For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హనుమంతుడు అత్యంత శక్తివంతుడుగా ఎలా మారాడు?

|

హనుమంతుని తరచుగా అత్యంత శక్తిమంతమైన, తిరుగులేని మరియు అమరత్వాన్ని పొందిన దేవునిగా వర్ణించడం జరుగుతుంటుంది. ఆయన ఇప్పటికీ భూమి మీద వివిధ రూపాల్లో ఉన్నాడని, ఆయన భక్తుల ప్రఘాడ నమ్మకం. మరియు ఆపదలో ఆదుకునే ఆపద్భాందవుడిగా ఎల్లప్పుడూ భక్తులను కాపాడుతూ ఉంటాడని విశ్వసిస్తారు. క్రమంగా ఎంతో మంది హనుమంతుని చూసినట్లుగా, మరియు అతని శక్తులతో తాము కష్టాల నుండి బయటపడినట్లుగా కూడా చెప్పుకోవడం చూస్తూనే ఉన్నాము. హనుమంతునికి రూపాన్ని మార్చే శక్తి కూడా ఉన్న కారణాన, ఏదో ఒకరూపంలో భక్తులను నిరంతరం కాపాడుతూనే ఉంటాడని విశ్వసించడం జరుగుతుంటుంది. కానీ అతను అంత శక్తిమంతమైన దేవునిగా ఎలా మారాడు ? ఇక్కడ ఈ వ్యాసంలో సమాధానం పొందుపరచబడి ఉంది. మరిన్ని వివరాల కోసం వ్యాసంలో ముందుకు సాగండి.

ఒక గంధర్వ కన్యకు బ్రహ్మ ఇచ్చిన శాపం కారణంగా …

ఒక గంధర్వ కన్యకు బ్రహ్మ ఇచ్చిన శాపం కారణంగా …

హనుమంతుని కథ ప్రారంభం అంజనా దేవికి బ్రహ్మ ఇచ్చిన శాపంతోనే మొదలవుతుంది. అంజనా అనే ఒక గంధర్వ కన్యను ఒక కోతి వలె మారమని బ్రహ్మ దేవుడు శపించాడు. చేసిన తప్పుకు ఆమె క్షమాపణ చెప్పిన తర్వాత, బ్రహ్మ శాంతించినా, శాపాన్ని వెనక్కి తీసుకోలేని కారణాన ఒక శాపవిమోచానానికి దారిని సూచించాడు. క్రమంగా ఒక వానరానికి జన్మనిచ్చిన తర్వాత ఆమె తన అసలు రూపాన్ని తిరిగి పొందుతుందని సెలవిచ్చాడు. అంతేకాకుండా ఆ పిల్లవాడు విశ్వమంతటా ప్రజాదరణ పొందుతాడని కూడా చెప్పాడు.

వజ్రాయుధంతో హనుమంతునిపై ఇంద్రుని దాడి :

వజ్రాయుధంతో హనుమంతునిపై ఇంద్రుని దాడి :

ఒకనాడు బాలునిగా ఉన్న హనుమంతునికి సూర్య భగవానుడు పండులా కనిపించిన కారణంగా, పండుగానే భ్రమపడి సూర్య భగవానుని సేవించాలని గాలిలోకి ఎగిరాడు. దేవతల రాజైన ఇంద్రుడు, హనుమంతుడు సూర్యుని సమీపించి మింగబోతున్నాడని గ్రహించి లోక సంరక్షణ కోసం తన ఆయుధమైన, వజ్రాయుధాన్ని హనుమంతుని మీదకు విసిరాడు. ఆ ఆయుధానికి తగిలిన హనుమంతుడు స్పృహ కోల్పోయి కిందపడిపోయాడు.

వాయుదేవుని ఆగ్రహ జ్వాల :

వాయుదేవుని ఆగ్రహ జ్వాల :

ఈ పరిణామం హనుమంతుని తండ్రైన వాయుదేవునికి ఆగ్రహం తెప్పించి. వెంటనే వాయువును స్థంబింపజేశాడు. క్రమంగా లోకమంతా అల్లకల్లోలానికి గురైంది. ప్రాణకోటి కకావికలం అయింది, మేఘాలు ఆగిపోయాయి. సూర్యుని తాపం పెరిగి, లోకమంతా అగ్నిగుండం వలె మండిపోసాగింది. క్రమంగా లోకమే అంతరించే దశకు చేరుకుంది.

దేవతలందరూ హనుమంతుడిని ఆశీర్వదించడం మొదలుపెట్టారు. .

దేవతలందరూ హనుమంతుడిని ఆశీర్వదించడం మొదలుపెట్టారు. .

వాయువు దేవుని శాంతపరచేందుకు దేవతలందరూ హనుమంతునికి ఆశీర్వాదాలు ఇవ్వడం ప్రారంభించారు. ఏ ఆయుధమూ హనుమంతుని గాయపరచకుండా, తాను కోరుకున్నప్రతిచోటా ప్రయాణం చేయగలిగి, తన రూపాన్ని సైతం మార్చుకోగల శక్తిని ప్రసాదిస్తున్నట్లు బ్రహ్మ దేవుడు వరమిచ్చాడు. ఇంద్రుడు కూడా వజ్రాయుధం సైతం ఇక హనుమంతుడిని గాయపరచలేదని, వజ్రాయుధం కన్నా హనుమంతుని శరీరం శక్తివంతంగా ఉంటుందని వరమిచ్చాడు. వరుణ దేవుడు నీటి నుండి ఎటువంటి హాని కలుగకుండా వరమివ్వగా, అగ్నిదేవుడు అగ్ని నుండి ఎటువంటి కష్టమూ కలుగకుండా వరాన్ని ఇచ్చాడు.

ఇక యమలోకాధిపతి, మృత్యుదేవుడు అయిన యముడు, హనుమంతునికి ఆరోగ్యకరమైన జీవితాన్ని మరియు అమరత్వాన్ని అనుగ్రహించాడు. క్రమంగా సూర్య భగవానుడు, హనుమంతుడు తన పరిమాణాన్ని మార్చుకోగలిగిన శక్తిని ప్రసాదించగా, దైవ శిల్పి విశ్వకర్మ తాను సృష్టించిన అన్ని వస్తువుల నుండి రక్షణను అనుగ్రహించాడు. క్రమంగా ఈ వరాలన్నీ హనుమంతుని అంత దృఢంగా, శక్తిమంతంగా తయారుచేశాయని చెప్పబడింది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, సౌందర్య, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, మాతృత్వ, శిశు సంబంధ, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

How Lord Hanuman Became So Powerful?

Lord Hanuman is the invincible, immortal God who comes as and when his devotees call him for help. An incarnation of Lord Shiva, he is one of the most powerful Gods. There is a story which explains how he attained power. The story goes back to the time when he was a kid and got injured due to an innocent mischief.
Story first published: Wednesday, March 27, 2019, 10:29 [IST]
Desktop Bottom Promotion