For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Krishna Janmashtami 2021: శ్రీక్రిష్ణుని పుట్టుక ఓ అద్భుతమైన ఘట్టం..

|

పురాణాల ప్రకారం, శ్రీ మహావిష్ణువు ఎనిమిదో అవతారంగా శ్రీక్రిష్ణుడు అవతరించాడు. భూమిపై ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడటానికి క్రిష్ణ భగవానుడు జన్మించాడని పండితులు చెబుతారు.

ఇలా శ్రీక్రిష్ణుడు పుట్టినరోజునే జన్మాష్టమి జరుపుకుంటారు. క్రిష్ణ జయంతినే జన్మాష్టమి అని కూడా అంటారు. ఈ పండుగ ప్రతి సంవత్సరం ఆగస్టు మాసంలో వస్తుంది. ఈ ఏడాది 2021లో ఆగస్టు 30వ తేదీన ఈ పండుగ వచ్చింది.

ఈ పవిత్రమైన రోజున దేశవ్యాప్తంగా కృష్ణ భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే విధిగా ఉపవాసం ఉంటారు. ఈ సందర్భంగా క్రిష్ణుడి పుట్టుక.. క్రిష్ణాష్టమి ప్రాముఖ్యత, పూజా విధానం గురించి తెలుసుకుందాం...

శ్రీక్రిష్ణాష్టమి రోజున చేయాల్సిన, చేయకూడని పనులేంటో తెలుసుకుందాం..

క్రిష్ణ పూజా విధానం..

క్రిష్ణ పూజా విధానం..

క్రిష్ణాష్టమి రోజున శ్రీక్రిష్ణుడి విగ్రహాన్ని ఊయాల్లో వేయాలి. ఒకవేళ మీ వద్ద ఊయల లేకపోతే.. ఒక పీటపై పసుపు, ఎర్రని రంగు వస్త్రాలతో కప్పి దానిపై స్వామి వారి విగ్రహాన్ని పెట్టాలి. అనంతరం మీరు దేవున్ని స్మరించుకుంటూ ద్యానం చేయాలి. శ్రీక్రిష్ణుడిని విగ్రహం రూపంలో ఆహ్వానించాలి. అనంతరం స్వామి వారికి నైవేద్యాలు సమర్పించాలి.తర్వాత స్వామి వారి పాదాలను శుభ్రం చేయడానికి నీరు అర్పించండి.

స్వామి ఆశీస్సుల కోసం..

స్వామి ఆశీస్సుల కోసం..

కొత్త వస్త్రం తీసుకుని స్వామి వారి విగ్రహాన్ని తుడిచి, కొత్త బట్టలను స్వామి వారికి అర్పించాలి. వస్త్రాలు లేకుంటే పవిత్రమైన దారాన్ని అందించాలి. ఆ తర్వాత చందనాన్ని సమర్పించాలి. క్రిష్ణుడికి ఆభరణాలు ధరించడం అంటే చాలా ఇష్టం. కాబట్టి వాటిని కూడా ఇవ్వండి. అనంతరం తాజా పువ్వులతో స్వామి వారిని ఆరాధించండి. తన ఆశీర్వాదం కోసం భక్తి శ్రద్ధలతో శ్రీక్రిష్ణుని మంత్రాలను జపించండి.

క్రిష్ణాష్టమి ప్రాముఖ్యత..

క్రిష్ణాష్టమి ప్రాముఖ్యత..

హిందూ పంచాంగం ప్రకారం, శ్రావణ మాసంలోని క్రిష్ణ పక్షంలో అష్టమి రోజున క్రిష్ణుడు జన్మించాడు. క్రూరమైన కంస రాజును చంపడానికి క్రిష్ణుడు దేవకి, వాసుదేవ్ లకు జన్మించాడు. అప్పటికే తన చెల్లిని, బామ్మర్దిని జైలులో పెట్టి.. ఏడుగురు పిల్లలను రాజు చంపేస్తాడు. అయితే ఎనిమిదో బిడ్డగా జన్మించిన వాసుదేవుడు, కృష్ణుడిని సురక్షితంగా ఉంచటానికి, వానహోరులో యమునా నదిని ఒక బుట్టలో దాటుకుంటూ వెళ్తాడు. అదే సమయంలో సర్పాలరాజు యమునా నది నుండి ఉద్భవించి శ్రీక్రిష్ణుడిని తన ఐదు తలల కింద రక్షించడానికి ఒక కవచంగా పని చేస్తాడు. అనంతరం వాసుదేవుడు గోకులంలోని నందుని ఇంటికి చేర్చుతాడు.

క్రిష్ణాష్టమి విషెస్ ను మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండిలా..

అదే సమయంలో..

అదే సమయంలో..

యశోద అప్పుడే ఒక ఆడబిడ్డకు జన్మనిస్తుంది. ఆ సమయంలో ఎంతో కష్టమైన ప్రసవం కావడంతో తను స్ప్రుహ కోల్పోతుంది. అప్పుడే వసుదేవుడు ఆడపిల్ల స్థానంలో శ్రీక్రిష్ణుడిని ఉంచి, ఆ ఆడపిల్లను తీసుకుని తిరిగి తన బావమరిది ఉంచిన జైలుకు వెళ్లిపోతాడు. అదే సమయంలో ఆడపిల్ల ఏడుస్తుంది. సైనికులు వెళ్లి కంసుడికి ఈ విషయం చెబుతారు.

ఆ బిడ్డ మాయం..

ఆ బిడ్డ మాయం..

‘ఇది కేవలం ఒక ఆడబిడ్డ. తను నిన్ను చంపలేదు. అదే ఒక మగపిల్లాడు అయ్యుంటే నిన్న చంప గలిగేవాడేమో. ఈ పాపను వదిలిపెట్టు'అని దేవకీ, వసుదేవులు ఎంత వేడుకొన్నా.. కంసుడు కనికరించలేదు. ఆ ఆడపిల్ల కాళ్లను పైకెత్తి నేలకేసి కొట్టబోయే సమయంలో.. ఆ బిడ్డ కంసుడి చేతి నుండి ఎగిరిపోయి బయటకు వెళ్లి ‘‘నిన్ను చంపేవాడు అప్పుడే పుట్టాడు.. బయట ఉన్నాడు. తన చేతిలో నీ మరణం తథ్యం'' అని చెప్పి మాయమవుతుంది.

గోవుల కాపరిలా..

గోవుల కాపరిలా..

అలా గోకులంలో చేరిన శ్రీక్రిష్ణుడు, రాజు కొడుకే అయినప్పటికీ ఒక సాధారణమైన గోవుల కాపరిలాగానే పెరిగాడు. యశోద పెంపకంలో చిన్నిక్రిష్ణుడు తన బుడి బుడి అడుగులతో అందరినీ అలరించాడు.

శ్రీకృష్ణుడి పుట్టుక నుండి.. ఆయన పెరిగి పెద్దయ్యే వరకు అంతా ఓ అద్భుతమైన ఘట్టమే. యుగ యుగాలుగా ఆయన తత్వం, ఆయన జీవితం మానవులను విశేషంగా ప్రభావితం చేస్తోంది.

English summary

Krishna Janmashtami 2021 Date, History, Puja Muhurat and Significance in Telugu

Here we are talking about the Krishna Janmashtami 2021 date, history, puja muhurat and significance in Telugu. Read on
Story first published: Monday, August 23, 2021, 11:44 [IST]