వం. భారతీయ హిందువులు ప్రతి పనికి గణేషుడిని పూజించి తమ పనులను ప్రారంభిస్తారు.

వినాయక చవితి విశేషాలు..

వినాయక చవితి విశేషాలు..

శివుడు, పార్వతీ దేవిల పెద్ద కుమారుడు వినాయకుడు. (వారి రెండో కుమారుడు కుమారస్వామి). వినాయకుని ఆకారం హిందూ మతంలో విశిష్టమైనది. ఏనుగు ముఖం, పెద్ద బొజ్జ, పెద్ద చెవులు, ఒకే దంతము, ఎలుక వాహనము, పొట్టకు పాము కట్టు, నాలుగు చేతులు, ఒక చేతిలో పాశము, మరో చేతిలో అంకుశం, ఒక చేతిలో ఘంటము లేదా లడ్డూ, మరొకటి అభయ హస్తం. వీటిని నమ్మినవారికి సర్వ మంగళ ప్రదం అని పురాణాల్లో చెప్పబడింది. హిందూ సంప్రదాయంతో పరిచయం లేని వారికి ఇది ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది.

వినాయక చవితి ఎప్పుడు ప్రారంభమైందంటే..

వినాయక చవితి ఎప్పుడు ప్రారంభమైందంటే..

మేధస్సు, విజయం మరియు పవిత్రతకు ప్రధాన మూలాధారమైన వినాయకుని కోసం ఈ పండుగను జరుపుకుంటారు. ప్రతి కళలోనూ నైపుణ్యాలు కలిగిన వినాయకుడు, తనను పూజించిన భక్తుల పట్ల కృపతో, ఆయా కార్యాలు, కళలతో పాటు ఏ పనులనైనా విఘ్నాలు లేకుండా పూర్తి చేయడంలో సహాయపడతాడని చెప్పబడింది. ఇక ఈ వేడుకలు ఎప్పుడు ప్రారంభమయ్యాయంటే మహారాష్ట్రలోని శివాజీ (మరాఠా సామ్రాజ్య స్థాపకుడు) పాలనలో ఈ వేడుకలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అంతవరకు దీని గురించి ఎవరికీ సరైన అవగాహన లేదు.

హిందూ క్యాలెండర్ ప్రకారం వినాయక చవితి తేదీలు..

హిందూ క్యాలెండర్ ప్రకారం వినాయక చవితి తేదీలు..

వినాయక చవతి పండుగ, ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షాన నాలుగోరోజు అనగా చవితి నాడు వస్తుంది. పదిరోజులు కొనసాగుతూ, చతుర్దశి తిథి నాడు ముగుస్తుంది. ఈ సంవత్సరం, సెప్టెంబర్ 2వ తేదీ 2019న సోమవారం నాడు వినాయక చవితి ప్రారంభమవుతుంది.

వినాయకుడినే మొదటగా ఎందుకు పూజిస్తారంటే..

వినాయకుడినే మొదటగా ఎందుకు పూజిస్తారంటే..

ప్రతిరోజూ దేవునికి పూజ చేసే ముందు ప్రధానంగా వినాయకుని శ్లోకంతో ప్రారంభించడం ఆనాయితీగానే కాకుండా, సాంప్రదాయంగా కూడా వస్తుంది. వినాయక చవితి సందర్భంగా వినాయకుని విగ్రహాలను కొనుగోలు చేయదలచిన వారు విగ్రహంలో వినాయకుని తొండం, ఎడమ వైపున ఉండేలా చూసుకోవాలి. వీటితో పాటు ఇంట్లో పూజించే ప్రతి ఒక్కరూ ఎట్టి పరిస్థితుల్లో మట్టి విగ్రహాలనే పూజించాలి. ఎలాంటి రసాయనాల మిశ్రమాలను జోడించకుండా వినాయకునికి ఇష్టమైన వంటకాలైన కుడుములు, ఉండ్రాళ్లు, లడ్డు వంటివి సిద్ధం చేసి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ఎన్నిరోజులు మీ ఇంట్లో విగ్రహాన్ని ఉంచితే అన్నిరోజులూ కచ్చితంగా మూడుపూటలా నైవేద్యం సమర్పించాలి. విగ్రహ నిమజ్జనం కోసం సంప్రదించండి. విగ్రహాల నిమజ్జనం కోసం నదులు, సముద్రాల వరకు పోవాల్సిన అవసరం లేదు. నదిలే కలిసే పిల్ల కాలువలు, శుభ్రం చేసిన బకెట్ నీళ్లలో కూడా మట్టి విగ్రహాల్ని (రసాయనాలు లేని) నిమజ్జనం చేసి చెట్ల పాదులకు వేయవచ్చని సూచించబడింది. దీంతో మీరు పర్యవారణాన్ని కాపాడిన వారు అవుతారు. భావితరాలకు కాలుష్య కోరలకు గురి చేయకుండా జాగ్రత్త వహించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని కూడా మీరు గుర్తు చేసిన వారవుతారు.

వినాయక చవితిని ఇలా జరుపుకుంటారు..

వినాయక చవితిని ఇలా జరుపుకుంటారు..

వినాయక చవితి రోజున వినాయకుని సరికొత్త ప్రతిమను ఇంటిని తీసుకువస్తారు. ఈ ప్రతిమను ఆయా ప్రాంతాలను బట్టి ఐదు రోజులు, తొమ్మిది రోజులు, పది లేదా పదకొండు రోజుల వరకు పూజిస్తారు. ఆ రోజులలో వినూత్నమైన అలంకరణలు, రంగవల్లులు, ఇతర సాంప్రదాయ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అదే రోజున దేవాలయాల్లో కూడా ప్రత్యేక అలంకరణలు చేస్తారు. అధికారులు, రాజకీయనాయకులతో పండుగను ఘనంగా నిర్వహిస్తారు. వినాయక మండపాల దగ్గర మిత్ర మండలి సభ్యులు, కార్యకర్తలు జాగరణ చేస్తారు. అనంతరం ఆ విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు. అంతకుముందు ప్రజలందరూ కలిసికట్టుగా, ఊరేగింపుగా ఆయా ప్రాంతాల్లో వినాయకుని విగ్రహాలను తీసుకెళ్లి చెరువులు, వాగులు, వంకలు, నదిలో లేదా సముద్రంలో నిమజ్జనం చేస్తారు.

English summary

Ganesh Chaturthi 2019: Date, Significance and How to Celebrate

Amara says that Lord Ganesha is the son of Parvati as he teaches the creatures his will. Good for all nature, The way of worshiping Ganapati is unique. This Vinayakachavati is performed in a single area In some areas, for a period of five days, in some places for nine days, in large cities, statues of Ganesha are arranged for 11 days. These pujas have many health benefits, including protection of the environment.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more