For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హిందూ కాలెండర్ ప్రకారం 2019 జనవరిలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు, ఆయా రోజుల్లో ఇలా చేస్తే మేలు

పక్షంలోని 14వ రోజున ప్రదోష వ్రతం జరుపబడుతుంది. అనగా చతుర్ధశి నాడు. ఇది శివుని ఆరాధనకు అంకితం చేయబడుతుంది. ఈ 2019 జనవరిలో, జనవరి 3, 2019 న ప్రదోష వ్రతం, జరుపబడుతుంది. ఈరోజు శివుడు మరియు పార్వతి దేవికి

|

ఈ సంవత్సరం 2019 జనవరి, విష్ణు భగవానునికి అంకితం చేయబడిన ఏకాదశి రోజుతో మొదలవుతుంది. ఇటువంటి ఉత్సవాలు, పవిత్రమైన రోజులు, పండుగలు సాధారణ జీవితానికి రంగులు జోడిస్తూ, అన్ని వర్గాల ప్రజలను దగ్గర చేస్తూ, సామరస్యాన్ని పెంపొందించే అవకాశాలను పెంచుతాయి. ఇక్కడ ఈ వ్యాసంలో ఈ జనవరి 2019 నెలలో వచ్చే అన్నిరకాల పండుగలు, పర్వదినాల గురించిన పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది.

కొన్ని పండుగలు గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం స్థిరంగా ఉన్న తేదీలలో జరుగుతాయి, కానీ వాటిలో ఎక్కువ భాగం హిందూ క్యాలెండర్ ఆధారితంగా ఉంటాయి. ఇక్కడ పేర్కొనవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, హిందూ కాలెండర్లలో కూడా రెండు రకాల కాలెండర్లు ఉన్నాయి. (ఉత్తరాదిన పూర్నిమంత్ మరియు దక్షిణాన అమావాస్యంత్ అని పరిగణిస్తారు). ఇవి భారతదేశం యొక్క ఆర్య, ద్రవిడ సంస్కృతులకు అద్దం పట్టేలా తయారుచేయబడినా, పండుగలు మాత్రం ఒకే తేదీలలోనే ఉంటాయి.

హిందూ కాలెండర్ ప్రకారం 2019 జనవరిలో వచ్చే ముఖ్యమైన పర్వ దినాలు :

1. సఫల ఏకాదశి - జనవరి 1, 2019

1. సఫల ఏకాదశి - జనవరి 1, 2019

ఒక నెలలో, పక్షం యొక్క పదకొండవ రోజును ఏకాదశిగా పరిగణిస్తారు. ప్రతి ఏకాదశి కూడా విష్ణు భగవానుని ఆరాధనకు అంకితం చేయబడింది. ఈ సంవత్సరం మొదటి ఏకాదశి జనవరి 1 న వస్తుంది. ఇలా వచ్చే మొదటి ఏకాదశిని సఫల ఏకాదశిగా పిలుస్తారు. ఈరోజున విష్ణు భగవానుని ఆరాధించడం మూలంగా వ్యాపారాలలో, మరియు చేపట్టిన కార్యాలలో విజయాన్ని సాధించగలరని ప్రజల నమ్మకంగా ఉంది.

2. ప్రదోష వ్రతం – జనవరి 3, 2019

2. ప్రదోష వ్రతం – జనవరి 3, 2019

పక్షంలోని 14వ రోజున ప్రదోష వ్రతం జరుపబడుతుంది. అనగా చతుర్ధశి నాడు. ఇది శివుని ఆరాధనకు అంకితం చేయబడుతుంది. ఈ 2019 జనవరిలో, జనవరి 3, 2019 న ప్రదోష వ్రతం, జరుపబడుతుంది. ఈరోజు శివుడు మరియు పార్వతి దేవికి ప్రార్ధనలను అందించడం జరుగుతుంది. హిందీలో సాయంత్రాన్ని ప్రదోష్ అని వ్యవహరిస్తారు. మరియు ఈ పూజను సాయంత్రం వేళ చేస్తారు కాబట్టి, దీనిని ప్రదోష వ్రతంగా పిలవడం జరుగుతుంది.

