For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఇంటి నుంచి లక్ష్మీదేవి ఎలాంటి సందర్భాల్లో అలిగి వెళ్లిపోతుంది ?

|

నారాయణునిపై అనురాగం పెల్లుబిక్కడం చేత లక్ష్మీదేవి తన భక్తుల వద్ద కూడా ఎక్కువ సేపు నిలబడదు. అందువల్లే ఆమెకు చంచల అనే పేరు కూడా వచ్చింది. ఆమె అనురాగమే ఆమెకు ఆ అపకీర్తిని తెచ్చి పెట్టింది. అంటే మనం ఇక్కడ గుర్గుంచుకోవాల్సిన ముఖ్య విషయం లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం సదా నారాయణుని మనసులో నిపులకోవాలి. ఎప్పుడైతే నారాయణుడు మన మనస్సులో నివాసం ఉండడో, అప్పుడు లక్ష్మీదేవి కూడా మనలను విడిచి పెట్టి వెళుతుంది. కాబట్టి, సదా మనస్సులో నారాయణున్ని నిలుపుకోవాలి.

లక్ష్మీదేవికి చంచల, చపల అనే పేర్లున్నాయి. ఒక చోట స్థిరంగా ఉండదని దీని భావం. ఎందరి జీవితానుభావాల్లో దీనికి నిదర్శనం. నిత్యం మనం ఇట్లో వెలిగించే దీపమే లక్ష్మీ రూపం...చీకటి నుండి వెలుగులోకి ప్రయాణించడమే జ్ఞానం, అదే సంపద, జ్ఞానము, సంపద బిన్నమైనవి కావు. ఒకటి వుంటే రెండోది ఉన్నట్టే. ఇతరులను వంచిస్తే, అవినీతి మార్గాల్లో ఐశ్వర్యాన్ని సంపాదిస్తే చాలనుకుంటారు చాలామంది. అలాంటివారిని లక్ష్మి వరించినట్టు కనిపించినా అది చంచలం.

దయా, సేవాబావం, శ్రమ, వినయం, వివేకం ఉన్నచోట లక్ష్మి స్థిరంగా ఉంటుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇదే అసలు రహస్యం. లక్ష్మీదేవి అష్టరూపాలలో కనిపిస్తుంది అవి ఆదిలక్ష్మీ, దైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి విద్యాలక్ష్మి, ధనలక్ష్మి దేవిలా ఉంటుందని మనకు తెలుసు. వీటిలో విద్యాలక్ష్మి' అంటే, జ్ఞానం వివేకం వంటి సద్గుణ సంపద అని కుడా అర్ధం చేసుకోవాలి. అటువంటి లక్ష్మితత్వాన్ని అందరుసంపాదించాలి. మంచి మనసే లక్ష్మిదేవికి ఖచ్చితమైన సేఫ్టీ లాకరుగా చెప్పవచ్చు.

లక్ష్మి దేవి ఎక్కడ వుంటుంది అని నారదుడు శ్రీ మహావిష్ణువుని అడుగగా అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మి దేవి ఎక్కడెక్కడ ఉంటుందో చెప్పారు అవి ఏమిటంటే "అఖిల విశ్వం సమస్త ప్రాణులు నా అదీనంలో ఉంటే , నేను నా భక్తుల అదీనంలో ఉంటాను. మీరు నా భక్తులు, కనుక మీకు పరమైస్వర్యాన్ని అందించే ఆచలలక్ష్మిని ప్రసాదిస్తాను. అయితే దానికి ముందుగా నేను చెప్పబోయే మాటలు వినండి - అంటూ లక్ష్మి ఎవరెవరి వద్ద ఉంటుందో, ఎవరివద్దవుండదో, వివరించాడు. లక్ష్మీ దేవి ధనానికి అదిష్టాన దేవత. అలాంటి లక్ష్మీదేవి అసలు ఎందుకు అలుగుతుంది? ఆమె అలగకుండా ఉండేందుకు మనం ఏం చేయాలి? అసలు ఆమె అలగడానికి వెనుక అసలు కారణాలు ఏమిటి అనే తెలుసుకోవాలి. లక్ష్మిని కోరుకునే వారందరూ తప్పకుండా దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలివి.

మంగళవారం రోజు అప్పు తీసుకోవడం వల్ల

మంగళవారం రోజు అప్పు తీసుకోవడం వల్ల

మంగళవారం రోజు అప్పు తీసుకోవడం వల్ల లక్ష్మీదేవి అలుగుతుందట. అంతే కాదు అప్పు తొందరగా తీరదట.కాబట్టి, మంగళవారం అప్పు తీసుకోవాలన్నా...అప్పు ఇవ్వాలన్నా..ఒక్కసారి ఆలోచించండి.

