For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హిందూ ఆచారాలలో దుర్వా గరిక యొక్క ప్రాముఖ్యత

By Super
|

హిందూ పూజా విధానాల్లో వాడే దూర్వా గరిక గురించి వినే ఉంటారు.దీనినే దూర్వా గరిక లేదా “దూబ” గరిక అంటారు.ఏ పూజయినా దూర్వా గరిక ని అర్పించనిదే పూర్తైనట్లు లెక్క కాదు.గణేశుని పూజ లో ముఖ్యం గా దీనిని సమర్పిస్తారు

“దూర్వ” అనేది ఒక పవిత్రమైన గడ్డి రకం.ఈ పదం “దుహూ” మరియు “అవం” అనే పదాల నుండి వచ్చింది. దూర్వ గరిక దూరం గా ఉన్న దేవుని పవిత్ర కిరణాలని భక్తునికి దగ్గరకి తీసుకొస్తుంది.

దూర్వా గరిక లో 3 అంచులు లేదా కంకులు ఉంటాయి.ఈ మూడూ శివ, శక్తి, గణపతి స్వరూపాలకి ప్రతీక.గణేశుని ఆకర్షించే శక్తి ఉండటం వల్ల ఈ గరికని గణేశునికి అర్పించే వాటిలో ముఖ్యమైనది గా భావిస్తారు.

సాధారణం గా దూర్వా గరిక యొక్క లేత రెమ్మలని దేవతారాధన లో వాడతారు.ఈ లేత రెమ్మల మీద ఉన్న మంచు బిందువులు విగ్రహాల నుండి శక్తిని గ్రహిస్తాయి. అందువల్ల పూజ చేసే భక్తునికి ఇది ఎంతో లాభదాయకం.


దూర్వా గరికకి పూలు పూసి ఉంటే దానిని పూజా కర్మలకి వాడరు.పూవులున్న చెట్టు పరిపక్వత కి చిహ్నం.చెట్టు కి ఫలాలుండటం వల్ల దాని యొక్క తేజస్సు తగ్గుతుంది.అందువల్ల దేవతా విగ్రహాల నుండి శక్తి తరంగాలని ఆకర్షించే గుణం తగ్గిపోతుంది.

Importance Of Durva Grass In Hindu Rituals

ఇప్పుడు అసలు ఈ దూర్వా గరిక ని ఎలా అర్పించాలి, హిందూ మత కర్మలలో దాని ప్రాముఖ్యత చూద్దాము.

దూర్వా గరిక కధ:
ఓకసారి అనలాసురుడు అనే రాక్షసుడు తన కళ్ళ నుండి అగ్నిని కి పుట్టించి ఆ అగ్నిని అడ్డొచ్చినవాటినన్నింటినీ దహించేసాడు.అందువల్ల స్వర్గం లో వినాశనం జరిగింది.దేవతలంతా గణేశుని దగ్గరకి వెళ్ళి తమని ఆ రక్షసుని బారినుండి కాపాడవలసిందిగా ప్రార్ధించారు.తాను ఆ రాక్షసుని సంహరించి శాంతి నెలకొల్పుతానని గణేశుడు వారికి మాట ఇచ్చాడు. యుద్ధరంగం లో అనలాసురుడు అగ్ని గోళాలతో గణేశుని ఆకర్షించి దగ్గరకి రాగానే మింగెద్దామనుకున్నంతలో గణేశుడు తన “విరాట్” రూపాన్ని ప్రదర్శించి ఆ రాక్షసుణ్ణి మింగేశాడు.


అలా రాక్షసుణ్ణి మింగిన తరువాత గణేశుడు తన ఒంటిలోని వేడిచేత చాలా అసౌకర్యానికి గురయ్యాడు.అందుకని చంద్రుడు సాయం చేద్దామని వచ్చి గణేశుని తలపైన నిలబడ్డాడు.అందువల్ల ఆయనని “బాల చంద్రుడు” అంటారు.గణేశుని ఒంట్లోని వేడి తగ్గించడానికి విష్ణు మూర్తి తన కమలాన్ని ఇచ్చాడు,పరమ శివుడు నాగుపాము ని గణేశుడి పొట్ట చుట్టూ కట్టాడు.ఇవేమీ ఆయన ఒంట్లోని వేడిని తగ్గించలేకపోయాయి. అప్పుడు కొంత మంది ౠషులు 21 దూర్వా గరికలు తీసుకొచ్చి గణేశుని తలపై ఉంచారు.వెంటనే వేడి తగ్గిపోయింది.అప్పుడు గణేశుడు తనని ఎవరు దూర్వా గరికలతో పూజిస్తారో వాళ్ళు ఎల్లప్పుడూ తన ఆశీర్వాదాలని పొందుతుంటారని వరమిచ్చాడు.

Importance Of Durva Grass In Hindu Rituals

దూర్వా గరిక ని ఎలా సమర్పించాలి
గణేశుని 3 లేదా 5 ఆకులున్న దూర్వా గరికలని అర్పించాలి. వాటిని దూర్వాంకురాలు అంటారు. మధ్య ఆకు గణేశుని, మిగతా రెండు ఆకులు శివ, శక్తి స్వరూపాల నుండి శక్తిని గ్రహిస్తాయి. కనీసం 21 దూర్వా గరికలని గణేశునికి సమర్పించాలి.ఈ గరికలని నీటిలో ముంచి ఒకదానితో మరొకటి ముడి వేసి గణేశునికి అర్పించాలి.గణేశ విగ్రహం లో ముఖం తప్ప మిగతా శరీరాన్నంతటినీ దూర్వా గరికలతో అలంకరించవచ్చు.మొదట పాదాల వద్ద దూర్వా గరికని పెట్టి ఆ తరువాత పైన ఉన్న మిగతా శరీర భాగాలకి అర్పించాలి.


దూర్వా యొక్క ప్రాముఖ్యత:
దేవతా విగ్రహం యొక్క పాదాల నుండి శక్తి తరంగాలు విపరీతం గా వెలువడుతాయి.అందువల్ల మొట్టమొదట పాదాల వద్ద అర్పించిన దూర్వా గరిక లో ఈ శక్తి తరంగాలు అధికం గా ఉంటాయి ఈ తరంగాలు “సగుణ్” గా పిలవబడే దేవతా లక్షణాలు గల తరంగాలుగా మారి విగ్రహం నుండి వెలువడతాయి. ఇది పూజ చేసే భక్తునికి శ్రేయస్సు ని కలగచేస్తుంది.దూర్వా గరికల ద్వారా వెలువడే ఈ శక్తి తరంగాల వల్ల పరిసరాల్లోని రజ-తమో గుణాలవల్ల కలిగే ప్రతికూల ప్రభావాలని తగ్గించవచ్చు.అందువల్లే నెగిటివ్ ఎనర్జీ తో బాధ పడే వారెవరైనా దూర్వా గరికలని తాకితే చాలు ఒత్తిడి తగ్గి పాజిటివ్ ఎనర్జీని పొందుతాడు.

English summary

Importance Of Durva Grass In Hindu Rituals

You must be aware of the use of a special kind of grass in various Hindu puja rituals. It is popularly known as the ‘durva’ or the ‘doob’ grass. No puja is ever deemed complete without offering durva to the deity. It is especially an important offering when you perform Ganesh puja.
Desktop Bottom Promotion