For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ganesh Visarjan 2021:గణేష్ నిమజ్జనం ఎప్పుడు చేస్తారు?

2021లో గణేష్ నిమజ్జనం తేదీ, శుభముహుర్తం మరియు సమయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

2021 సంవత్సరంలో దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హిందువులలో గణపతి ఉత్సవ సమితి సభ్యులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో విభిన్నమైన వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు.

Ganesh Visarjan 2021 Date, Shubh Muhurat and Know The Time For ganpati Visarjan in Telugu

మిగిలిన ప్రజలందరూ తమ ఇళ్లలోనే గణపతి విగ్రహాలను ప్రతిష్టించారు. కొన్నిచోట్ల ఆకట్టుకునే విగ్రహాలు పెట్టుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రత్యేకత ఉన్న ఖైరతాబాద్ గణపతి విగ్రహాన్ని ఈసారి 40 అడుగుల ఎత్తులో.. పంచముఖ రూపాన్ని తయారు చేశారు.

Ganesh Visarjan 2021 Date, Shubh Muhurat and Know The Time For ganpati Visarjan in Telugu

హిందూ పురాణాల ప్రకారం, గణపతి పూజ పూర్తయిన తర్వాత నిమజ్జనం చేస్తారు. ఈ నిమజ్జనం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటారు. ఈ సందర్భంగా గణేష్ నిమజ్జనం ఎప్పుడు చేస్తారు. ఏ శుభ ముహుర్తంలో చేయాలి? అసలు ఎందుకని గణేశుని నిమజ్జనం చేస్తారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Ganesh Chaturthi Special: డార్క్ చాక్లెట్ వినాయకుడి గురించి ఈ విశేషాలు తెలుసా...Ganesh Chaturthi Special: డార్క్ చాక్లెట్ వినాయకుడి గురించి ఈ విశేషాలు తెలుసా...

ఎన్ని రోజులకు నిమజ్జనం..

ఎన్ని రోజులకు నిమజ్జనం..

హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో వర్షాలు ఎక్కువగా కురిసే సమయంలో.. పచ్చదనం వెల్లి వెరిసే వేళలో.. వినాయక చవితి పండుగను ప్రారంభిస్తారు. అదే సమయంలో మహా గణపతి పూజ తర్వాత గణపతి బప్ప మోరియా అంటూ విఘ్నేశ్వరుడిని తలచుకుంటూ నిమజ్జనం చేస్తారు. ఇది ప్రాంతాన్ని బట్టి సమయం, తేదీ మారుతూ వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులకు.. మరికొన్ని ప్రాంతాల్లో ఐదు రోజులకు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో 9 రోజుల పాటు వారి సామర్థ్యం మేరకు వినాయక పూజలు చేసి తర్వాత వినాయకుడిని గంగమ్మ ఒడికి సాగనంపుతారు.

గణేష్ నిమజ్జన శుభ సమయం..

గణేష్ నిమజ్జన శుభ సమయం..

హిందూ క్యాలెండర్ ప్రకారం, గణేష్ నిమజ్జనం అనంత చతుర్దశి రోజున జరుపుకోవాలని పండితులు చెబుతారు. వచ్చే ఏడాది మళ్లీ వస్తాడని చెప్పి గణపతి నిమజ్జనం పూర్తయిందని చెబుతారు. హిందూ పంచాంగం ప్రకారం.. గణేస్ నిమజ్జనం శుభ ముహుర్తం చతుర్దశి రోజున అంటే 19వ తేదీ మధ్యాహ్నం 12:14 గంటల నుండి సాయంత్రం 7:39 గంటల వరకు.

Ganesh Chaturthi Special:విఘ్నేశ్వరుని ఈ అవతారాలను పూజిస్తే.. విఘ్నాలన్నీ తొలగిపోతాయట...!Ganesh Chaturthi Special:విఘ్నేశ్వరుని ఈ అవతారాలను పూజిస్తే.. విఘ్నాలన్నీ తొలగిపోతాయట...!

నిమజ్జనం ఎందుకంటే..

నిమజ్జనం ఎందుకంటే..

పురాణాల ప్రకారం, గణేశుడు పుట్టుకనే పార్వతీ దేవి శరీరం నుంచీ వచ్చిన నలుగు పిండితో జరిగింది. వినాయక చవితి అంటేనే నేచర్ తో సంబంధం ఉన్న పండుగ. అందువల్ల నదులు, చెరువులు, వాగుల్లో ఒండ్రు మట్టితో స్వామి విగ్రహాన్ని తయారు చేస్తారు. మూడు రోజులు.. ఐదు రోజులు.. తొమ్మిది రోజుల పాటు అనేక రకాల పండ్లు, పూలు, మొక్కలు, చెట్లు, ఆకులతో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం పూజించిన పత్రితో సహా నిమజ్జనం చేస్తాం.

ఒండ్రు మట్టిలో..

ఒండ్రు మట్టిలో..

గణపతిని తయారు చేసిన ఒండ్రు మట్టిలో, పత్రాల్లో మంచి ఔషధ గుణాలు ఉంటాయి. వినాయకునికి చేసే షోడశోపచార పూజలో మాటిమాటికీ విగ్రహాన్ని తాకడం వల్ల.. వాటిలోని ఔషధ గుణాలు మనకు చేరతాయి. విగ్రహం దగ్గర గాలి కూడా విశేషమైనదే. దాదాపు తొమ్మిది రోజులు విగ్రహాన్నీ, పత్రాలనూ ఇంట్లో ఉంచడం వల్ల.. ఇంట్లోకి వచ్చే గాలి ఔషధ గుణాన్ని పెంచుకుంటుంది. దీని వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.

నీటిలోని క్రిమి కీటకాలు..

నీటిలోని క్రిమి కీటకాలు..

తొమ్మిది రోజుల పాటు విగ్రహాన్నీ, పత్రాలని ఇంట్లో ఉంచుకున్న తర్వాత.. దగ్గర్లో ఉన్న చెరువు, నది, లేదంటే బావిలో నిమజ్జనం చేస్తారు. అందుకు తగ్గట్టే.. వర్షాకాలం కావడంతో.. నదులు, చెరువులు, నిండుగా కళకళలాడుతూ ఉంటాయి. ఈ సమయంలో నీటిలో వినాయక విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా.. నీటిలో ఉండే క్రిమి కీటకాలు చనిపోతాయి. ఈ నిమజ్జనం పూర్తయిన వెంటనే దసరా సంబరాలు, దుర్గా దేవి నవరాత్రులు ప్రారంభమవుతాయి.

FAQ's
  • వినాయక నిమజ్జనం ఎప్పుడు జరుపుకుంటారు?

    మన దేశంలో వినాయక చవితి పూజల తర్వాత వెంటనే నిమజ్జనం ప్రారంభమవుతుంది. అయితే అది ప్రాంతాలను బట్టి ఒక్కో రకంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులకు మరి కొన్ని ప్రాంతాల్లో ఐదు రోజులకు..ఇంకా కొన్ని ప్రాంతాల్లో 9 రోజులకు గణేష్ నిమజ్జనం ఘనంగా పూర్తి చేస్తారు.

English summary

Ganesh Visarjan 2021 Date, Shubh Muhurat and Know The Time For ganpati Visarjan in Telugu

Here we are talking about the Ganesh Visarjan 2021 date, shubh muhurat and know the time for ganapati visarjan in Telugu. Have a look
Story first published:Saturday, September 11, 2021, 17:33 [IST]
Desktop Bottom Promotion