లక్ష్మీదేవి ఎలాంటి సందర్భాల్లో అలిగి వెళ్లిపోతుంది ? కారణం ఏంటి?

లక్ష్మీదేవి ఎలాంటి సందర్భాల్లో అలిగి వెళ్లిపోతుంది ? కారణం ఏంటి?

అలాగే బుదవారం రోజు అప్పు ఎవ్వరికీ ఇవ్వకూడదట. ఒకవేళ అదే పని పదేపదే చేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి అలిగి ఇంటి నుండి వెళ్లిపోతుందట.

లక్ష్మీదేవి ఎలాంటి సందర్భాల్లో అలిగి వెళ్లిపోతుంది ? కారణం ఏంటి?

లక్ష్మీదేవి ఎలాంటి సందర్భాల్లో అలిగి వెళ్లిపోతుంది ? కారణం ఏంటి?

వంటగది ఈశాన్యంలో కట్టకూడదని మన పెద్దలు చెబుతుంటారు. అందుకు కారణం ఇంట్లో ధన లక్ష్మీ నిలవదనే అలా చెబుతారు. కడితే లక్ష్మీ అలిగి వెలిపోతుందంట.

లక్ష్మీదేవి ఎలాంటి సందర్భాల్లో అలిగి వెళ్లిపోతుంది ? కారణం ఏంటి?

లక్ష్మీదేవి ఎలాంటి సందర్భాల్లో అలిగి వెళ్లిపోతుంది ? కారణం ఏంటి?

సాధారణంగా హిందూసాంప్రదాయంలో ఎంగిలి మంగళం అనే పదాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. పూజగదిలో ఎంగిలి చేసినవి ఉంచకూడదు. తామర పువ్వులు, జిల్వపత్రాలను ఎప్పుడు నలపరాదు.

లక్ష్మీదేవి ఎలాంటి సందర్భాల్లో అలిగి వెళ్లిపోతుంది ? కారణం ఏంటి?

లక్ష్మీదేవి ఎలాంటి సందర్భాల్లో అలిగి వెళ్లిపోతుంది ? కారణం ఏంటి?

నదులు, సరస్సులో పవిత్రమైనవిగా భావిస్తారు. అలాంటి పవిత్ర జలాశయాల్లో సరస్సులలో, నదులలో మల మూత్ర విసర్జన చేయకూడదు. ఎక్కడపడితే అక్కడ అశుభ్రం చేస్తే లక్ష్మీదేవికి నచ్చదట.

లక్ష్మీదేవి ఎలాంటి సందర్భాల్లో అలిగి వెళ్లిపోతుంది ? కారణం ఏంటి?

లక్ష్మీదేవి ఎలాంటి సందర్భాల్లో అలిగి వెళ్లిపోతుంది ? కారణం ఏంటి?

ఇంటి గోడలను, తలుపులను, గడపలను లక్ష్మీ స్వరూపాలుగా చెబుతుంటారు. గోడల మీద అవసరం లేనివి రాయకూడదు. అంటే బూతులు, చెడు వాఖ్యాలు రాయకూడదట. అలా చేస్తే లక్ష్మీదేవి అలుగుతుందట.

లక్ష్మీదేవి ఎలాంటి సందర్భాల్లో అలిగి వెళ్లిపోతుంది ? కారణం ఏంటి?

లక్ష్మీదేవి ఎలాంటి సందర్భాల్లో అలిగి వెళ్లిపోతుంది ? కారణం ఏంటి?

పాదాన్ని పాదంతో రుద్ది కడగ కూడదు. చేతితోనే రుద్దుకొని కడగాలి.

లక్ష్మీదేవి ఎలాంటి సందర్భాల్లో అలిగి వెళ్లిపోతుంది ? కారణం ఏంటి?

లక్ష్మీదేవి ఎలాంటి సందర్భాల్లో అలిగి వెళ్లిపోతుంది ? కారణం ఏంటి?

అతిథిదేవో భవ అంటారు. అతిధి మర్యాదలలో లోపం చేయరాదు. పశువులను అనవసరం కొట్టకూడదు. దూశించకూడదు.

లక్ష్మీదేవి ఎలాంటి సందర్భాల్లో అలిగి వెళ్లిపోతుంది ? కారణం ఏంటి?

లక్ష్మీదేవి ఎలాంటి సందర్భాల్లో అలిగి వెళ్లిపోతుంది ? కారణం ఏంటి?

సాయం సంధ్యలో నిద్రించే వారింట లక్ష్మీ ఉండదు. సోమరితనంగా ఉండే ఇంట లక్ష్మీ కటాక్షించదు.

