Latest Updates
-
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి!
వినాయక నిమజ్జనం సమయంలో కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...!
కరోనా సమయంలో గణేష్ నిమజ్జనంలో పాల్గొనేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేశంలో గణేష్ ఉత్సవాలు ఈ ఏడాది కరోనా కారణంగా చాలా సింపుల్ గా ప్రారంభమయ్యాయి. అంతేకాదు గణేష్ నిమజ్జన వేడుకలు కూడా ఈసారి చాలా జాగ్రత్తగా జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఎందుకంటే వేడుకల కన్నా ప్రాణాలు అనేవి చాలా ముఖ్యమని తెలుసుకోవాలి. ఇంతకుముందులా గణేష్ నిమజ్జనం అంటే సామూహికంగా డ్యాన్సులు చేయడం.. డీజే పాటలు పెట్టడం, భారీ స్పీకర్లు పెట్టడం, డ్రమ్స్ వంటి వాటికి అనుమతి లేదు. అయితే ఇప్పటికే కొంతమంది గణేష్ నిమజ్జనాన్ని కూడా పూర్తి చేస్తారు. వారి వారి ప్రాంతాలను బట్టి మూడు రోజులకు, ఐదు రోజులకు, కొంతమంది తొమ్మిది రోజులకు, ఇంకొందరు 11 రోజుల తర్వాత నిమజ్జన వేడుకలను నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా హిందువులతో పాటు ఇతరులు కూడా ఈ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించే అవకాశమే లేదు. ఎందుకంటే కరోనా మహమ్మారి రోజురోజుకు విలయతాండం చేస్తోంది. ఈ నేపథ్యంలో నిమజ్జనం సందర్భంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిన నియమ నిబంధనాలను ప్రభుత్వాలు విడుదల చేశాయి. ఈ సందర్భంగా వినాయక నిమజ్జన వేడుకలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మాస్క్, శానిటైజర్ తప్పనిసరి..
ఈసారి గణేష్ నిమజ్జనం ఉత్సవంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్కును తప్పనిసరిగా ధరించాలి. అలాగే శానిటైజర్ ను ప్రతి రెండు లేదా మూడు గంటలకోసారి చేతులకు రాసుకోవాలి.

భౌతిక దూరం మరవొద్దు..
గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో అసలైన విషయం ఇదే. ఈ ఉత్సవాల సందర్భంగా డీజే పాటలు లేదా డ్రమ్స్ పెట్టి ప్రతి ఒక్కరూ సామూహికంగా కలిసి డ్యాన్సులు వేస్తూ.. ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. కానీ ఈసారి ఇలాంటి వాటిని జరుపుకోవాల్సిన పరిస్థితి కనబడటం లేదు. అలాగే మీరు కచ్చితంగా భౌతిక దూరం పాటించాలి.

నలుగురు మాత్రమే..
సాధారణంగా గణేష్ నిమజ్జనం సమయంలో జరిపే ఊరేగింపులో పదుల సంఖ్యలో లేదా వందలాది మంది ప్రజలు రోడ్లపై గుమిగూడి ఉంటారు. అలాగే వాహనాలలో కూడా పదుల సంఖ్యలో వ్యక్తులు ఉంటారు. కానీ ఈసారి మాత్రం గణేశుని ఊరేగింపు సమయంలో కేవలం నలుగురు లేదా ఐదుగురు కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి.

టపాసులు కాల్చకండి..
ప్రతి ఏడాది గణేష్ నిమజ్జనం సందర్భంగా, టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ ఏడాది దీనికి అవకాశం లేదు. పోలీసులు కూడా బాణసంచా కాల్చడానికి అనుమతి ఇవ్వలేదు. కాబట్టి ముందుగానే బాణసంచా కొనడం వంటివి చేయకండి. ఒకవేళ వాటిని కొంటే ఇతర సమయాల్లో ఉపయోగించుకోండి.

నీటిలో దిగే సమయంలో..
వినాయక విగ్రహాలను తీసుకునే నీటిలోకి దిగే సమయంలో కాలువలు, చెరువులు, నదులు, సముద్రాల వద్ద కేవలం ఈత వచ్చినవారే వెళ్లండి. ఈత వచ్చిన వారు కూడా ఎక్కువ లోతు మరియు దూరం వెళ్లకండి. ఎందుకంటే ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి కాలువల్లో, నదుల్లో నీటి ప్రవాహం వేగంగా ఉంటుంది. ఇప్పటికే చాలా చోట్ల భారీ వర్షాలు కూడా పడ్డాయి. డ్యాములన్నీ నిండిపోయాయి. అన్ని కాలువలకు నీటిని విడుదల చేశారు.

సాయంత్రం లోపు..
సాధారణంగా వినాయక నిమజ్జనం అంటే కొందరు రాత్రి వేళలో లేదా సాయంకాలం పూట ఊరేగింపు కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. కానీ ఇప్పుడు కరోనా వంటి మహమ్మారి ఉంది కాబట్టి.. లాక్ డౌన్ కూడా ఉన్నందున వినాయక ఊరేగింపును సాధ్యమైనంత మేరకు చీకటి పడేలోపు ముగించుకోవాలి.



Click it and Unblock the Notifications