3. మాస శివరాత్రి - జనవరి 4, 2019

3. మాస శివరాత్రి - జనవరి 4, 2019

మాస శివరాత్రి, ఆ రోజు శివుని భక్తులు శివలింగం మీద, నీటితో మరియు పాలతో అభిషేకం అందిస్తారు. ఈ రోజు శివునికి అంకితం చేయబడుతుంది. దీనిని శివరాత్రిగా పరిగణిస్తారు. ప్రతి నెలలో ఒక శివరాత్రి వస్తుండగా, సంవత్సరంలో కేవలం రెండు మాత్రమే ప్రధాన శివరాత్రులుగా చెప్పబడుతాయి. అందులో ఒకటి, ఈ నెల జనవరి 4, 2019 న వస్తుంది. ఇక రెండవ శివరాత్రిని మహా శివరాత్రిగా చెప్పబడుతుంది. ఇది ప్రధానంగా ఫిబ్రవరి లేదా మార్చి నెలలలో మాఘ మాసం నందు కనిపిస్తుంది.

4. పాష్ అమావాస్య - జనవరి 5, 2019

4. పాష్ అమావాస్య - జనవరి 5, 2019

పాష్ అమావాస్య, ప్రాచీన కాలం నుండి పూర్వీకులను ఆరాధించడం కోసంగా కేటాయించబడిన రోజుగా చెప్పబడుతుంది. భారత దేశంలో చంద్రుడు పూర్తిగా కనపడని రాత్రిని అమావాస్యగా చెప్పబడుతుంది. ఈ నెల అమావాస్య శనివారం నాడు రానున్న కారణంగా, శని అమావాస్యగా కూడా పరిగణించడం జరుగుతుంది. ఈ నెల జనవరి 5, 2019 న దీనిని గమనించవచ్చు.

5. హనుమాన్ జయంతి - జనవరి 5, 2019

5. హనుమాన్ జయంతి - జనవరి 5, 2019

హనుమాన్ జయంతి హనుమంతుని పుట్టిన వార్షికోత్సవంగా చెప్పబడుతుంది. ఈ రోజున హనుమంతుని పూజించిన ఎడల ఆయన కృపా కటాక్షాలు, దీవెనలు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఈ ఏడాది జనవరి 5 న హనుమాన్ జయంతి వస్తుంది.

Most Read :చనిపోయే ముందు ప్రతి మనిషి ఇలాంటి పనులే చేస్తాడు, మరణానికి సూచనలివే, మరణ భయంతో అలా చేస్తారుMost Read :చనిపోయే ముందు ప్రతి మనిషి ఇలాంటి పనులే చేస్తాడు, మరణానికి సూచనలివే, మరణ భయంతో అలా చేస్తారు

6. సూర్య గ్రహణము - 6 జనవరి 2019 :

6. సూర్య గ్రహణము - 6 జనవరి 2019 :

ప్రతి సంవత్సరం 5 సూర్య గ్రహణాలు జరుగుతాయి, అందులో ఈ సంవత్సరం మొదటగా ఈ జనవరి 6న వస్తుంది. గ్రహణాల సమయాలలో ఆలయాలు మూసివేయబడినా, ప్రజలు ఆరోగ్యము దృష్ట్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. మరిన్ని వివరాలకు పండితులను, లేదా ఆలయ పూజారిని సంప్రదించడం మంచిది.

7. చంద్ర దర్శనము - జనవరి 7, 2019 :

7. చంద్ర దర్శనము - జనవరి 7, 2019 :

చంద్ర దర్శనము ఒకటి, లేదా రెండు రోజుల పాటు కొనసాగించబడుతుంది. కొత్త సంవత్సరంలో శుక్ల పక్ష చంద్రుని మొదటి సారి చూసినప్పుడు చంద్ర దర్శనంగా చెప్పబడుతుంది. ఈ చంద్రుని చూడటం అదృష్టంగా భావించబడుతుంది. ఈ ఏడాది జనవరి 7, 2019 న చంద్ర దర్శనం వస్తుంది.

