For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పరశురాముడికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా...

|

శ్రీమహావిష్ణువు యొక్క ఆరవ అవతారం పరశురాముడి అవతారం. పరశురాముడి జననాన్ని పరశురాముని జయంతిగా జరుపుకుంటారు. వైశాఖమాసంలోని త్రితీయ శుక్లపక్ష నాడు జమదగ్ని మహర్షికి, రేణుకా మాతకు పరశురాముడు జన్మించాడు.

Interesting Stories about Lord Parashuram

తమ రాజ్యంలోని ప్రజలను ఇబ్బంది పెడుతున్న క్రూరులైన క్షత్రియుల నుంచి ప్రజలకు విముక్తిని కలిగించడానికి పరశురాముడి అవతారంలో శ్రీ మహావిష్ణువు జన్మిస్తాడు. తద్వారా, ధర్మాన్ని, కర్మని నిర్లక్ష్యం చేస్తున్న కఠినమైన క్షత్రియుల అంతు చూస్తాడు.
Interesting Stories about Lord Parashuram

పరశురామ జయంతి ముహూర్తం

గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం, పరశురామ జయంతిని మే 14, 2021న జరుపుకోనున్నారు. శ్రీమహావిష్ణువు అవతారమైన పరశురాముడికి మరణం లేదని పురాణాలు చెబుతున్నాయి. పరశురాముడు ఇప్పటికీ భూమిపైన తిరుగుతున్నాడని అంటున్నారు. ఈ కారణం వలన శ్రీరాముడు, శ్రీకృష్ణుడిని స్తుతించినట్టే పరశురాముడిని కూడా భక్తిశ్రద్ధలతో భక్తులు పూజిస్తారు.

పరశురాముడు కల్కీ అవతారం ఉద్భవించినప్పుడు భువిపైకి వచ్చి అతనికి గురువుగా వ్యవహరిస్తాడని నమ్మకం.

ఈ రోజు, పరశురాముడి చెందిన కొన్ని ఆసక్తికర గాధల గురించి తెలుసుకుందాం. పరశురాముడి జయంతిని పురస్కరించుకుని ఈ విషయాలను తెలుసుకుందాం.

Interesting Stories about Lord Parashuram

• పరశురాముడి ఆయుధం:

పరశురాముడనే పేరుకు 'పరశు' అనబడే గొడ్డలిని కలిగి ఉన్న రాముడు అనర్థం. పరశురాముడి ఆయుధం గొడ్డలి. పరమశివుడు పరశురాముడి కి గొడ్డలిని అందిస్తాడు. పరశురాముడి ఘోరతపస్సుకు మెచ్చి మహాశివుడు పరశురాముడికి గొడ్డలిని కానుకగా ఇస్తాడు.


•కశ్యప మహర్షికి భూమిని కానుకగా ఇచ్చిన పరశురాముడు

క్రూరమైన క్షత్రియుల నుంచి 21 సార్లు భూమికి విముక్తిని ప్రసాదించాడు పరశురాముడు. ఆ తరువాత కశ్యప మహర్షి సహకారంతో యజ్ఞాలను నిర్వహించి భూమిని పొందాడు. అయితే, భూమిని పరిపాలించేందుకు పరశురాముడు ఇష్టపడలేదు. అందువలన, భూమిని కశ్యపమహర్షికి ఇచ్చేస్తాడు పరశురాముడు.

• కార్తవీర్యుడి వధ:

పరశురాముడి తండ్రి ఆశ్రమం వద్ద నుంచి పవిత్రమైన దూడను కార్తవీర్య అనబడే రాజు దొంగిలించినప్పుడు పరశురాముడిలో వినాశన ధోరణి మొదలైంది. ఆ దూడను రక్షించాలనుకున్న పరశురాముడు కార్తవీర్యుడితో పోరాడి అతడిని అంతమొందిస్తాడు. కార్తవీర్యుడి కుమారుడు తన తండ్రి మరణానికి కారణమైన వారిపై పగ తీర్చుకోవాలని భావిస్తాడు. అందువలన జమదగ్ని మహర్షిని వధిస్తాడు. ఈ విషయమై తీవ్రంగా కలతచెందిన పరశురాముడు క్షత్రియులను అంతమొందిస్తాడు.

