For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ గైడ్ లైన్స్ ఫాలో అవ్వండి... శ్రీవారి దర్శనాన్ని సులభంగా పూర్తి చేసుకోండి...

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తిరుమల శ్రీవారి భక్తులకు ఓ శుభవార్త వినిపించింది.

|

తిరుమల భక్తులందరూ కోటి కళ్లతో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మరి కొన్ని గంటల్లోనే తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం అందరికీ దక్కనుంది. ఇంతకుముందు లాక్ డౌన్ కారణంగా కలియుగ దైవమైన వెంకన్న స్వామి దర్శనం దాదాపు మూడు నెలల వరకు లేకుండానే పోయింది.

New Guidelines for Tirumala pilgrims

కరోనా లాక్ డౌన్ కారణంగా స్వామి వారికి నిత్యం జరిగే పూజలు జరుగుతున్నప్పటికీ, సాధారణ భక్తులకు మాత్రం ఆ అవకాశం దక్కకుండా పోయింది. అయితే ప్రస్తుతం అన్ లాక్1.0లో భాగంగా కొన్ని సడలింపులు రావడంతో జూన్ 11వ తేదీ నుండి దేశవ్యాప్తంగా భక్తులందరికీ స్వామి వారిని దర్శించుకునే అవకాశం రానుంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. అవేంటో చూడండి.. వాటిని ఫాలో అవుతూ స్వామి వారి దర్శనాన్ని సులభంగా పూర్తి చేసుకోండి...

చంద్ర గ్రహణం తర్వాత మంచి రోజులెప్పుడో చూడండి...చంద్ర గ్రహణం తర్వాత మంచి రోజులెప్పుడో చూడండి...

టిటిడి ఉద్యోగులకు..

టిటిడి ఉద్యోగులకు..

కరోనా లాక్ డౌన్ తర్వాత అన్ లాక్1.0లో భాగంగా తిరుమలలో శ్రీవారి ఆలయంలోకి ముందుగా సోమవారం 8, 9వ తేదీలలో టిడిడి ఉద్యోగులకు దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఇదే విషయాన్ని ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. ఇక 10వ తేదీ స్థానిక భక్తులకు అనుమతి కల్పించనున్నారు.

11వ తేదీ నుండి..

11వ తేదీ నుండి..

జూన్ 11వ తేదీ, గురువారం నుండి దేశవ్యాప్తంగా సాధారణ భక్తులకు శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రతిరోజూ కేవలం మూడు వేల మందికి ఆన్ లైన్ లో టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు టిటిడి ప్రకటించింది.

ఈ సమయాల్లో మాత్రమే..

ఈ సమయాల్లో మాత్రమే..

అయితే తిరుమల శ్రీవారిని ఇంతకుముందులాగా ఎప్పుడు పడితే అప్పుడు దర్శించుకునేందుకు అవకాశం లేదు. ప్రతిరోజూ ఉదయం 6:30 నుండి రాత్రి 7:30 గంట వరకు మాత్రమే భక్తులకు అనుమతి ఉంటుంది. ఇక నడకదారిలో అంటే అలిపిరి నుండి మెట్ల మార్గంలో వచ్చే భక్తులకు మాత్రం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది.

ఈ వారం మీ రాశి ఫలాలు 7 నుండి జూన్ 13వ తేదీ వరకు...ఈ వారం మీ రాశి ఫలాలు 7 నుండి జూన్ 13వ తేదీ వరకు...

పుష్కరిణిలో స్నానాలు నిషేధం..

పుష్కరిణిలో స్నానాలు నిషేధం..

ఇంతకుముందు భక్తులందరూ స్వామి వారి దర్శనానికి ముందు పుష్కరిణిలో స్నానం చేసేవారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ప్రబలే అవకాశం ఉన్నందున పుష్కరిణిలో స్నానాలను నిషేధించారు.

ఒకరోజు.. ఒక గది మాత్రమే...

ఒకరోజు.. ఒక గది మాత్రమే...

ఇంతకుముందులా భక్తులు శ్రీవారి దర్శనం కోసం గదులను అద్దెకు తీసుకుని రెండు, మూడురోజులకై పైగా ఉండేందుకు అవకాశం లేదు. ఒక్కరోజులోనే ఒక గదిని మాత్రమే అద్దెకు తీసుకోవాలి. అంతేకాదు ఒక గదిలోకి కేవలం ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుంది. అదీ కూడా ఒకరోజులోనే ఆ గదిని చేయాలి. రెండోరోజు వరకు అనుమతించరు.

మాస్కులు తప్పనిసరి..

మాస్కులు తప్పనిసరి..

శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. అలాగే క్యూ లైన్లలో భౌతిక దూరం కచ్చితంగా పాటించాలి. అలాగే ప్రతి రెండు గంటలకు ఒకసారి శ్రీవారి ఆలయంలోని క్యూలైన్లను ప్రతి 2 గంటలకు ఒకసారి శానిటైజ్ చేస్తారు. కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి.

జూన్ 5 తర్వాత ఈ 5 రాశుల వారు బిలీనియర్లు అయ్యే అవకాశముందట...జూన్ 5 తర్వాత ఈ 5 రాశుల వారు బిలీనియర్లు అయ్యే అవకాశముందట...

వైద్య పరీక్షలు చేశాకే..

వైద్య పరీక్షలు చేశాకే..

వెంకన్న స్వామిని దర్శించుకోవాలంటే ముందుగా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందే. ఆ తర్వాతే స్వామి వారిని దర్శించుకునేందుకు అనుమతి లభిస్తుంది.

అలిపిరిలోనే పరీక్షలు..

అలిపిరిలోనే పరీక్షలు..

ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుని దర్శనానికి వచ్చే భక్తులందరికీ అలిపిరిలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అందుకు సిద్ధంగా ఉండాలి.

హుండీ వద్ద..

హుండీ వద్ద..

శ్రీవారి దర్శనం కోసం ఎంత మంది వస్తారో... ఆ స్వామి వారికి ముడుపులు చెల్లించుకునేందుకు అంతే మంది వస్తారు. అంతేకాదు కొన్నిసార్లు స్వామి దగ్గరికంటే హుండీ దగ్గరే క్యూలైన్ పెరుగుతూ ఉంటుంది. అందుకే అక్కడ కానుకలు వేసే సమయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. హుండీ దగ్గరికి వెళ్లే వారికి కూడా హెర్బల్ శానిటైజేషన్ ప్రక్రియ అందుబాటులో ఉంటుంది.

ప్రైవేట్ హోటళ్లు ఉండవు..

ప్రైవేట్ హోటళ్లు ఉండవు..

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తలుకు ప్రైవేటు హోటళ్లలో ఉండేందుకు అనుమతులు ఇంకా రాలేదు. అలాగే శ్రీవారి మెట్ల మార్గం నుండి కొన్ని రోజుల పాటు అనుమతి ఉండదు.

English summary

Tirumala Tirupati Devasthanam Issues Guidelines for Darshan of Sri Venkateswara Swamy

Here are the new guidelines for tirumala piligrims. Take a look.
Desktop Bottom Promotion