For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గణేష్ నిమజ్జనం 2020 : వినాయక విగ్రహాలను నీటిలోనే ఎందుకు నిమజ్జనం చేస్తారంటే...

వినాయక ప్రతిమలను నీటిలోనే ఎందుకు నిమజ్జనం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..

|

మన దేశంలో గణేష్ చతుర్థి ఉత్సవాలు ఎంత ఉత్సాహంగా ప్రారంభమవుతాయో అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఘనంగా ప్రారంభం కాకపోయినా.. ఎంతో నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వినాయకుడి విగ్రహాల ఒక ఎత్తు అయితే..

Ganesh Visarjan : Why is Ganesh Idols Immersed In Water At The End Of Festival?

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేశుని విగ్రహం మరో ఎత్తు. ఎందుకంటే దేశంలోని వినాయక ప్రతిమలలో మన ఖైరతాబాద్ గణేశుడిదే ప్రతి సంవత్సరం ప్రముఖ స్థానమే.

Ganesh Visarjan : Why is Ganesh Idols Immersed In Water At The End Of Festival?

కానీ ఈ ఏడాది కోవిద్-19 కారణంగా వినాయకుడి ఎత్తును తగ్గించేశారు. ఇదిలా ఉండగా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వినాయకుడి ప్రతిమలను నిమజ్జనానికి సిద్ధం చేస్తున్నారు. ఇంతకుముందు వినాయక నిమజ్జనం అంటే.. లడ్డూ వేలం పాట.. డిజే హోరు.. డప్పు వాయిద్యాల జోరు.. భక్తి పాటలతో ఫుల్లు ధూమ్ దామ్ గా ఉండేది.

Ganesh Visarjan : Why is Ganesh Idols Immersed In Water At The End Of Festival?

అయితే ఇప్పుడు కరోనా కారణంగా వీటన్నింటికీ అడ్డుకట్ట పడిపోయింది. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. వినాయక ప్రతిమలను నీటిలోనే ఎందుకు నిమజ్జనం చేస్తారు? దీని వెనుక ఉన్న కారణాలేంటి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Viral : ఈ విశ్వంలోనే వినాయకుడి ఫొటో ఉన్న ఏకైక ముస్లిం దేశమేదో తెలుసా?Viral : ఈ విశ్వంలోనే వినాయకుడి ఫొటో ఉన్న ఏకైక ముస్లిం దేశమేదో తెలుసా?

వర్షాకాలంలో..

వర్షాకాలంలో..

వినాయకుని ప్రతిమలను నీటిలోనే ఎందుకు నిమజ్జనం ఎందుకు చేస్తారంటే.. ప్రాక్రుతిక కారణాన్ని చూస్తే వినాయక చవితి పండుగ వర్షాకాలం ప్రారంభంలో వస్తుంది. ఇలా వర్షాకాలానికే ముందే చెరువుల నుండి మట్టి సేకరించి దాంతో విగ్రహాలు తయారు చేసి, వాటిని పూజించి, వాటిని చెరువులో లేదా ప్రవహించే నదిలో కలుపుతారు.

విగ్రహాల నిమజ్జనం వల్ల..

విగ్రహాల నిమజ్జనం వల్ల..

వినాయక విగ్రహాల కోసం మట్టిని తీయడం వల్ల చెరువుల్లో లోతు పెరుగుతుంది. ఆ తర్వాత ఆయుర్వేద గుణాలున్న పత్రితో కలిపి వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీరు పారే వీలుంటుంది. అప్పుడు అందులో ఆయుర్వేద గుణాలు కూడా కలుస్తాయి. అలాంటి నీటిని తాగడం వల్ల ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని చాలా మంది నమ్ముతారు.

పురాణాల ప్రకారం..

పురాణాల ప్రకారం..

ఇక పురాణాల ప్రకారం అయితే.. వినాయకుడు కైలాసం నుండి భూలోకానికి వచ్చి కేవలం పది రోజులు మాత్రమే ఉండి తిరిగి అదే లోకానికి వెళ్లిపోతాడు. భక్తులు నిత్యం పూజలందిస్తూ ఉంటే కైలాసానికి దూరంగా ఉంటాడని, పదిరోజుల పాటు పూజలందుకుని తిరిగి రమ్మని చెప్పి పార్వతీదేవి పంపినట్లుగా పండితులు చెబుతారు.

Bhadrapada Masam 2020 : భాద్రపద మాసంలో వినాయక చవితితో పాటు మరికొన్ని ముఖ్య పండుగలివే...Bhadrapada Masam 2020 : భాద్రపద మాసంలో వినాయక చవితితో పాటు మరికొన్ని ముఖ్య పండుగలివే...

నవరాత్రుల తర్వాత..

నవరాత్రుల తర్వాత..

ఏ దేవతా విగ్రహం అయినా మట్టితో చేస్తే అది కేవలం నవరాత్రులు మాత్రమే పూజించడానికి అర్హత ఉంటుందని, ఆ తర్వాత అందులో దైవత్వం పోతుందని అందుకే నిమజ్జనం చేయాలని కూడా కొందరు చెబుతారు. వినాయక నిమజ్జనం తర్వాత దుర్గామాత విగ్రహాలను కూడా నవరాత్రుల పాటు పూజించి నిమజ్జనం చేయడం గురించి మనకు తెలిసిందే.

ఎక్కడెక్కడ చేస్తారంటే..

ఎక్కడెక్కడ చేస్తారంటే..

వినాయకుని విగ్రహాలను ప్రతిష్టించిన ప్రాంతాల నుండి వారికి సమీపంలో ఉన్న కాలువలు, నదులు, చెరువులు, సముద్రాల వద్ద నిమజ్జనం చేసేందుకు తీసుకెళ్తారు. ఈ సమయంలో పిల్లల నుండి పెద్దల వరకు ఆనందంగా చిందులేస్తూ ఉత్సాహంగా వినాయకుడికి వీడ్కోలు చెబుతారు. మళ్లీ వచ్చే ఏడాది తిరిగి రావయ్య బొజ్జ గణపయ్యా.. అంటూ కోరుకుంటూ సంతోషంగా వెనుదిరుగుతారు.

English summary

Ganesh Visarjan 2020 : Why is Ganesh Idols Immersed In Water At The End Of Festival?

Here we talking about Ganesh Visarjan 2020 : Why is Ganesh Idols immersed in water at the end of festival. Read on
Desktop Bottom Promotion