For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Parivartini Ekadashi 2021 : వామన జయంతి ఎప్పుడు? పరివర్తన ఏకాదశి ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా...

పరివర్తన ఏకాదశి 2021 తేదీ, సమయం, చరిత్ర, ఆచారాలు, ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి సంవత్సరంలో వచ్చే మాసాల్లో రెండు పక్షాలు ఉంటాయి. ఒక్కో పక్షంలో ఒక్కో ఏకాదశి వస్తుందనే విషయం మనందరికి తెలిసిందే.

Parivartini Ekadashi 2021 Date, Time, History, Rituals, Significance of Vaman Ekadashi

ప్రతి ఏకాదశి కూడా చాలా విశేషమైనదే. అయితే భాద్రపద మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి మాత్రం చాలా ప్రత్యేకమైనది. ఈ ఏకాదశినే 'పరివర్తిని ఏకాదశి' అంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 17వ తేదీన ఈ ఏకాదశిని జరుపుకోనున్నారు.

Parivartini Ekadashi 2021 Date, Time, History, Rituals, Significance of Vaman Ekadashi

ఇదే రోజున వామనుడి జయంతిగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా పరివర్తిని ఏకాదశినే వామన ఏకాదశిగా ఎందుకు జరుపుకుంటారు. వామన జయంతి ప్రత్యేకతేలేంటి అనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...

విశ్వకర్మ ఎవరు? విశ్వకర్మ జయంతి ఎప్పుడు జరుపుకుంటారు?విశ్వకర్మ ఎవరు? విశ్వకర్మ జయంతి ఎప్పుడు జరుపుకుంటారు?

పరివర్తన ఏకాదశి అంటే..

పరివర్తన ఏకాదశి అంటే..

హిందూ పంచాంగం ప్రకారం.. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి జారుకున్న శ్రీ మహా విష్ణువు, భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఎడమ వైపు నుండి కుడివైపునకు తిరుగుతాడని పెద్దలు చెబుతారు. ఇలా ఆ విష్ణుమూర్తి ఒకవైపు నుండి మరొక వైపునకు పరివర్తనం చెందే ఏకాదశి కనుక, దీన్ని పరివర్తన ఏకాదశి అంటారు.

ఉపవాస దీక్ష..

ఉపవాస దీక్ష..

అన్ని ఏకాదశిల మాదిరిగానే ఈ ఏకాదశి రోజున ఉపవాస దీక్షను చేయాల్సి ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహా విష్ణువుకు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేయాలి. అనంతరం తనకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీకు పెండింగులో ఉండే లేదా అసంపూర్తిగా ఉండే పనులన్నీ పూర్తవుతాయని చాలా మంది నమ్ముతారు.

వామనావతారం..

వామనావతారం..

పరివర్తన ఏకాదశికి మన ప్రక్రుతిలో జరిగే మార్పులకు కూడా సంబంధం ఉందని పెద్దలు చెబుతారు. అందుకే ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అనే పేరు వచ్చిందని అంటారు. మరో కథనం ప్రకారం.. ఇదే రోజున శ్రీ విష్ణుమూర్తి వామనావతారాన్ని ఎత్తి మహాబలి చక్రవర్తిని పాతాళంలోకి పంపుతాడు. పరివర్తన ఏకాదశి రోజున వామనుడి అవతారాన్ని పూజించడం వల్ల బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని పూజించినంత ఫలం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

Ganesh Chaturthi Special:వినాయక ప్రతిమలను ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా...Ganesh Chaturthi Special:వినాయక ప్రతిమలను ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా...

తెలియక చేసిన తప్పులు..

తెలియక చేసిన తప్పులు..

పరివర్తన ఏకాదశి తర్వాత వచ్చేదే ద్వాదశి. ఈరోజునే వామనుడి జయంతిని జరుపుకుంటారు. ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల మనకు తెలియకుండా చేసిన కొన్ని తప్పులకు పరిహారం లభిస్తుందట. మీరు చేసిన పాపాలు అన్ని తొలగిపోయి.. మీరు కోరిన కోరికలన్నీ ఫలిస్తాయట.

వామనుడి కథ..

వామనుడి కథ..

పూర్వ కాలంలో బలి చక్రవర్తి.. ఇంద్రుని చేతిలో ఘోరంగా ఓడిపోయి.. తన గురువైన శుక్రాచార్యుడిని శరణు కోరతాడు. కొంత కాలం తర్వాత తన గురువు అనుగ్రహంతో స్వర్గంపై ఆధిపత్యం చెలాయిస్తాడు. దీంతో ఇంద్రుడు అదితి దేవిని శరణు కోరగా.. ఇంద్రుని పరిస్థితిని చూసిన అదితి దేవి ఎంతో జాలి పడుతుంది. తను వయోవ్రతానుష్టానం చేసింది ఆ వ్రతం చివరిరోజున విష్ణుమూర్తి ప్రత్యక్షమై.. అదితితో ఇలా అన్నాడు. ‘దేవీ బాధపడొద్దు.. నీకు నేను పుత్రునిగా జన్మించి, ఇంద్రునికి చిన్న తమ్మునిగా ఉండి వానికి శుభం చేకూర్చెదనిని'పలికి అద్రుశ్యమవుతాడు.

అదితి గర్భమున..

అదితి గర్భమున..

అనంతరం అదితి గర్భమున ఆ భగవంతుడు వామన రూపంలో జన్మించాడు. భగవంతుని పుత్రునిగా పొందిన అదితి సంతోషానికి అంతులేదు. అనంతరం బలి చక్రవర్తి అశ్వమేధ యజ్ణం చేస్తున్నాడని విన్న వామనుడు అక్కడికి వెళ్లాడు. బ్రాహ్మణ రపంలో అక్కడికి చేరుకున్నాడు. ఆ సమయంలో వామనుడి అవతారం చూసి తనను ఆసనంపై కూర్చొబెట్టి పూజించెను. ఆ తర్వాత బలి చక్రవర్తి వామనుని ఏదైనా కోరమని అడగగా.. ‘వామనుడు నాకు మూడు అడుగుల భూమి' కావాలి అని అడిగారు. ఇదే సమయంలో శుక్రాచార్యుడు భగవంతుని లీలలను గ్రహించి.. ఈ దానం వద్దని బలి చక్రవర్తిని ఎంత బతిమాలినా.. తన గురువు మాట కూడా వినలేదు. అంతేకాదు ఆ దానం ఇచ్చేందుకు సంకల్పం చేసేందుకు జలపాత్రను ఎత్తాడు. ఈ నేపథ్యంలోనే శుక్రచార్యుడు కంటి చూపు కోల్పోయాడు. ఆ వెంటనే వామనుడు ఒక పాదమును భూమిపై.. మరో పాదమును స్వర్గ లోకంపై ఉంచాడు. ఇక మూడో పాదానికి బలి తనకు తానే సమర్పితుడయ్యాడు.

FAQ's
  • 2021లో వామన జయంతి ఎప్పుడొచ్చింది?

    హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో తొలి పక్షంలో అంటే శుక్ల పక్షంలో వామన జయంతిని జరుపుకుంటారు. 2021 సంవత్సరంలో సెప్టెంబర్ 17వ తేదీన వామన జయంతిని జరుపుకుంటారు.

English summary

Parivartini Ekadashi 2021 Date, Time, History, Rituals, Significance of Vaman Ekadashi

Here we are talking about the parivartini ekadashi 2021 date, time, history, rituals, significance of vaman ekadashi. Read on
Desktop Bottom Promotion