Latest Updates
-
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా.. -
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.! -
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.?
Rahu Mahadasha:రాహు గ్రహ మహర్దశ సమయంలో ఈ పరిహారాలు తప్పక పాటించాలి...!
రాహు మహాదశ సమయంలో ఎలాంటి ఫలితాలు వస్తాయి.. ఏ పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాహువు ఐదు, ఏడు, తొమ్మిదో స్థానాలపై ఎక్కువ శ్రద్ధ వహిస్తాడు. ఏ స్థానంపై రాహు గ్రహం యొక్క దృష్టి పడుతుందో వారు రాహువు మహర్దశతో బాధపడుతుంటారని పండితులు చెబుతారు.

ఇలా రాహువు మహర్దశ సుమారు 18 సంవత్సరాల పాటు ఉంటుదట. ఇలా రాహు గ్రహం మహర్దశలో ఉన్నప్పుడు ఇతర గ్రహాలపై అంతర్దశ జరిగే గ్రహాల జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఎందుకంటే దీని ప్రభావం వల్ల అనేక సమస్యలు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో రాహు మహర్దశ ప్రభావం వల్ల ఏయే గ్రహాలకు అంతర్దశ ప్రభావం ఉంటుంది.. ఎవరెవరు ఎలాంటి పరిహారాలు పాటించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

రాహు-శని అంతర్దశ..
జ్యోతిష్యశాస్త్ర నిపుణుల ప్రకారం, రాహువులో శని దేవుని ప్రయాణ కాలం సుమారు 2 సంవత్సరాల 10 నెలల ఆరు రోజుల పాటు ఉంటుంది. ఈ కారణంగా మీ కుటుంబంలో విభేదాలు తలెత్తవచ్చు. మీ జీవిత భాగస్వామి గొడవల కారణంగా, ఏకంగా విడాకుల వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. మీ శరీరంపై ఆకస్మిక గాయం కావడంతో పాటు ఇతర ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో వీటి నివారణ కోసం శివుడిని జమ్మీ ఆకులతో ఆరాధించాలి. మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి లేదా అర్హత కలిగిన బ్రహ్మాణుడిచే జపించాలి. దీని తర్వాత జాజికాయలు కూడా సమర్పించాలి. అనంతరం నవ చండి స్తోత్రాన్ని కూడా పూర్తిగా పఠిస్తే రాహు మహర్దశ ప్రభావం నుండి తప్పించుకోవచ్చు.

రాహు-బుధుడు..
రాహు గ్రహం మహర్దశలో ఉన్నప్పుడు బుధుడి సంచారం రెండు సంవత్సరాల మూడు నెలల ఆరు రోజుల పాటు జరుగుతుంది. ఈ సమయంలో మంచి ఫలితాలే ఉంటాయి. పెళ్లి చేసుకున్న జంటలకు సంతానం లభిస్తుంది. సంపద కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అదే సమయంలో మీ పనిలో నైపుణ్యం, తెలివితేటలు పెరుగుతాయి. వ్యాపారులకు సమాజంలో గౌరవం, కీర్తి లభిస్తుంది. ఈ సమయంలో వినాయకుడి శతనామాలతో జపించాలి. ఏనుగుకు కొబ్బరికాయలు లేదా బెల్లం కలిపిన ఆహారం ఇవ్వాలి. పక్షులకు గింజలను ఆహారంగా పెట్టాలి.

రాహు-కేతు..
రాహు గ్రహం మహర్దశలో ఉన్నప్పుడు కేతు గ్రహం రవాణా కాలం ఒక సంవత్సరం 18 రోజుల పాటు జరుగుతుంది. ఈ సమయం చాలా దారుణంగా ఉంటుంది. ఈ కాలంలో చాలా మంది అనేక రకాల వ్యాధులతో బాధపడతారు. అదే సమయంలో శత్రువులతో కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబ జీవితంలో కూడా కష్టాలు ఎదురవుతాయి. అయితే ఇలాంటి సమయంలో మీరు సమస్యల నుండి బయటపడటానికి కాలభైవరుని ఆలయంలో కాషాయ జెండాను ఎగురవేయాలి. అదే విధంగా శునకాలకు బ్రెడ్ ముక్కను లేదా బిస్కెట్లను ఆహారంగా వేయాలి. మీ ఇంట్లో గుగ్గిలాలతో దీపాన్ని వెలిగిస్తే, మీకు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

రాహు-శుక్రుడు..
రాహువు మహర్దశలో ఉన్నప్పుడు శుక్రుడు సంచారం చేసే సమయం సుమారు మూడు సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ కాలంలో కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో చాలా మంది కొత్త వాహనాలు, భూమి వంటి వాటిని కొనుగోలు చేసి ఆనందం పొందుతారు. అయితే శుక్రుడు, రాహు గ్రహాల ప్రభావం వల్ల ఆరోగ్య సంబంధిత వ్యాధులు రావొచ్చు. ఇలాంటి పరిస్థితుల నుండి ఉపశమనం పొందడానికి ఎద్దుకు బెల్లం లేదా గడ్డిని ఆహారంగా ఇవ్వాలి. అదే విధంగా పరమేశ్వరుని ఆలయానికి వెళ్లి నందిని ఆరాధించాలి.



Click it and Unblock the Notifications
