మీ జాతకంలో దోషాలుంటే అక్షయ త్రితీయ రోజున ఈ మంత్రాలను పఠించండి..!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

అక్షయ త్రితీయ అనేది హిందూ పంచాంగం ప్రకారం ఒక ప్రత్యేకమైన రోజు. ఎలాంటి పవిత్రమైన రోజు అంటే ఆరోజు మీరు ఏ పూజ అయినా ముహూర్తం చూసుకోకుండా చేసుకోవచ్చు. ఆ రోజు మీరు ఏదైనా వెంచర్ ప్రారంభించినట్లైతే ఆలోచించాల్సిన అవసరం లేదు, మీరు తప్పకుండా మంచి ఫలితాలను పొందుతారు, ఆ రోజంతా చాలా అదృష్టమైన రోజుగా భావించ వచ్చు.

ఆ రోజున కొన్ని వందల, వేల పెళ్ళిళ్ళు జరగడం చూస్తాము. ఆ రోజున అనేక వర్గాలకు చెందిన పెళ్ళిళ్ళు కూడా నిర్వహించబడతాయి. చిన్న చిన్న లేదా వివాహ రిజిస్టర్ లో వారి పేర్లు పొందని పెళ్ళికూతురు, పెళ్ళికొడుకులు అలాంటి వర్గాల పెళ్ళిళ్ళు, వారి ప్రేమికులను, భాగస్వాములను ఆరోజున కలుస్తారు. సాధారణంగా ఆరోజుకి ప్రత్యేకత ఉన్నప్పటికీ, మీ రాశిఫలాలలో కొన్ని చెడు ప్రభావాలు కూడా ఉండవచ్చు. అలాంటి చెడు ప్రభావాలు మీ విజయాన్ని నాశనం చేయవచ్చు. దానికి విరుగుడుగా, మీరు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. ఈరోజున దాతృత్వ కార్యక్రమాలు ఎంతో ప్రముఖ్యమైనవి.

 Mantras To Chant On Akshaya Tritiya Based On Zodiac Signs

ధాత్రుత్వపు ఏ కార్యక్రమమైనా రెండు రెట్ల ప్రయోజనాన్ని ఇస్తుంది. మీరు మీ రాశిఫలాలను ఆధారం చేసుకుని కొన్ని ప్రత్యేకమైన వస్తువులను తప్పక దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ రాశిఫలాల పట్ల ఉన్న చెడు ఫలితాలు పోగొట్టుకోడానికి సహాయపడతాయి.

మీ రాశిఫలాలకు అనుగుణంగా, ప్రయోజన కరంగా సూచి౦చబడే కొన్ని మంత్రాలూ ఉన్నాయి. ఈ మంత్రాలూ మిమ్మల్ని విజయ మార్గం వైపు నడిపించడానికి సహాయపడతాయి. ఈ మంత్రాలను అక్షయ త్రితీయ రోజు పఠిస్తే ఇంకా ప్రత్యేకమైన విలువ ఉంటుంది. ఈ మంత్రాలూ మీకు విజయాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. ఈ మంత్రాలను ప్రతిరోజూ పఠించడం వల్ల డబ్బు విషయంలో మీరు ఎప్పుడూ ఇబ్బంది పడరు. శ్రేయస్సు కలుగుతుంది, మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది. మీ రాశిఫలాల ప్రకారం మీరు ఆరోజు ఏ మంత్రం పఠించాలి, ఏ వస్తువులు దానం చేయాలి అనేవి చదివి తెలుసుకోండి.

మేషరాశి వారు పఠించాల్సిన మంత్రం:

మేషరాశి వారు పఠించాల్సిన మంత్రం:

‘ఓం ఐమ్, క్లిం, సౌమ్'

ఈ మంత్రం డబ్బును, శ్రేయస్సును తెచ్చిపెడుతుంది.

రాబోయే కాలంలో మీరు విజయాన్ని పొందడం కోసం పప్పు ధాన్యాలు, గోధుమ, ఎరుపు రంగులో ఉన్న పూలు, ఎర్ర బట్టలు, రాగి, మొలాసిస్ వంటివి దానం చేయండి.

వృషభ రాశి వారు ఈ క్రింది మంత్రాన్ని తప్పక పఠించాలి:

వృషభ రాశి వారు ఈ క్రింది మంత్రాన్ని తప్పక పఠించాలి:

‘ఓం ఐమ్, క్లీం, శ్రీం'

ఈ మంత్రాన్ని ప్రతిరోజూ పఠిస్తే ఎప్పుడూ సంతోషంతో, శ్రేయస్సుతో ఉంటారు.

ఈ రాశివారు ఈ క్రింది వాటిలో వేటినైనా దానం చేయవచ్చు: దూడతో ఉన్న ఆవులు, వజ్రాలు, గుర్రాలు మొదలైనవి, అవి తెలుపురంగులో ఉన్నవి, బియ్యం, సుగంధ ద్రవ్యాలు.

మిధున రాశి వారు ఈ క్రింది మంత్రాన్ని తప్పక పఠించాలి:

మిధున రాశి వారు ఈ క్రింది మంత్రాన్ని తప్పక పఠించాలి:

‘ఓం క్లిం, ఐమ్ సౌమ్'

ఈ మంత్రం మీ జీవితంలో ప్రశాంతతని, సంతోషాన్ని నింపుతుంది.

మిధునరాశి వారు ఆకుపచ్చ రంగులో ఉన్న బట్టలు, తృణధాన్యాలు, ఎమరాల్డ్, బంగారం, ఒఎస్టర్లు వంటివి దానం చేయవచ్చు.

