For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియాలో ఇప్పటికీ ఈ వింత మూఢ నమ్మకాలు.. వింటే ఆశ్చర్యపోతారు...!

|

ప్రపంచంలో ఎక్కడా లేనంతగా మన దేశంలో పూర్వ కాలం నుండి అనేక ఆచారాలు,సంప్రదాయాలు, వ్యవహారాలు, కట్టుబాట్లు ఉన్నాయి. అయితే అందులో చాలా వరకు మూఢ నమ్మకాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు.

అందుకు అనేక ఉదాహరణలు శాస్త్రీయ బద్ధంగా నిరూపించారు. ప్రస్తుత ఆధునిక యుగంలో టెక్నాలజీ ఎంత అందుబాటులో ఉన్నప్పటికీ మనలో చాలా మంది మూఢ నమ్మకాలను గుడ్డిగా నమ్ముతారు. అంతేకాదు అందుకు గల కారణాలను కూడా చెబుతున్నారు.

కాలగర్భంలో ఎన్నో మూఢ నమ్మకాలు మునిగిపోయినప్పటికీ.. కొందరు వాటిని సమర్థిస్తూనే ఉన్నారు. ఇక ఏదైనా శుభకార్యం చేయడానికి ముందు శుభ శకునాలను కచ్చితంగా చూస్తారు. అయితే ఇలాంటి వాటిని ఎలా గుర్తిస్తారు? వాస్తు శాస్త్రం ప్రకారం, ఇండియాలో ఇప్పటికీ చాలా మంది నమ్ముతున్న వింత ఆచారాలు, సంప్రదాయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

పితృ పక్షంలో చనిపోయిన వారికి ఆహారం (పిండ ప్రధానం) అందించడంలో ప్రాముఖ్యత?పితృ పక్షంలో చనిపోయిన వారికి ఆహారం (పిండ ప్రధానం) అందించడంలో ప్రాముఖ్యత?

అలా ఎదురైతే..

అలా ఎదురైతే..

మనలో ఎవరైనా బయటికి వెళ్లేటప్పుడు మెడలో తాళిబొట్టు.. నుదుటిన నిండుగా కుంకుమ బొట్టు.. కాలికి మెట్టు.. ముత్తైదువులా చీర కట్టుకుని ఎవరైనా మహిళ ఎదురైతే.. ఆ సమయాన్ని శుభ శకునంగా భావిస్తారు. అయితే పొరపాటున ఎవరైనా విధవ(భర్త చనిపోయిన) మహిళ ఎదురైతే దాన్ని అశుభానికి సంకేతంగా భావిస్తారు. గుండు (శిరోముండనం)చేయించుకున్న వ్యక్తి ఎదురైతే కూడా అశుభంగా పరిగణిస్తారు. అలాగే పిల్లి ఎదురైనా.. అది మన దారికి అడ్డంగా నడిచినా కూడా అశుభానికి సంకేతంగా భావిస్తారు.

బ్రాహ్మణులు జంటగా..

బ్రాహ్మణులు జంటగా..

మరి కొన్ని సందర్భాల్లో మంచి నీటి బిందె, పాల బిందె, పెరుగు పాత్రలు, కల్లు కుండలో మోసుకుని వచ్చే వారు, వేశ్యలు, చాకలి వారు, చెరకు కట్టను మోసుకెళ్లే వారు, జంటగా వెళ్లే బ్రాహ్మాణులు ఎదరైతే ఆ సమయాన్ని శుభ శకునంగా భావిస్తారు. అయితే ఒంటరిగా వచ్చే బ్రాహ్మణుడు ఎదురైతే దాన్ని అశుభకరంగా భావిస్తారు.

కుడివైపున వెళితే..

కుడివైపున వెళితే..

వాస్తు శాస్త్రం ప్రకారం, మనం ఏదైనా శుభకార్యం నిమిత్తం బయటకు వెళ్తున్నప్పుడు.. ఆవు, జింక, ఉడుత, కోడి, చిలువక, కొంగ, కుందేలు, నక్క, గద్ద వంటి పశుపక్ష్యాదులు మీకు కుడివైపు నుండి వెళ్లాయంటే దాన్ని శుభప్రదంగా భావించొచ్చు. అలాగే పక్షుల జంటలను చూస్తే కూడా శుభకరంగా ఉంటుందట.

పితృ పక్షాలు 2021:పూర్వీకుల ఆత్మకు శాంతి కోసం పితృ పక్షాలందు ఈ ఏడు వస్తువులను దానం చేయండి...పితృ పక్షాలు 2021:పూర్వీకుల ఆత్మకు శాంతి కోసం పితృ పక్షాలందు ఈ ఏడు వస్తువులను దానం చేయండి...

నాయిబ్రాహ్మణులు ఎదురైతే..

నాయిబ్రాహ్మణులు ఎదురైతే..

హిందూ సంప్రదాయం ప్రకారం, మనం బయటకు వెళ్లే సమయంలో మంగళివారు(నాయి బ్రహ్మాణులు)తమ సామాగ్రితో ఎదురుపడితే దాన్ని కూడా శుభప్రదంగా భావిస్తారు. అయితే మంగళవారం రోజున ఇప్పటికీ మన దేశంలో కటింగ్, షేవింగ్ వంటివి చేసుకోరు. అలాగే తాము పుట్టినరోజున క్షవరం వంటివి చేసుకోకూడదని పెద్దలు చెబుతుంటారు. అంతేకాదు ఆరోజున గోళ్లను కూడా కత్తిరించకూడదట.

గుమ్మంలో తుమ్మితే..

గుమ్మంలో తుమ్మితే..

హిందూ సంప్రదాయం ప్రకారం, ఇంట్లో ప్రవేశ ద్వారం(గుమ్మం) మీద నిలబడి తుమ్మితే దాన్ని అశుభంగా భావిస్తారు. ఈ సమయంలో ఏదైనా కీడు జరుగుతుందని చాలా మంది ఇప్పటికీ నమ్ముతారు. అయితే దీనికి నివారణగా కొందరు కొన్ని మంచినీళ్లను తెచ్చి మన నెత్తి మీద చల్లుతారు. మరి కొందరు అదే గడప మీద నిలబడి పసుపు నీటిని చల్లుకోమని పెద్దలు చెబుతారు.

అవి అరిస్తే..

అవి అరిస్తే..

మన ఇళ్లలో.. లేదా కార్యాలయాల్లో బల్లి అరిస్తే దాన్ని అశుభంగా భావిస్తారు. అలాగే మన ఇంటి బయట కాకి తరచుగా అరుస్తూ ఉంటే.. ఆ సమయంలో మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారని.. అందుకే సంకేతంగా ఈ కాకి అరుస్తుందని భావిస్తారు. మరోవైపు ఎవరైనా తమ ఇంట్లో శునకాన్ని పెంచుకుంటే.. అది మనం బయటకు వెళ్లేటప్పుడు తుమ్మితే ఆ సమయాన్ని శుభప్రదంగా భావిస్తారు.

English summary

Indian Superstitions and the Scientific Reasons Behind Them in Telugu

Here we are talking about the Indian Superstitions and the scientific reasons behind them in Telugu. Have a look