మీ సంపదను వృద్ధి చేసే 4 కుబేర మంత్రాలు !

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

కుబేర-స్వామి, మనకు వస్తువులను మరియు సంపదలను కలుగజేసే గొప్ప దేవుడు. అతనిని "దేవతల సంపద యొక్క రక్షకుడని" కూడా పిలుస్తారు. సంపదను సృష్టించేది "లక్ష్మీ దేవి" అయినప్పటికీ, ఆ సంపదను పంపిణీ చేసే బాధ్యత మాత్రం "కుబేర-స్వామిదే".

అతనిని, బౌద్ధ ధర్మంలోనూ (జంబాల అని కూడా పిలుస్తారు) అలాగే జైన్ ధర్మలోనూ ప్రాముఖ్యత కలిగిన గొప్ప 'దేవుడి'గా కొనియాడబడుతూ ఉంటాడు. కుబేరుడు అనే సంస్కృత పదాన్ని, అతని యొక్క శారీరక వైకల్యాలను బట్టి 'సరైన ఆకృతిని కలిగి లేని వ్యక్తిగానూ' (లేదా) "క్రూరమైన / వైకల్యంతో" ఉన్న వ్యక్తియని అనువదించారు. మరొక సిద్ధాంతం ప్రకారం, అతనిని "కుంభ" అనే క్రియ పదం నుండి ఉద్భవించవచ్చని సూచిస్తుంది, అనగా "రహస్యంగా దాచేవాడని" దాని అర్థం.

Home 4 Kubera Mantras For Wealth and His Blessings

దేవుని చేత విశ్వంలో సృష్టించబడిన అన్ని సంపదలకు 'కుబేరుడే' సంరక్షకుడు. కానీ మొదట్లో దీనిని చాలా మంది ఇష్టపడలేదు. ఒకానొక సమయంలో, భారీ ఊబకాయ శరీరాన్ని కలిగి ఉన్న కుబేరున్ని చూసి చాలామంది ప్రజలు హాస్యాస్పదంగా వర్ణిస్తారు.

కుబేరుడు ఈ విధమైన అవమానాలను పొందటంవల్ల, అతను శివుని కోసం తపస్సు చేశాడు. శివుడు అతని ఎదుట ప్రత్యక్షమయ్యి, ఏ వరం కావాలో కోరుకోమని కుబేరుడిని అడిగాడు. కుబేరుడు, తనకి అత్యంత జనాదరణ పొంది మరియు అందరి చేత గౌరవం పొందాలని కోరుకున్నాడు. అలా ఆ శివుడు అతనిని అన్ని సంపదలకు సంరక్షకుడిగా నియమించగా, ఆ తరువాత నుండి కుబేరుడు ప్రజలందరిచేత ఆరాధించబడటం ప్రారంభమైనది. ఈవిధంగా ఎవరైతే కుబేర మంత్రాన్ని జపిస్తారు అలాంటివారు తప్పక కుబేరుని యొక్క ఆశీస్సులను పొందగలరు.

Home 4 Kubera Mantras For Wealth and His Blessings

హిందూ గ్రంధాల ప్రకారం, కుబేర మంత్రాన్ని ప్రతీరోజూ 108 సార్లు చెప్పున, 3 నెలల కాలం పాటు జపిస్తూ ఉండటంవల్ల కుబేరుడిని సంతృప్తిపరచి, అతని యొక్క ఆశీర్వాదాలు పొందేటందుకు ఇదే ఉత్తమమైన మార్గమని చెప్పవచ్చు. మీరు ఈ విధంగా కుబేర మంత్రాన్ని పఠించడం వల్ల ధనవృద్ధిని కలుగజేస్తూ, మీ జీవితంలో నుండి అరిష్టాలను దూరం చేస్తుంది మరియు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతూ, ఐశ్వర్యాలను, సంపదలను కలుగజేస్తుంది.

ఇక్కడ ఉన్న 4 కుబేర మంత్రాలను జపించటం వల్ల మీరు ఆ కుబేరుని యొక్క ఆశీస్సులను పొందటానికి, మరియు మీ సంపదలను వృద్ధి చేసుకోవడానికి దోహదపడుతుంది.

Home 4 Kubera Mantras For Wealth and His Blessings

వాటి యొక్క మూలాలు :-

1. కుబేర మంత్రం :

ॐ यक्षाय कुबेराय वैश्रवणाय धनधान्याधिपतये

धनधान्यसमृद्धिं मे देहि दापय स्वाहा॥

(ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యదీప్తాయే

ధనధాన్యసమృద్ధిం మి దేహీ దాపయా శ్వాహ ! )

2. కుబేర ధనాప్రాప్తి మంత్రం :

ॐ श्रीं ह्रीं क्लीं श्रीं क्लीं वित्तेश्वराय नमः॥

(ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః ! )

Home 4 Kubera Mantras For Wealth and His Blessings

3. కుబేరుడు అష్ట-లక్ష్మి మంత్రం :

ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्ट-लक्ष्मी मम गृहे धनं पुरय पुरय नमः॥

(ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్ట-లక్ష్మి

మమ గ్రిహి ధనం పూరయ పూరయ నమః ! )

4. కుబేర గాయత్రీ మంత్రం :

ఓం యక్ష రాజాయ విద్మయా

అలికదేషాయా ధీమహి

తన్నా కుబేర ప్రచోదయాత్ !

Home 4 Kubera Mantras For Wealth and His Blessings

అనువాదము: వైశ్రవణుని యొక్క కుమారుడు మరియు యక్షుల రాజైన "కుబేరుడిని" మేము ఈ విధంగా ధ్యానిస్తాము. అలా మా ప్రార్థనలకు సంపదల యొక్క దేవుడు స్ఫూర్తిని చెంది, మమ్మల్ని ప్రకాశింప చేసే విధంగా అనుగ్రహిస్తాడు.

అంతే కాకుండా, నిజమైన నిస్వార్ధమైన ప్రయోజనాల కోసం కుబేర మంత్రాలను జపించడం వల్ల ఋణ బాధల నుండి విముక్తి చేసి, సంపదను మరియు శ్రేయస్సును కలుగజేస్తాయని చెప్పబడినది.

ఏదేమైనప్పటికీ, ఈ మంత్రాలను స్వార్థంతోనూ, మరియు అత్యాశతో కూడిన చెడు ఉద్దేశ్యంతో జపించటం వల్ల - ఈ మంత్రాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం పూర్తిగా నశించి, కుబేరుని యొక్క కోపాన్ని ఆహ్వానించేదిగా మారుతుంది.

English summary

Home 4 Kubera Mantras For Wealth and His Blessings

Hindu scriptures says that chanting Kuber Mantras 108 time daily for 3 months is the one of the best way to please God Kuber and get his blessings. Thus, regular chanting of Kuber Mantra gives money and keeps away all the evil from your life and makes you healthy, wealthy and prosperous.