For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చంద్ర గ్రహణం 2020 : తొలి గ్రహణం ఎక్కడ.. ఎప్పుడంటే..

ఎవరైనా సరే ఏ గ్రహణాన్ని అయినా కంటితో నేరుగా చూడకూడదు. ఎందుకంటే గ్రహణ సమయంలో వాటి నుండి ప్రతిబింబించే కిరణాలు చాలా శక్తివంతంగా ఉంటాయి.

|

ఈ సంవత్సరంలో మొత్తం నాలుగు చంద్ర గ్రహణాలు ఉన్నాయి. అందులో మొదటిది ఈ జనవరిలో జరిగే గ్రహణం. అది కూడా రేపే. మిగిలినవి జూన్ 5, జులై 5వ తేదీ మరియు నవంబర్ 30వ తేదీ జరగనున్నాయి. ఈ గ్రహణాలు ఆసియా, యూరప్, ఆస్ట్రేలియా మరియు ఆఫ్రికాలో కనిపించనున్నాయి.

lunar eclipse

ఇక చంద్ర గ్రహణం శుక్రవారం రాత్రి సుతక్ గ్రహణానికి 12 గంటల ముందు ప్రారంభమవుతుంది. దీని ప్రకారం ఉదయం 10 గంటల నుండే ప్రారంభమవుతుంది.భారత కాలమానం ఏ సమయంలో చంద్ర గ్రహణం ప్రారంభమవుతుందో తెలుసుకోవడానికి కిందికి స్క్రోల్ చెయ్యండి. అలాగే ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

చంద్ర గ్రహణ సమయం..

చంద్ర గ్రహణ సమయం..

చంద్ర గ్రహణం భారత కాలమానం ప్రకారం జనవరి 10వ తేదీన శుక్రవారం ప్రారంభం కానుంది.

ప్రారంభం : రాత్రి 10:37 గంటలకు

ముగింపు : జనవరి 11వ తేదీన రాత్రి 2:42 గంటలకు

మొత్తం ఎన్ని గంటలు : దాదాపు నాలుగు గంటలకు పైగా (4 గంటల 6 నిమిషాల వరకు)

గురు పూర్ణిమ సందర్భంగా..

గురు పూర్ణిమ సందర్భంగా..

శుక్రవారం నాడు గురు పూర్ణిమ మరియు చంద్ర గ్రహణం ఉన్నందున, సుతక్ వర్తించే ముందు గురు పూజలు చేయడం వల్ల సముచితంగా ఉంటుంది. గురుపూర్ణిమ ఆరాధన తర్వాత అన్ని దేవాలయాల తలుపులు మూసి వేయబడతాయి.

ఏం జరుగుతుంది?

ఏం జరుగుతుంది?

గ్రహణం సమయంలో, భూమి నీడ చంద్రునిపై పడుతుంది. కానీ పూర్తి స్థాయిలో కాదు. గ్రహణం సమయంలో చంద్రుడు నారింజ రంగులోకి మారుతాడు. అయితే గ్రహణం సమయంలో చంద్రుడు బూడిద రంగులో ఉంటాడు.

నేరుగా చూడకూడదు..

నేరుగా చూడకూడదు..

ఎవరైనా సరే ఏ గ్రహణాన్ని అయినా కంటితో నేరుగా చూడకూడదు. ఎందుకంటే గ్రహణ సమయంలో వాటి నుండి ప్రతిబింబించే కిరణాలు చాలా శక్తివంతంగా ఉంటాయి. అందుకే గ్రహణాన్ని చూడాలనుకునే వారు ప్రత్యేక సాధనాలను ఉపయోగించడం మంచిది.

ప్రకృతి నియమం ప్రకారం..

ప్రకృతి నియమం ప్రకారం..

గ్రహణం అనేది ప్రకృతి నియమం. ఈ సమయంలో చాలా నియమాలను పాటించాలని పెద్దలు చెబుతుంటారు. అవేంటో చూద్దాం.

ఆ సమయంలో ఆహారం వద్దు..

ఆ సమయంలో ఆహారం వద్దు..

గ్రహణం పట్టేందుకు తొమ్మిది గంటల ముందు, గ్రహం విడిచిన కనీసం అరగంట వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు.

అజీర్ణం అవుతుందని..

అజీర్ణం అవుతుందని..

చంద్ర గ్రహణం సమయంలో ఎందుకని ఆహారం తీసుకోకూడదని చెప్పారంటే.. మామూలుగా మనం తీసుకున్న ఆహారం శరీరంలో పూర్తిగా జీర్ణం కావడానికి దాదాపు మూడు గంటల సమయం పడుతుంది. కానీ అదే ఆహారం తొమ్మిది గంటల్లో జీర్ణం అయి వ్యర్థ పదార్థాలు కూడా శరీరం నుండి విడుదల అయ్యే అవకాశం ఉంటుంది. అంతే కాదు మన శరీరంలో ఏ మాత్రం ఆహారం మిగిలి ఉండదు. అందుకే ఆ సమయంలో ఆహారం తీసుకోకూడదని పెద్దలు చెబుతారు.

గ్రహణం సమయంలో స్నానం..

గ్రహణం సమయంలో స్నానం..

చంద్ర గ్రహణం సమయంలో స్నానం చేసి దేవుడి జపం చేసుకోవాలని కూడా పెద్దలు, పండితులు చెబుతున్నారు. ఎందుకంటే గ్రహణ ప్రభావం మన శరీరంపై పడకుండా ఉండటానికి. ఇది మన పూర్వ కాలం నుండి ఆచరించే సంప్రదాయం అని పండితులు చెబుతున్నారు.

English summary

lunar eclipse January 2020, date, Time and Where to watch

Here we are talking about date, time and must know about 2020 january lunar eclipse. Read more.
Story first published:Thursday, January 9, 2020, 16:47 [IST]
Desktop Bottom Promotion