8. వినాయక చతుర్థి - జనవరి 10, 2019 :

8. వినాయక చతుర్థి - జనవరి 10, 2019 :

హిందూ క్యాలెండర్ ప్రకారం పక్షంలో నాల్గవ రోజున చవితి, లేదా చతుర్ధిగా చెప్పబడుతుంది. ఇది గణేశుని ఆరాధనకు అంకితం చేయబడినందున, దీనిని వినాయక చతుర్థిగా పిలుస్తారు. ఈ సంవత్సరం ఇది జనవరి 10, 2019వ తేదీన వస్తుంది. తరాలుగా, అనేక మంది ప్రజలు ఈ రోజున దేవాలయాలను సందర్శించి, వినాయకునికి ప్రార్ధనలు చేయడం గమనించవచ్చు.

9. స్కంద షష్ఠి - జనవరి 12, 2019 :

9. స్కంద షష్ఠి - జనవరి 12, 2019 :

గణేషుని తమ్ముడైన కార్తికేయునికి అంకితమివ్వబడిన స్కంద షష్ఠి, శివాలయాలలో మరియు కార్తికేయుని ఆలయాలలో జరుపబడుతుంది. అందులోనూ ప్రధానంగా భారత దేశంలోని దక్షిణ భాగంలో అందులోనూ తమిళనాడులో ఎక్కువగా జరుపబడుతుంది. ఈ రోజు ఉపవాసం పాటించడం ద్వారా కుమార స్వామి దీవెనలు పొందగలరని భక్తుల విశ్వాసం.

10. స్వామి వివేకానంద జయంతి - 12 జనవరి 2019 :

10. స్వామి వివేకానంద జయంతి - 12 జనవరి 2019 :

స్వామి వివేకానంద జనవరి 12, 1863న కలకత్తాలో జన్మించారు. ఆయన పుట్టిన రోజు వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 12న వివేకానంద జయంతి జరుపబడుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, పాష్ పూర్ణిమ ఏడు రోజుల తరువాత కృష్ణ పక్ష సప్తమిలో స్వామి వివేకానంద జన్మించాడు. గ్రెగోరియన్ కాలెండర్ ప్రకారం, జనవరి 12న జరుపబడుతున్న వివేకానంద జయంతిని, నేషనల్ యూత్ డేగా కూడా గుర్తించడం జరిగింది. అతని శిష్యులు మరియు అతని అనుయూయులు వివేకానందుని బోధలను ప్రచారం చేస్తూ, ప్రజలను చైతన్యపరచేలా పనులను నిర్వహిస్తుంటారు.

Most Read :మోచేతులు దగ్గర ఉండే నలుపును పోగొట్టుకునేందుకు చిట్కాలు, ఇలా చేస్తే తెల్లగా మారుతాయిMost Read :మోచేతులు దగ్గర ఉండే నలుపును పోగొట్టుకునేందుకు చిట్కాలు, ఇలా చేస్తే తెల్లగా మారుతాయి

11. భాను సప్తమి - 13 జనవరి 2019 :

11. భాను సప్తమి - 13 జనవరి 2019 :

సూర్యునికి మరో పేరు భానుడు. సప్తమి మరియు ఆదివారం, ఈ రెండూ సూర్య దేవునికి అంకితమివ్వబడినవి. కావున సప్తమి తిధి మరియు ఆదివారం రెండూ ఒకే రోజున వచ్చిన పక్షంలో ఆరోజును, భాను సప్తమిగా పిలవడం జరుగుతుంది. పూర్వీకుల పితృ తర్పణానికి ఈరోజు పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున సూర్య దేవునికి మిఠాయిలను నైవేద్యంగా సమర్పించడం మంచిది. అంతేకాకుండా, ఈరోజు ఉపవాసం ఉన్న ఎడల, తల్లిదండ్రులు మరియు జీవిత భాగస్వామి ఏవైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వలన బాధ పడుతున్నట్లయితే, వారు ఆ సమస్యల నుండి ఉపశమనం పొందగలరని చెప్పబడినది.

