Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ప్రాణాలను తీసే గుడి ఇది! రాత్రి అయిందంటే చాలు...
ఎవరైనా దేవాలయాలను ఎందుకు దర్శిస్తారు చెప్పండి? మంచి ఆరోగ్యమైన జీవితం గడపాలని ఇంకా ఇలా ఎన్నో కోరికలతో భక్తిగా గుళ్లకు వెళతారు. అయితే మీరు ఈ దేవాలయం గురించి విన్నారా? ఇక్కడ గడిపితే చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయంటారు. చాలా విచిత్రంగా ఉంది కదూ!
ఇప్పుడు చెప్పబోయే కథ మైహర దేవి ఆలయం గురించి. ఇక్కడ రాత్రిపూట గడిపితే ఇక ప్రాణాలు వదిలేసుకోవడమే అని నమ్ముతారు. మరి సాహసాలు చేసేవారు ఇలాంటి వాటి గురించి ఆసక్తిగా ఉందా? అయితే పదండి.. ఆ విశేషాలేమిటో తెలుసుకుందాం.
అసలు అక్కడ దెయ్యాలేమైనా ఉన్నాయా? లేక ఉత్తి అపోహనేనా .. దీని వెనక కథ ఏమిటి తెలుసుకుందాం...

దేవాలయం గురించి..
ఇలాంటి కథనానికి ప్రఖ్యాతి గాంచిన ఈ దేవాలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ సమీపంలో సాత్నా జిల్లాలో మైహర్ ఉంది. ఈ దేవాలయంలో శారద అమ్మవారు కొలువై ఉన్నారు. మైహర్ అంటే మా కా హార్ అని అర్థం. అంటే దేవత యోక్క హారం అని తెలుగులో అర్థం.

కొండల్లో ఉంది
ఈ గుడి త్రికూట్ అనే కొండల మధ్య ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడి శారద దేవిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తండోపతండాలుగా వస్తుంటారని చెబుతారు. అక్కడ అంత భయంకరమైన చరిత్ర ఉన్నా సరే లెక్కచేయకుండా వీరు అక్కడి వస్తారట.

అసలేం ఉంది అక్కడ..
దేవాలయం గురించి కథలు కథలుగా చెబుతారు. ఈ నమ్మకాలన్నీ నిజమని చాలా మంది నమ్ముతారు కూడా. ఇక రాత్రి పూట అక్కడ ఉండలేమని కూడా అంటారు. అలా ఉన్నవారు ఎవరూ ప్రాణాలతో బతికి బట్టకట్టలేరని కూడా చెబుతారు.

దానికి కారణముంది...
ఈ నమ్మకం వెనక ఒక కథ ఉంది. ఇప్పటికీ శారద మాతకు అతి పెద్ద భక్తులైన ఆలహ, ఉదమ్ అనే ఇద్దరు సోదరుల ఆత్మలు అక్కడ తిరుగుతాయట.
ఈ రెండు ఆత్మలు అప్పట్లో పృథ్వీ రాజ్ చౌహాన్‌తో వీరోచితంగా పోరాడారని చెబుతారు. అది కాకుండా వీళ్లిద్దరు మొదటిసారి మైహర్ దేవి ఆలయాన్ని గుట్టల్లో కనుగొన్నారు అని చెబుతారు.

రాత్రి వేళ్లలో మూసేస్తారు
రాత్రిపూట దేవాలయాన్ని మూసివేస్తారు. అక్కడి వారు నమ్మేదాని ప్రకారం ఈ ఇద్దరు సోదరులు అమ్మవారిని పూజిస్తారట. అదే కారణంగా చెప్పి గుడి లోపలికి రాత్రిపూట ఎవరినీ అనుమతించరు. ఎవరైనా సాహసం చేసి రాత్రంతా గడిపితే ఇక మరునాడు ప్రాణాలతో ఉండరని అంటారు.
దీనిపై మీరేమంటారు? ఇది ఒట్టి కల్పితమే లేదా నిజమా? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్‌లో తెలపండి.



Click it and Unblock the Notifications