కర్కాటక రాశివారు చేయాల్సిన మంత్రం:

కర్కాటక రాశివారు చేయాల్సిన మంత్రం:

‘ఓం ఐమ్, క్లీం, శ్రీం'

ఈ మంత్రం సంపదను ఇస్తుంది. ఆర్ధిక సమస్యలతో బాధపడే కర్కాటక రాశివారు ఈ మంత్రాన్ని తప్పక పఠించాలి.

ఇక దానాల విషయానికి వస్తే, నెయ్యి, పంచదార, పాలు, పెరుగు, వెండి, సుగంధద్రవ్యాలు, బట్టలు మొదలైనవి..,తెలుపు రంగులో ఉండే, బియ్యం, ముత్యాలు, వెదురుతో చేసిన బుట్టలు దానం చేయడానికి సరైనవి.

సింహరాశి వారు ఈ క్రింది మంత్రాన్ని పఠించాలి:

సింహరాశి వారు ఈ క్రింది మంత్రాన్ని పఠించాలి:

‘ఓం హ్రీం, శ్రీం, శ్రాం'

ఈ మంత్రం సింహరాశి వారికి విజయాన్ని అందిస్తుంది.

ఆవు, ఎరుపు పూలు, ఎరుపు బట్టలు, కాపర్, మొలాసేస్, బంగారం, గోధుమలు దానం చేయదగ్గ అద్భుతమైన వస్తువులు.

కన్య రాశివారు చేయాల్సిన మంత్రం:

కన్య రాశివారు చేయాల్సిన మంత్రం:

‘ఓం శ్రీం ఐమ్ శ్రౌం'

కన్యారాశి వారికి ఈ మంత్రం అత్యంత ప్రయోజనకరం. ఆకుపచ్చ గాజులు, ఆకుపచ్చ బట్టలు, సోంపు గింజలు వంటివి దానం చేస్తే మంచి ఫలితాలను ఇస్తాయి.

తులారాశి వారు శ్రేయస్సు కొరకు ఈ క్రింది మంత్రాన్ని పఠించాలి:

తులారాశి వారు శ్రేయస్సు కొరకు ఈ క్రింది మంత్రాన్ని పఠించాలి:

‘ఓం శ్రీం ఐమ్ శాం'

తులారాశి వారు తెలుపు బట్టలు, గంధపు చెక్క, సుగంధ ద్రవ్యాలు, పంచదార వంటి వస్తువులు తప్పక దానం చేయాలి. ఈ వస్తువులను గుడిలో దానం చేస్తే మంచి ఫలితాలను చూడవచ్చు.

వృశ్చిక రాశివారు ఈ క్రింది మంత్రాన్ని పఠించడం వల్ల ద్రవ్య, కుటుంబపరమైన ఆనందాన్ని పొందవచ్చు:

వృశ్చిక రాశివారు ఈ క్రింది మంత్రాన్ని పఠించడం వల్ల ద్రవ్య, కుటుంబపరమైన ఆనందాన్ని పొందవచ్చు:

‘ఓం ఐమ్ క్లీం, శ్రీం'

గంధపు చెక్క, పగడం, కుంకుమపువ్వు మొదలైనవి., వృశ్చిక రాశి వారు దానం చేయవలసిన అద్భుతమైన వస్తువులు.

ధనుస్సు రాశివారు ఈ క్రింది మంత్రాన్ని ఎంచుకోవచ్చు:

ధనుస్సు రాశివారు ఈ క్రింది మంత్రాన్ని ఎంచుకోవచ్చు:

‘ఓం హ్రీం క్లీం సౌమ్'

పసుపు ధాన్యాలు, పసుపు పచ్చని బట్టలు, పుష్యరాగం వంటివి ఈరాశి వారు దానం చేయాలి.

మకరరాశి వారు సంపద కోసం ఈ మంత్రాన్ని పఠించాలి:

మకరరాశి వారు సంపద కోసం ఈ మంత్రాన్ని పఠించాలి:

‘ఓం హ్రీం క్లీం సౌమ్'

చెప్పులు, నువ్వులు, నూనె, పప్పు ధాన్యాలు, ఆవులు ఈ రాశివారు దానం చేయాల్సినవి.

కుంభం రాశివారు పఠించాల్సిన మంత్రం

కుంభం రాశివారు పఠించాల్సిన మంత్రం

‘ఓం క్రీమ్ క్లీం శ్రీం'

పై మంత్రం లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందడానికి సహాయపడుతుంది. వెండి, ఐరన్, నీలం, నలుపు బట్టలు, దుప్పట్లు, గొడుగులు ఈరాశి వారు దానం చేయవచ్చు.

మీనం ఈ క్రింది మంత్రాన్ని పఠిస్తే లక్ష్మీదేవి తప్పక అనుగ్రహిస్తుంది:

మీనం ఈ క్రింది మంత్రాన్ని పఠిస్తే లక్ష్మీదేవి తప్పక అనుగ్రహిస్తుంది:

‘ఓం హ్రీం క్లీం సౌమ్'

బంగారం, కేసర్, పసుపు, పంచదార, వెండి, ఉప్పు, తేనె, గుర్రాలు వంటివి దానం చేస్తే ఈరాశి వారు మంచి ఫలితాలను పొందుతారు.

English summary

Mantras To Chant On Akshaya Tritiya Based On Zodiac Signs

Chanting these will help clear your path to success. Chanting these mantras on Akshaya Tritiya day is of special value. These mantras will help propel you to success and happiness. Repeat these mantras regularly and you will never suffer due to the want of money.
Story first published: Wednesday, April 26, 2017, 8:00 [IST]
Subscribe Newsletter