12. మాస దుర్గాష్టమి - జనవరి 14, 2019 :

12. మాస దుర్గాష్టమి - జనవరి 14, 2019 :

దుర్గా దేవిని ఆరాధించటానికి అంకితం చేయబడిన రోజు అష్టమిగా ఉంటుంది. ఇది పక్షంలో 8వ రోజుగా ఉంటుంది. దీనినే దుర్గాష్టమి అని కూడా అంటారు. ఈరోజున ప్రజలు ఉపవాస దీక్షలను చేయడం గమనించవచ్చు. నిజానికి దుర్గాష్టమి, దసరా సందర్భంలో ప్రధానంగా ఉంటుంది. అయితే, మాసంలో వచ్చే శుక్ల అష్టమిని మాస దుర్గాష్టమిగా చెప్పబడుతుంది. చిన్న పిల్లలకు ఆహారాన్ని అందించడం, దుర్గాదేవి ఆలయాలలో ప్రసాదం పంచడం వంటివి చేయడం ఆనవాయితీగా ఉంటుంది. వీటన్నిటిలో నవరాత్రులలో వచ్చే దుర్గాష్టమి అత్యంత ముఖ్యమైనదిగా ఉంటుంది. ఈ నెలలో జనవరి 14 న మాస దుర్గాష్టమి వస్తుంది.

13. భోగి - జనవరి 14, 2019 :

13. భోగి - జనవరి 14, 2019 :

భోగి పెద్ద పండుగలో భాగంగా ఉండే హిందూ పండుగే అయినా, ప్రతి సంవత్సరం జనవరి 14 న గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం వస్తుండడం గమనించవచ్చు. ఈ పెద్ద పండుగలోని 3 రోజులూ, సూర్యదేవునికి అంకితం చేయబడింది. భోగి, సంక్రాంతి, కనుమల మూడు రోజుల పండుగగా ఈ పెద్ద పండుగ ఉంటుంది. ఈరోజు ఉదయాన్నే లేచి, ఇంటి ముందు భోగి మంట వేసి, క్రమంగా ముగ్గులు వేయడం వంటివి ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు భోగి పళ్ళు, అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుని ఉంటాయి.

14. మకర సంక్రాంతి - 15 జనవరి 2019 :

14. మకర సంక్రాంతి - 15 జనవరి 2019 :

దీనినే పొంగల్ అని కూడా అంటారు, తమిళనాడు, పుదుచ్చేరి, శ్రీలంకలతో పాటుగా భారతదేశం మరియు ప్రపంచమంతటా ఉన్న తమిళులకు ప్రధాన వ్యవసాయ పండుగగా ఉంటుంది. ఆంద్రప్రదేశ్లో సంక్రాంతిగా వ్యవహరించే ఈ పండుగ హిందువుల ప్రధాన పండుగలలో ఒకటిగా ఉంటుంది. ఈ పండుగ సూర్యుని ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం సందర్భంగా సంక్రాంతి జరుపబడుతుంది. ఈ పుణ్యకాలం ఆరు నెలల పాటు కొనసాగుతుంది.

15. కనుమ - 16 జనవరి 2019 :

15. కనుమ - 16 జనవరి 2019 :

ఇది మకర సంక్రాంతికి చెందిన పండుగ. ఇది రాష్ట్రంలో పంట కాలం ముగింపును సూచిస్తుంది. అంతేకాకుండా ఇదే రోజును పశువుల పండుగగా కూడా గుర్తించబడుతుంది. ముఖ్యంగా పాడి పశువులు ఇళ్ళలో ఉన్నవారు, ఈ పండుగ నాడు, తమ పాడి పశువులకు ఇష్టమైన పిండి పదార్ధాలను అందించడం ఆనవాయితీగా వస్తుంది. పంట కాలం ముగింపు సందర్భంగా చేసుకునే పవిత్రమైన రోజు కూడా ఇదే కాబట్టి., క్రమంగా ఈరోజును మాఘ బిహు అని కూడా కొన్ని చోట్ల వ్యవహరిస్తుంటారు.

16. పుష్య పుత్రాడ ఏకాదశి - జనవరి 17, 2019 :

16. పుష్య పుత్రాడ ఏకాదశి - జనవరి 17, 2019 :

పుష్య మాసంలో, కృష్ణ పక్ష సమయంలో వచ్చే ఏకాదశి పర్వ దినాన్ని పుష్య పుత్రాడ ఏకాదశి అని వ్యవహరించడం జరుగుతుంది. ఈరోజు విష్ణు భాగావానుని ఆరాధనకు అంకితం చేయబడింది. సంతానం కోసం ఆలోచిస్తున్న దంపతులు ఈరోజు విష్ణువును ఆరాధించడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందగలరని భక్తుల విశ్వాసం.

