For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వివిధ రాష్ట్రాల్లో ఉగాదిని ఎలా సెలెబ్రేట్ చేసుకుంటారో తెలుసా?

వివిధ రాష్ట్రాల్లో ఉగాదిని ఎలా సెలెబ్రేట్ చేసుకుంటారు?

|

స్ప్రింగ్ సీజన్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సీజన్ కి సంబంధించిన ప్రత్యేకతను మాటల్లో వ్యక్తీకరించలేము. వింటర్ సీజన్ గడిచిన తరువాత స్ప్రింగ్ సీజన్ అనేది మన జీవితాల్లో ఒక రకమైన హోప్ ను క్రియేట్ చేస్తుంది. అందువలన, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇండియాలో అనేక పండుగలను సెలెబ్రేట్ చేసుకుంటారు.

పార్సీలు అలాగే జోరోఆస్ట్రియన్స్ నవ్రోజ్ ను సెలెబ్రేట్ చేసుంటారు. బెంగాలీలు, నబ వర్షని సెలెబ్రేట్ చేసుకుంటారు. రొంగాలి బీహు ని ఆసామీస్ సెలెబ్రేట్ చేసుకుంటారు. ఇలా ప్రతి కల్చర్ లో ఒక ప్రత్యేక పండుగ ఉంటుంది.

How is Ugadi celebrated in different states?

విషు అనే కేరళకి చెందిన పండుగను మనం ఈ సందర్భంలో తప్పకుండా గుర్తుకుతెచ్చుకోవాలి. స్ప్రింగ్ సీజన్ కి చెందిన పండుగల గురించి చెప్పుకోవాలంటే పంజాబ్ కి చెందిన బైశాఖి అనే విశిష్టమైన పండుగను మనం ప్రస్తావించి తీరాలి. ఈ పండుగకి సంబంధించిన ఎనర్జీ దేశమంతటా పరిభ్రమిస్తుంది.

దక్షిణాది రాష్ట్రాలలో, ఉగాది పండుగ అక్కడి ప్రజల గుండెల్లో ప్రత్యేకమైన స్థానాన్ని పొందింది. ఒక్కొక్క రాష్ట్రం ఈ పండుగను విభిన్నంగా జరుపుకున్నా ఉగాది ప్రత్యేకత మాత్రం అందరికీ సమానమే.

ఈ పండుగ నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ పాజిటివిటీని వ్యాప్తిచేస్తుంది. ఇండియాలోని వివిధ రాష్ట్రాల్లో ఈ పండుగను ఎలా జరుపుకుంటారో తెలుసుకుందామా మరి.

How is Ugadi celebrated in different states?

• ఆంధ్రప్రదేశ్

పురాణాల ప్రకారం, శ్రీమహావిష్ణువు మత్స్యావతారం ఎత్తిన రోజు ఇదేనని ఈ రాష్ట్ర ప్రజల నమ్మకం. ఈ పర్వదినం నాడు బ్రహ్మదేవుడి గొప్పదనాన్ని గుర్తుతెచ్చుకుంటారు. హిందూయిజంలోని దేవుళ్ళ ఖ్యాతిని కీర్తిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు.

ఈ పండుగనాడు ఇంటిని చక్కగా అలంకరించుకుంటారు. ఇళ్ళకి వైట్ వాష్ చేయిస్తారు. కొన్ని నెలల ముందే ఇంటిని అందంగా తీర్చిదిద్దుకునే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆంధ్రా తెలంగాణాలో స్ప్రింగ్ క్లీనింగ్ అనేది సంప్రదాయంతో ముడిపడి ఉందని మనం గుర్తించాలి. ఈ పండుగ సందర్భంగా ఇంటిని చక్కగా అలంకరించుకుని పండుగను ఘనంగా జరుపుకుంటారు.

How is Ugadi celebrated in different states?


• కర్నాటక

కర్ణాటకలో ఈ పర్వదినాన చైత్ర నవరాత్రి ప్రారంభమవుతుంది. ఈ చైత్ర నవమి అనేది ఈ రాష్ట్రంలోని ప్రజలకు అత్యంత ముఖ్యమైన పండుగ. ఇందులో నవరాత్రులను ఘనంగా జరుపుతారు. చివరి రోజు రామనవమిని అంటే రాముని జన్మతిథిని మరింత వైభవంగా జరుపుతారు.


కర్ణాటకలోని ఉగాదికి ఉన్న మరొక ప్రత్యేకత పంచాంగ శ్రవణం. రానున్న సంవత్సరం గురించి ప్రెడిక్షన్స్ ను ఈ రోజు తెలుసుకుంటారు. ఈ సెషన్ అనేది ఇంట్లో జరిగితే ఇంటి పెద్ద చేత ఈ ఆచారం నిర్వహింపబడుతుంది. మరోవైపు, ఒకవేళ ఈ వేడుక టెంపుల్ లో జరిగితే అక్కడి పూజారులు ఈ తంతును నిర్వహిస్తారు. ఈ రెండు సందర్భాలలో, ఈ తంతును నిర్వహించిన వ్యక్తికి కానుకలు(నగదు రూపంలో గాని వస్తు రూపంలో గాని) అందుతాయి.

• మహారాష్ట్ర

గుడి పద్వాగా ఉగాదిని మహారాష్ట్రలో జరుపుకుంటారు. పురాణాల ప్రకారం, ఈ రోజున బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని ఇక్కడి వారి నమ్మకం. ఈ రోజునే సత్యయుగం ప్రారంభమైందని నమ్మకం. అందువలన, ఈ రోజున అనేక ఆచారాలను కచ్చితంగా పాటిస్తారు. రంగురంగుల ముగ్గును ఇంటి ముంగిట అలంకరిస్తారు. ఈ ఆచారాన్ని మహారాష్ట్రలో ఉగాది రోజున వైభవంగా జరుపుతారు.

ఈ రోజున మహిళలు ఉదయాన్నే లేచి రంగులతో ఇంటి ముంగిటను ముగ్గులతో నింపుతారు. ఈ రంగులనేవి ఇంట్లోని నెగటివిటీని తొలగించి పాజిటివిటీని ఆకర్షిస్తాయని నమ్ముతారు. ఇదే రీజన్ వలన, గుడి పద్వా డెకరేషన్స్ లో భాగంగా ఇంటిని రంగు రంగుల పూలతో డెకరేట్ చేయడం ఆనవాయితీ.

• తెలంగాణ

ఉగాది పండుగను తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే జరుపుకుంటారు. ఉగాది నాడు ఉదయాన్నే లేచి పవిత్ర స్నానాన్ని ఆచరిస్తారు. పవిత్ర స్నానం కోసం దగ్గరిలోనున్న చెరువుకు చేరుకుంటారు. ఆ తరువాత మహిళలు అయిదు గజాల చీరలను కట్టుకుంటారు. పురుషులు సాంప్రదాయ పంచెను ధరిస్తారు. ఈ రోజు కొత్తబట్టలు ధరించడం ఆనవాయితీ. కొత్తబట్టలు కొనలేని వారు శుభ్రమైన బట్టలను ధరిస్తారు. ఆ తరువాత, కుటుంబ సమేతంగా దైవాన్ని ప్రార్థిస్తారు. దగ్గరలోనున్న గుడిని దర్శిస్తారు. నూతన సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని ప్రార్థిస్తారు.

English summary

How is Ugadi celebrated in different states?

How is Ugadi celebrated in different states,Here’s how Ugadi is celebrated in different parts of the country. Read to know how Ugadi is celebrated in Andhra Pradesh, Tamil Nadu, etc.
Desktop Bottom Promotion