• పరశురాముడు తన తల్లిని వధిస్తాడు:

పరశురాముడి తల్లి తన భర్త పట్ల భక్తిశ్రద్ధలతో వ్యవహరిస్తూ ఉండేది. ఆవిడ వ్యక్తిత్వం వలన నీళ్లను బిందె లేకుండా కూడా ఆమె తీసుకురాగలిగే శక్తిని పొందింది. ఒకరోజు, ఆవిడ నదీ తీరం వద్ద గంధర్వుడిని చూడటం జరుగుతుంది. అప్పుడు, ఆమె మనసులో క్షణకాలం పాటు కోరిక రగులుతుంది. జమదగ్ని మహర్షి తన యోగిక శక్తులతో జరిగిన విషయాన్ని గ్రహిస్తాడు.

ఆ కోపంతో, తన పుత్రులందరినీ వారి తల్లిని చంపమని ఆజ్ఞాపిస్తాడు. వారందరు నిరాకరిస్తారు. అప్పుడు, వాళ్లందరినీ రాయిగా మారిపోమని జమదగ్ని శపిస్తాడు. పరశురాముడు తండ్రి మాటను జవదాటని వాడు. వెంటనే తన గొడ్డలిని తీసుకుని తల్లి తలను నరికివేస్తాడు. అతని వినయానికి మహర్షి కదిలిపోయాడు. ఏదైనా వరాన్ని కోరుకోమని తన కుమారుడిని అడుగుతాడు జమదగ్ని. తన తల్లికి తిరిగి ప్రాణం పోయామని పరశురాముడు వేడుకుంటాడు. ఆలాగే, తన సోదరులను కూడా తిరిగి మాములుగా మార్చమని వేడుకుంటాడు. కుమారుడి కోరికను మన్నిస్తాడు జమదగ్ని మహర్షి.

Interesting Stories about Lord Parashuram

• మహాశివుడితో పోరాడిన పరమశివుడు:

పరమశివుడికి పరశురాముడు గొప్ప భక్తుడు. అయితే, తన దైవంతో పరశురాముడు పోరాడవలసి వచ్చింది. పరమశివుడు తన భక్తుడికి పరీక్షించడం వలన ఇలా జరిగింది. ఈ పవిత్ర యుద్ధమనేది భయంకరంగా సాగింది. చివరలో, పరశురాముడు తన గొడ్డలితో వేగంగా దాడిచేయగా పరమశివుడి నుదుటిపై గొడ్డలి ఇరుక్కుంటుంది. పరశురాముడి నైపుణ్యాన్ని గ్రహించిన పరమశివుడు ప్రేమతో పరశురాముడిని హత్తుకుంటాడు. ఈ సంఘటనతో పరమశివుడి పేరు ఖండ పరశుగా మారింది.

• కర్ణుడి శాపం:

కుంతీపుత్రుడైన కర్ణుడు పరమశివుడి చేత విద్యను అభ్యసించాలని కోరుకుంటాడు. అయితే, క్షత్రియులకు విద్యను నేర్పకూడదని పరశురాముడు నిర్ణయించుకుంటాడు. అప్పుడు, కర్ణుడు తనను బ్రాహ్మణుడిగా పరిచయం చేసుకుంటాడు. తాను క్షత్రియుడను కానని పరశురాముడితో చెప్తాడు. కొంతకాలం తరువాత నిజం తెలుసుకున్న పరశురాముడు కోపంతో ఊగిపోతాడు. కర్ణుడు నేర్చుకున్న విద్యలేవీ అవసరానికి ఉపయోగపడవని అబద్దం చెప్పి నేర్చుకున్న విద్యలు అక్కరకు రావని పరశురాముడు శపిస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు మరణించడానికి ఈ శాపమే కారణమైందని పురాణాలు చెబుతున్నాయి. పరశురాముడు ముక్కోపి అనే ప్రచారం ఉంది. అయితే ఆయన కోపానికి లోకకల్యాణానికి ఎప్పుడూ సంబంధం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.

English summary

Interesting Stories about Lord Parashuram

The sixth avatar of Lord Maha Vishnu was Lord Parashuram and every year it is celebrated as Parashuram Jayanti. This year, the festival will be observed on the 22nd of April. The Tritiya tithi begins at 03.45 pm on 18th April, 2018, and ends at 01.29 on the 19th April, 2023 .Stories To Know About Lord Parashuram
Desktop Bottom Promotion