For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శని జయంతి: శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకునే జప మంత్రాలు

|

భారతీయుల జ్యోతిషశాస్త్రం ప్రకారం 'శనీశ్వరుడు' ,నవగ్రహాలలో ఒక గ్రహం. సూర్యుడు, చంద్రుడు, ఛాయా గ్రహాలైన రాహువు మరియు కేతువులతో కలిపి గ్రహాలు తొమ్మిది. గగన మండలంలో ఉన్నగ్రహాలకు భూమితో సంబంధం ఉంది. కాబట్టి తొమ్మిది గ్రహాల ప్రభావం భూమి మీద, భూమిపై ఉన్న ప్రతి చరాచర జీవుల పైన, నిర్జీవ, ఝడ, నిర్లిప్త వస్తువుల మీద వుంటుంది.

నవగ్రహాలలో ఒకటైన శని గ్రహం ఇందుకు బిన్నం కాదు. శని, శనిగ్రహం, శనేశ్వరుడు, శనీశ్వరుడు, అని పలు నామములతో పిలువబడి, గ్రహ రూపలో పూజింపబడే 'శని' ఒక గ్రహదేవుడు. వారంలో ఏడవవారం శనివారం. శనివవారానికి అధిపతి శనేశ్వరుడు. సంఖ్యలలో 'ఎనిమిది' శనికి ప్రీతికరమయిన సంఖ్య.

సూర్యుని కుమారులైన శని మరియు యముడు

సూర్యుని కుమారులైన శని మరియు యముడు

సూర్యుని కుమారులైన శని మరియు యముడు, ఇరువురూ న్యాయాధిపతులే. యముడు మరణానంతరం దండనలు విధిస్తే, శని, జీవులు బ్రతికి ఉండగానే హింసించి, యాతనలకు గురిచేసి శిక్షిస్తాడు. గుణపాఠం నేర్పించే విషయంలో శనికి ఎవరూ సాటి లేరు. ద్రోహం, వెన్నుపోటు, హింస, పాపమార్గాలు మరియు అన్యాయ మార్గాలను అనుసరించేవారికి శనిదేవుడు మిక్కిలి అపాయకారి అని శాస్త్రాలు చెబుతున్నాయి. తన దృష్టి పడ్డవారిని హింసించి, నానాయాతనలకు గురిచేసి, అత్యంత కౄరంగా అమిత బాధలకు గురిచేసే శనిదేవుడు, తను కరుణించిన వారిని అందలం ఎక్కించే శ్రేయోభిలాషి అని శాస్త్రాలు వర్ణించాయి.

నల్లని ఛాయ అతని మేని వర్ణం

నల్లని ఛాయ అతని మేని వర్ణం

నల్లని ఛాయ అతని మేని వర్ణం. నల్లని వస్త్రములు అతని ఉడుపులు. ఖడ్గము, బాణములు మరియు రెండు బాకులు అతని ఆయుధాలు. నల్లని కాకి అతని వాహనం. శనిభగవానుడు సహజంగా నల్లటి ఛాయ కలవాడని, ఛాయా, మార్తాండ సంభూతుడని, అందమైన ముఖం కలవాడుగాను, క్రూరుడిగాను, మందగమనుడిగాను, గానుగుల కులానికి చెందినవాడుగాను, కాల-భైరవుడికి మహాభక్తుడిగాను హిందూ పురాణాలు జ్యోతిష శాస్త్రాలలో వర్ణింపబడ్డాడు . ఈ శని జయంతి సందర్భంగాశనీశ్వరుడిని ప్రసన్నం చేసుకునే జప మంత్రాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకునే జప మంత్రాలు:-

శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకునే జప మంత్రాలు:-

* ఓం శం శనయేనమ

* ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః

* కోణస్ధః పింగళ బభ్రు: కృష్ణో రౌద్రంతకో యమ: సౌరి శనైశ్చరో మంద: పిప్పలాదేవ సంస్తుత:

* నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం

* ఓం సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష: శివప్రియ: మందచార: ప్రసనాత్మ పీడాం హరతుమే శని.

 శని గాయత్రీ మంత్రం: -

శని గాయత్రీ మంత్రం: -

* ఓం ఖగథ్వజాయ విద్మహే ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్.

* ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్

* శ్రీ రామ జయ రామ జయ జయ రామ అని ఎప్పుడు మనస్సులో స్మరించుకోవాలి. హనుమాన్ చాలీసా చదువుకోవడం వలన ఎంతో మంచి జరుగుతుంది.

గమనిక:

గమనిక:

శని దేవునికి సంబంధించిన సమస్యలు, కండరాలు లేదా మనస్సు గాయపడినప్పుడు, అనారోగ్యమైనప్పుడు , రోజూ హనుమంతుడిని ఆరాధించండి. ప్రధానంగా హనుమాన్ ఛాలీసా లేదా హనుమాన్ సువార్తలు చెప్పండి. సాటర్న్ పూజా సమయంలో వాల్మీకి రామాయణంలోని బాల కంద యొక్క 30 వ అధ్యాయాన్ని ప్రతిరోజూ చదవాలి.

English summary

Shani Jayanti 2021: Powerful Shani Dev Mantras In Telugu

Shani Jayanti 2021: In this article, we shared some powerful shani dev mantras in telugu. Read on to know more...
Desktop Bottom Promotion