17. గురు గోవింద్ సింగ్ జయంతి - జనవరి 13, 2019 :

17. గురు గోవింద్ సింగ్ జయంతి - జనవరి 13, 2019 :

గురు గోవింద్ సింగ్ సిక్కుల పదవ గురువు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులకు ప్రధాన పండుగగా ఈ రోజు ఉంటుంది. క్రమంగా ప్రార్ధనలు నిర్వహించడం, నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీగా ఉంటుంది. గురు గోవింద్ సింగ్ జయంతిని జనవరి 13న జరుపబడుతుంది.

18. బానాడ అష్టమి - 14 జనవరి 2019 :

18. బానాడ అష్టమి - 14 జనవరి 2019 :

మాసంలో శుక్ల పక్షాన వచ్చే అష్టమి తిధిని పుష్య శుక్లాష్టమిగా పిలుస్తారు. ఈ నెల 14 నుండి 21 వరకు శాకాంబరి నవరాత్రి జరుపబడుతుంది. శాకాంబరి, భగవతి దేవి యొక్క మరో అవతారంగా చెప్పబడుతుంది.

19. లోహ్రి - జనవరి 14, 2019 :

19. లోహ్రి - జనవరి 14, 2019 :

పంజాబ్ రాష్టంలో, ప్రధానంగా హిందువులు మరియు సిక్కులు జరుపుకునే ప్రముఖ పంజాబీ పండుగ లోహ్రి. ఈ పండుగ జనవరి 13 న, మకర సంక్రాంతికి ఒక రోజు ముందు వస్తుంది. ఈరోజు ప్రజలందరూ కలిసి మిఠాయిలను మరియు బహుమతులను మార్పిడి చేసుకుంటూ, ఒక ప్రత్యేకమైన పాటను పాడడం జరుగుతుంది. ఈ పాటలో ధనవంతుల నుండి దొంగిలించి, పేదవారికి పంపిణీ చేసే వ్యక్తి గురించిన వివరాలు ఉంటాయి.

20. రోహిణి వ్రతం – జనవరి 18, 2019 :

20. రోహిణి వ్రతం – జనవరి 18, 2019 :

రోహిణి వ్రతం జైన్ కమ్యూనిటీచే జరుపబడుతుంది. రోహిణి నక్షత్రం (కూటమి) ఆకాశంలో కనిపించే రోజున ఈ వ్రతం చేయడం జైనుల ఆనవాయితీగా ఉంటుంది. ఈరోజున ఉపవాస దీక్షను అనుసరించడం ద్వారా, భౌతిక జీవన సమస్యల నుండి విముక్తి కలుగుతుందని ఒక విశ్వాసం. రోహిణి వ్రతం జనవరి 18న గమనించవచ్చు.

Most Read :థర్టి ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేయాలని ఉన్నా చేయలేను, అబ్బాయితో బలవంతంగా డ్యాన్స్ చేసేలా చేశారుMost Read :థర్టి ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేయాలని ఉన్నా చేయలేను, అబ్బాయితో బలవంతంగా డ్యాన్స్ చేసేలా చేశారు

21. ప్రదోష వ్రతం - జనవరి 19, 2019 :

21. ప్రదోష వ్రతం - జనవరి 19, 2019 :

రెండు చతుర్దశి తిధులు ఒకే నెలలో సంభవించడం కారణంగా రెండు ప్రదోష వ్రతాలు ఈ నెలలో ఉన్నాయి. రెండవ ప్రదోష వ్రతం, 2019 జనవరి 18 న గమనించవచ్చు.

22. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం - జనవరి 21, 2019 :

22. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం - జనవరి 21, 2019 :

శ్రీ సత్య నారాయణ స్వామి, విష్ణువు యొక్క ప్రధాన రూపాల్లో ఒకటి. పౌర్ణమి రోజున సత్య నారాయణ స్వామికి ప్రార్ధనలు అందించడానికి సూచించదగిన అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈరోజు భక్తులు ఉపవాసం మరియు పూజలను అనుసరించడం పరిపాటిగా ఉంటుంది. ఎక్కువగా సత్య నారాయణ స్వామి వ్రతానికి ఉపక్రమించే రోజుగా ఉంటుంది. క్రమంగా గృహ సంబంధ సమస్యలు తొలగిపోయి, స్వాంతన చేకూరుతుందని భక్తుల విశ్వాసం. ఈ నెల జనవరి 21, 2019 న సత్య నారాయణ వ్రతాన్ని గమనించవచ్చు.

23. సంకష్ట హర చతుర్ధి - జనవరి 24, 2019 :

23. సంకష్ట హర చతుర్ధి - జనవరి 24, 2019 :

నెలలో కృష్ణ పక్షాన వచ్చిన రెండవ చవితి రోజును సంకష్ట హర చతుర్ధిగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ రోజు కూడా వినాయకునికి అంకితం చేయబడింది. ఈరోజు భక్తులు ఉపవాసం పాటించడం ఆనవాయితీగా ఉంటుంది. జనవరి 24, 2019న సంకష్ట హర చతుర్ధి వస్తుంది.

24 . సర్వ ఏకాదశి - జనవరి 31, 2019 :

24 . సర్వ ఏకాదశి - జనవరి 31, 2019 :

కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని సర్వ ఏకాదశిగా పరిగణించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇది జనవరి 31, 2019న వస్తుంది. ఈ రోజు ఏకాదశి కారణంగా, విష్ణువుకు అంకితం చేయబడుతుంది. మరియు ఈ రోజున ఆరు రకాలుగా తిల ధాన్యాలు లేదా నువ్వుల విత్తనాలు ఉపయోగించబడతాయి.

అంతేకాకుండా, 23 వ తేదీన నేతాజీ జయంతి, 28 న లాలా లజపతి రాయ్ జయంతి, 26 న రిపబ్లిక్ డే వంటివి కూడా ముఖ్యమైన రోజులుగా ఉన్నాయి.

Most Read :పాపాలు చేసేవారికి గరుడ పురాణం ప్రకారం 30 రకాల శిక్షలు ఇవే, అలాంటి పాపాలు అస్సలు చేయకండిMost Read :పాపాలు చేసేవారికి గరుడ పురాణం ప్రకారం 30 రకాల శిక్షలు ఇవే, అలాంటి పాపాలు అస్సలు చేయకండి

25. నేతాజీ జయంతి : జనవరి 23, 2019 :

25. నేతాజీ జయంతి : జనవరి 23, 2019 :

1897 న జనవరి 23న జన్మించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం వార్షికోత్సవంగా స్మరించుకోవడం జరుగుతుంది.

26. లాలా లజపతి రాయ్ జయంతి : 28, 2019 :

26. లాలా లజపతి రాయ్ జయంతి : 28, 2019 :

స్వాతంత్ర్య సమర యోధుడు లాలా లజపతి రాయ్ జయంతిని, అతని జ్ఞాపకార్ధం జనవరి 28న పుట్టినరోజు వార్షికోత్సవంగా స్మరించుకోవడం జరుగుతుంది. లాలా లజపతి రాయ్ గారిని పంజాబ్ కేసరి అని కూడా పిలవడం జరుగుతుంది. ఇతను 1865 జనవరి 28 న పంజాబ్లోని దుడికే గ్రామంలో జన్మించారు.

27. రిపబ్లిక్ డే : జనవరి 26, 2019 :

27. రిపబ్లిక్ డే : జనవరి 26, 2019 :

రిపబ్లిక్ డే ను గణతంత్ర దినోత్సవంగా కూడా వ్యవహరించడం జరుగుతుంది. 1950 లో డాక్టర్ BR అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగాన్ని అధికారికంగా అమలులోకి తీసుకువచ్చి ఆమోదించిన సందర్భంగా రిపబ్లిక్ డే జరుపబడుతుంది. క్రమంగా పూర్తి స్వాతంత్ర్యం వచ్చిన రోజుగా రిపబ్లిక్ డేను వ్యవహరించడం జరుగుతుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Hindu auspicious days in the month of January 2019

Hindu Auspicious Days In The Month Of January 2019
Desktop Bottom Promotion