For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Guru Purnima 2022: గురు పూర్ణిమ ఎందుకు జరుపుకుంటారో తెలుసా...

గురు పూర్ణిమ 2022 సందర్భంగా ఈ పూర్ణిమ శుభ ముహుర్తం మరియు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఆషాఢ శుద్ధ పూర్ణమని 'గురు పూర్ణమి' లేదా 'వ్యాస పూర్ణిమ' అని అంటారు. ఈ సంవత్సరం పౌర్ణమి జులై నెలలో 13వ తేదీ అంటే బుదవారం నాడు వచ్చింది. హిందూ సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులకే దక్కింది.

Guru Purnima 2021: Date, time, Shubh Muhurat, Puja Vidhi and Significance in Telugu

అయితే పురాణాల కాలం నాటి నుండి నేటి వరకు గురువు అనగానే వ్యాస మహర్షినే మొదటగా పూజిస్తారు మరియు గౌరవిస్తారు. ఆయన జన్మదినాన్ని ఒక పవిత్రమైన రోజుగా భావించడమే కాదు.. ఒక పండుగలాగా కూడా జరుపుకుంటారు. ఈ ఆచారం మన దేశంలో ప్రతి ఏటా ఆనావాయితీగా వస్తోంది.

Guru Purnima 2021: Date, time, Shubh Muhurat, Puja Vidhi and Significance in Telugu

ఇలా గురు భగవానుడిని స్మరించుకుని, గురు పూర్ణమి నాడు పూజలు చేస్తే తమకు సకల సంపదలు లభిస్తాయని చాలా మంది హిందువులు నమ్ముతారు. అయితే గురువు అనగానే వ్యాస మహర్షినే ఎందుకు గుర్తుకొస్తారు? ఈ సారి గురు పూర్ణిమ ఎప్పుడొచ్చింది. ఈ రోజున వ్యాస మహర్షిని ఎందుకు పూజిస్తారు.. తన ఆశీర్వాదం ఎందుకు కోరతారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Guru Purnima 2021 : వ్యాసుని అనుగ్రహం పొందాలంటే?Guru Purnima 2021 : వ్యాసుని అనుగ్రహం పొందాలంటే?

గురువు అంటే..

గురువు అంటే..

మనం ఏ రంగంలో విజయం సాధించాలన్నా.. ఉన్నత స్థాయికి ఎదగాలంటే గురువు యొక్క శిక్షణ తప్పనిసరి. మన నైపుణ్యాలను మరింత మెరుగుపరిచి మనలోని వివేక జ్యోతిని వెలిగించి ప్రగతి పథంలో నడిపించేవాడు గురువు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో గురువు అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు.

గురువు ప్రత్యేకత..

గురువు ప్రత్యేకత..

ఈ లోకంలో ప్రతి ఒక్కరికి తొలి గురువు తల్లి. ఆ తర్వాత మనకు వివేకజ్యోతిని వెలిగించి.. మనకు ఏది మంచి.. ఏది చెడు అనే విషయాలను చెప్పే వారే గురువులు. అలాంటి గురువులను పూజించడం కోసం నిర్ణయించిన తిథి గురు పూర్ణిమ. గురులో గు అంటే అంధకారం లేదా అజ్ణానం, రు అంటే నిరోధించుట లేదా తొలగించుట అని అర్థం. గురువు అనే పదానికి అజ్ణానాన్ని తొలగించే వారు అని అర్థం.

వ్యాసుడే తొలి గురువు..

వ్యాసుడే తొలి గురువు..

పురాణాల ప్రకారం, వేదాలను నాలుగు భాగాలుగా విభజించి, వేద వాగ్మయాలను సామాన్యుడి చెంతకు చేరేలా చేయడంలో వ్యాసుడు ఎంతో క్రుషి చేశాడు. పంచమ వేదంగా పేరు తెచ్చుకున్న మహా భారతాన్ని మనకు అందించిన వ్యాసుడు పుట్టినరోజు కాబట్టి ఆరోజు గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమగా పాటిస్తున్నారు.

గురు పూర్ణిమ 2021: సంస్కృత శ్లోకాలు మరియు అర్థం; వీటిని పంచుకోండి, మీ గురువుకు నివాళి అర్పించండి...గురు పూర్ణిమ 2021: సంస్కృత శ్లోకాలు మరియు అర్థం; వీటిని పంచుకోండి, మీ గురువుకు నివాళి అర్పించండి...

గురువు అనుగ్రహం కోసం..

గురువు అనుగ్రహం కోసం..

గురు పూర్ణిమ రోజున గురువు అనుగ్రహం పొందేందుకు ఆ పవిత్రమైన రోజున ప్రత్యేక పూజలు, జపం, హోమం, దాన ధర్మాలు, ఆధ్యాత్మిక చింతన ద్వారా గురుబలాన్ని పెంచుకుని, గురు గ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందండి. వేదాల్లో, పురాణాల్లో, శాస్త్రాల్లో వర్ణించిన గురుతత్వాన్ని అన్వేషించి, ఆరాధించి, ఆనందాన్ని, ఆదాయాన్ని పొందండి.

వ్యాసపూర్ణమి రోజున..

వ్యాసపూర్ణమి రోజున..

గురు పూర్ణిమ రోజున వీలైనంత వరకు దక్షిణా మూర్తి ఆరాధన చేయడం, దత్తాత్రేయ ఆరాధన చేయడం మంచిది. శ్రీహయగ్రీవాయ నమః జపం చేసుకోవడం కూడా మంచిదే. విద్యార్థులు, చదువుకునే వారందరూ ఈ జపం నిరంతరం చేయాలి. ఈరోజునే వేదాన్ని బ్రహ్మదేవుడు తన కుమారుడైన వశిష్ట మహర్షికి, ఆయన తన కుమారుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశాడు. శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు.

పూజా విధానం..

పూజా విధానం..

వ్యాస పూర్ణిమ రోజున కొత్త బట్టలను ధరించాలి. అలాగే కొత్త దుస్తులపై బియ్యం, నిమ్మకాయలు ఉంచాలి. అలా చేస్తే శంకరులు తన శిష్యులు వచ్చి దానిని అందుకుంటారని పండితులు చెబుతారు. పూజ పూర్తైన తర్వాత బియ్యం తీసుకెళ్లి పిడికెడు చొప్పున తమ ఇళ్లల్లో బియ్యం కలుపుతారట. బియ్యం, కొత్త బట్టలు లక్ష్మీ చిహ్నం. నిమ్మపండ్లు కార్యసిద్ధికి సూచన.

తెలుగు రాష్ట్రాల్లో..

తెలుగు రాష్ట్రాల్లో..

దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో గురు పూర్ణిమ రోజున ఆదిశక్తి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పర్వదినాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. పూర్ణిమ రోజున సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజ నిర్వహిస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో షిరిడి సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలను ఈరోజు నుండి మూడు రోజుల పాటు నిర్వహిస్తారు.

English summary

Guru Purnima 2022: Date, time, Shubh Muhurat, Puja Vidhi and Significance in Telugu

Here we talking about Guru purnima 2021 :date, time, shubh muhurat, puja vidhi and significance in Telugu. Read on
Desktop Bottom Promotion