లక్ష్మీదేవి ఎలాంటి సందర్భాల్లో అలిగి వెళ్లిపోతుంది ? కారణం ఏంటి?

లక్ష్మీదేవి ఎలాంటి సందర్భాల్లో అలిగి వెళ్లిపోతుంది ? కారణం ఏంటి?

ఎవరింట్లో అయితే తరచూ గొడవులు జరుగుతూ మహిళలు ఏడుస్తుంటారో, ఆ ఇంటి లక్ష్మీ ఉండదు. అలాగే వ్రుద్దులను పట్టించుకోని ఇంట లక్ష్మీ దేవి ఉండక అలిగి వెలిపోతుందట.

లక్ష్మీదేవి ఎలాంటి సందర్భాల్లో అలిగి వెళ్లిపోతుంది ? కారణం ఏంటి?

లక్ష్మీదేవి ఎలాంటి సందర్భాల్లో అలిగి వెళ్లిపోతుంది ? కారణం ఏంటి?

దీపారాధాన చేయని ఇంట: ప్రతి రోజూ ఇంట్లో ఉదయం, సాయం సంధ్యవేళల్లో కనీసం అగరబత్తి , దూపంతోనైనా దేవతారాధన చేయాలి. అలా చేయకుండా ఉండే వారింట్లో మరియు తులసి చెట్టు పెట్టి, పట్టించుకోని ఇంట లక్ష్మీ అలిగి వెలిపోతుందట.

లక్ష్మీదేవి ఎలాంటి సందర్భాల్లో అలిగి వెళ్లిపోతుంది ? కారణం ఏంటి?

లక్ష్మీదేవి ఎలాంటి సందర్భాల్లో అలిగి వెళ్లిపోతుంది ? కారణం ఏంటి?

వ్యసనాలకు బానిసలు కారాదు. అలా చేస్తే లక్ష్మీ ఇంటి నుండి దూరం అవుతుంది.

లక్ష్మీదేవి ఎలాంటి సందర్భాల్లో అలిగి వెళ్లిపోతుంది ? కారణం ఏంటి?

లక్ష్మీదేవి ఎలాంటి సందర్భాల్లో అలిగి వెళ్లిపోతుంది ? కారణం ఏంటి?

రాత్రి కట్టి పడుకున్న బట్టల్ని తిరిగి మరుసటి రోజు ధరించేవారిదగ్గర లక్ష్మి నిలవదు.

లక్ష్మీదేవి ఎలాంటి సందర్భాల్లో అలిగి వెళ్లిపోతుంది ? కారణం ఏంటి?

లక్ష్మీదేవి ఎలాంటి సందర్భాల్లో అలిగి వెళ్లిపోతుంది ? కారణం ఏంటి?

ఎప్పుడూ గొడవలు పడే ఇంట్లోనూ,జుట్టు విరబోసుకుని తిరిగే స్త్రీలు,నేల అదిరిపోయేటట్లు నడిచే స్త్రీలు ఉన్నప్రదేశాలలోనూ,స్త్రీలను కష్టపెట్టేచోట లక్ష్మి ఉండదు.సోమరితనం, ప్రయత్నం లేకపోవటం లక్ష్మికి వీడ్కోలు పలుకుతాయి.

లక్ష్మీదేవి ఎలాంటి సందర్భాల్లో అలిగి వెళ్లిపోతుంది ? కారణం ఏంటి?

లక్ష్మీదేవి ఎలాంటి సందర్భాల్లో అలిగి వెళ్లిపోతుంది ? కారణం ఏంటి?

వాస్తవానికి ప్రతి అంశం లోనూ ఆరోగ్య సూత్రం నిభిడీకృతమైన విషయం అందరికీ తెలుసిందే !

లక్ష్మీదేవి ఎలాంటి సందర్భాల్లో అలిగి వెళ్లిపోతుంది ? కారణం ఏంటి?

లక్ష్మీదేవి ఎలాంటి సందర్భాల్లో అలిగి వెళ్లిపోతుంది ? కారణం ఏంటి?

సామాజిక శాస్త్రీయ ధృక్పధం,నైతిక విలువల పరిరక్షణ గల సనాతన ధర్మం ఎంత మనోహరమైనదో కదా! --

English summary

Interesting Facts about Goddess Lakshmi

Lakshmi, also called Laxmi, is the goddess of wealth, fortune, power, luxury, beauty, fertility, and auspiciousness. She holds the promise of material fulfillment and contentment. She is described as restless, whimsical yet maternal, with her arms raised to bless and to grant her blessings.
Story first published: Wednesday, April 13, 2016, 17:35 [IST]
Desktop Bottom Promotion