For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శుక్రవారం గుడికి వెళ్ళే వారు పాటించాల్సిన నియమాలు....!

|

శుక్రవారం అంటే అమ్మవారికి ప్రత్యేకం. అలాగే ముత్తైదువులు, మహిళలకు ప్రత్యేకం. అందుకే శుక్రవారం మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల సంపదలు పొందుతారని శాస్ర్తాలు చెబుతున్నాయి. శుక్రవారం లక్ష్మీదేవి లేదా ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్లడం వల్ల కలకలకాలం ముత్తైదు తనం ప్రాప్తిస్తుంది. శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు.

శుక్రవారం పూట ఆలయాలను సందర్శించుకోవడం ద్వారా సుఖ సంతోషాలు చేకూరుతాయి. శుక్రవారాల్లో చేసే పూజల ద్వారా అష్టైశ్వర్యాలు లభించడంతో పాటు ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాంటి మహిమాన్వితమైన శుక్రవారం పూట ఆలయాలకు వెళ్లే మహిళలు ఎలా వెళ్లాలంటే..?

Rules to Visit Temples on Friday..!

దేవాలయాలను సందర్శించుకునే మహిళలు, కన్యలు సంప్రదాయ దుస్తులను ధరించాలి. చీరలు, లంగా ఓణీలు వంటి ధరించాలి. జీన్స్ టీ షర్టులు వంటి ఆధునిక వస్త్రాలు ధరించరాదు.పురుషులైతే పంచ కండువా లేదా కుర్తా పైజామా వంటి సాంప్రదాయ వస్త్రాలు ధరించాలి. నుదుట కుంకుమ రంగుతో కూడిన బొట్టు పెట్టుకోవాలి.

Rules to Visit Temples on Friday..!

ఆలయాల్లో ఇచ్చే పసుపు కుంకుమలను నుదుట కుంకుమ కింద పెట్టడం, విభూతిని నుదుట బొట్టుకు పైన పెట్టడం చేయాలి. విగ్రహాలకు కర్పూరం వెలిగించేటప్పుడు ఆలయాల్లోని దీపాల వెలుగు నుంచో లేదా ఇతరుల వద్ద అగ్గిపెట్టెలను అప్పు తీసుకుని దీపమెలిగించడం కూడదు.

Rules to Visit Temples on Friday..!

ఇక శుక్రవారం ఉదాహరణకు విఘ్నేశ్వరునికి ఆలయానికి వెళ్తున్నారంటే.. గరిక మాలతో తీసుకెళ్లండి. గరికమాలను వినాయకునికి ప్రతిశుక్రవారం సమర్పిస్తే.. కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అలాగే శివాలయానికి వెళ్లేవారు బిల్వపత్రాలను తీసుకెళ్లడం ద్వారా ఈతిబాధలు తొలగిపోయి, సర్వ శుభాలు చేకూరుతాయి.

Rules to Visit Temples on Friday..!

ఇదేవిధంగా విష్ణుమూర్తి ఆలయాన్ని శుక్రవారం సందర్శించుకునే భక్తులు తులసీ మాలతో వెళ్లండి. అలాగే ఆంజనేయస్వామిని దర్శించుకునే వారు వెన్నముద్దతో వెళ్లడం ద్వారా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది.

అదేవిధంగా దుర్గమ్మతల్లిని శుక్రవారం దర్శించుకునే మహిళలు పసుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో గల పువ్వులను సమర్పించుకుంటే సర్వసుఖసంతోషాలు చేకూరుతాయి...

Rules to Visit Temples on Friday..!

శుక్రవారం మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. శుక్రవారం పూట లక్ష్మీదేవిని పూజించడం లేదా ఏదైనా అమ్మవారి ఆలయానికి చేరుకుని నేతితో దీపం వెలిగించడం ద్వారా దీర్ఘ సుమంగళీ ప్రాప్తం లభిస్తుంది, ఈతిబాధలు తొలగిపోవడం, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తికావడం వంటి శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి.

Rules to Visit Temples on Friday..!

శుక్రవారం నాడు అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అమ్మవారికి తెల్లపువ్వులు సమర్పించడంతో గృహంలో ప్రశాంతత నెలకొంటుందని విశ్వాసం. ప్రతి శుక్రవారం ఇలా చేస్తే ఆ కుటుంబమంతా సుఖసంతోషాలతో, ప్రశాంతతతో ఉంటుందని పండితులు అంటున్నారు. ధవళ వర్ణ వస్త్రాలు ధరించడం, అరటి పండు జ్యూస్ తాగడం లేదా అరటి పండు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని పురోహితులు చెబుతున్నారు.

English summary

Rules to Visit Temples on Friday..!

For the uninitiated, a visit to a temple in Southeast and East Asia could be a daunting undertaking. The unfamiliar breeds trepidation and you find yourself unsure of what to do. What are the rules for these mysterious places?
Story first published: Friday, July 8, 2016, 15:10 [IST]
Desktop Bottom Promotion