For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తొలి ఏకాదశి ప్రాముఖ్యత..ఒక్కో నెలలో వచ్చే ఏకాదశి పూజా ఫలం..!

|

ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే "శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి" అని కూడా అంటారు. ఈ రోజునుంచీ శ్రీ మహ విష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడు. గనుక దీన్ని "శయన ఏకాదశి" అంటారు. నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే, ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు.

ఐతే, మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు, ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతే గాక చాతుర్మాస్య వ్రతంకూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని, కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని మన పురాణాలు చెబుతున్నాయి.

Importance Of Tholi Ekadasi and Vrat Benefits....

ఏకాదశి ఫలములు:
ఏకాదశి వ్రతమును గురించి తెలియని వారు ఉండరు. శ్రీ మహావిష్ణువు ప్రీతీ కొరకు ఏకాదశి వ్రతమును పాటిస్తారు. ఆషాఢమాసం లో వచ్చే తొలి ఏకాదశి మొదలుకొని సంవత్సరంలో వచ్చే అన్ని ఎకాదశులకు వివిధ నామాలు, వాటియొక్క ఫలితములు తెలుసుకొందాం;

1. ఆషాఢ శుద్ధ ఏకాదశి: శయనైకాదశి.: (తొలి ఏకాదశి ): దక్షిణాయన ప్రారంభం: ఆయుర్వృద్ధి.

2. ఆషాఢ బహుళ ఏకాదశి : కామ్యైకాదశి : ఇష్ట కామ్యార్ధ సిద్ది.

3. శ్రావణ శుద్ధ ఏకాదశి: పుత్రదైకాదశి: పుత్ర సంతాన ప్రాప్తి.

Importance Of Tholi Ekadasi and Vrat Benefits....

4. శ్రావణ బహుళ ఏకాదశి: అజైకాదశి: సమస్త దు:ఖల నుండి విముక్తి

5. భాద్రపద శుద్ధ ఏకాదశి: పరివర్తన ఏకాదశి: అసంపూర్ణంగా ఉండిపోయిన పనులు పూర్తి అగును.

6. భాద్రపద బహుళ ఏకాదశి. ఇంద్ర ఏకాదశి: ఇంద్ర భోగములు సమకూరును

7. ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి. మహార్జయ ఏకాదశి: సర్వత్రా విజయం;

8. ఆశ్వయుజ బహుళ ఏకాదశి: రామైకదసి: ఎంచుకున్న రంగంలో విజయం;

Importance Of Tholi Ekadasi and Vrat Benefits....

9. కార్తీక శుద్ధ ఏకాదశి: ఉత్థాన ఏకాదశి: ఈరోజు చేసే దాన ధర్మాల వాళ్ళ అనంతమైన పుణ్యం లభిస్తుంది.

10. కార్తీక బహుళ ఏకాదశి : ఉత్పత్తైకాదశి : అఖండమైన పుణ్యం .

11. మార్గశిర శుద్ధ ఏకాదశి: ఉత్తమైకాదశి: ( ధ్రువ ఏకాదశి) తృప్తి, స్థిర చిత్తం; కలుగుతాయి.

12. మార్గశిర బహుళ ఏకాదశి: సఫలైకాదసి అనూహ్య ఫల ఏకాదశి ): జీవిత గమనాన్ని మార్చివేసే ఉపకారం జరుగుతుంది.

Importance Of Tholi Ekadasi and Vrat Benefits....

13. పుష్య శుద్ద ఏకాదశి: మోక్షన్య ఏకాదశి: వైకుంఠ మోక్షం, విష్ణు సాయుజ్యం.

14. పుష్య బహుళ ఏకాదశి: షట్ తిలైకదసి: శని దోషాలు హరించును.

15. మాఘ శుద్ధ ఏకాదశి: జయ ఏకాదశి: }
16. మాఘ బహుళ ఏకాదశి: విజయ ఏకాదశి } సర్వత్రా విజయం.

Importance Of Tholi Ekadasi and Vrat Benefits....

17. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి: అమలక ఏకాదశి: పతితోద్ధారణం

18. ఫాల్గుణ బహుళ ఏకాదశి: పాప విమోచన ఏకాదశి: పాప సంహారము.

19. చైత్ర శుద్ధ ఏకాదశి: కామదా ఏకాదశి: అభిష్ట సిద్ది:

20. చైత్ర బహుళ ఏకాదశి: వరూధిని ఏకాదశి: గో సహస్ర దాన ఫలం

Importance Of Tholi Ekadasi and Vrat Benefits....

21. వైశాఖ శుద్ధ ఏకాదశి: మోహిని ఏకాదశి: వశీకరణ శక్తి

22. వైశాఖ బహుళ ఏకాదశి: అపర ఏకాదశి: తీర్థ యాత్రా ఫలం

23. జ్యేష్ట శుద్ధ ఏకాదశి: నిర్మల ఏకాదశి: }

24. జ్యేష్ట బహుళ ఏకాదశి: యోగిన్యేకదశి: } సర్వరోగ హరణం..

ఇవి సంవత్సరంలోని ఏకాదశి ఫలితములు.

English summary

Importance Of Tholi Ekadasi and Vrat Benefits....

Importance and Significance of Tholi Ekadasi , Aashada Shuddha Ekadasi i.e the 11th day after Amavasya / No Moon day in the Hindu month of Aashadam is known as Tholi Ekadasi. It is also known by the names 'Sayana Ekadasi', 'Aashadi Ekadasi', 'Devasayana Ekadasi', 'Padma Ekadasi' and 'Vishnu Sayani Ekadasi'.
Story first published: Friday, July 15, 2016, 14:45 [IST]
Desktop Bottom Promotion