For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మత్స్య జయంతి ప్రత్యేకత ఏంటి

|

ప్రపంచంలోని అతి పురాతనమైన మతాలలో హిందూ మతం కూడా ఒక్కటి. కానీ అనేక మతాలలో ఉన్నట్లు గా కేవలం ఒక్క దేవునికే పరిమితం కాలేదు హిందూ మతం. హిందూ మతంలో 33 మిలియన్ దేవతలు ఉన్నారు. సూచన ప్రాయంగా ముక్కోటి దేవతలుగా అభివర్ణిస్తుంటారు. ప్రతి ఒక్క దేవునికి వారికి తగ్గ ప్రత్యేకతలు మరియు కథలు అనేకం ప్రాచుర్యంలో ఉన్నాయి.

హిందువుల విశ్వాసం ప్రకారం సృష్టి ఏర్పడడానికి కూడా ఒక కారణం ఉంది. మరియు ప్రతి చెడుకి ఒక మంచి రక్షగా ఉంటుంది. కానీ సృష్టి కారణం పూర్తయ్యాక, నాశనం గావించబడుతుంది.

జీవన్మరణాల సమర్ధ నియంత్రణకై సృష్టి ఆవిర్భావం జరిగింది, దీని యొక్క భాద్యత సృష్టికర్త బ్రహ్మపై ఉన్నది. జీవుల కర్తలను కర్మలను నిర్ణయించి, వారి కర్మలు పూర్తయిన తర్వాత మరణం ద్వారా సమగ్ర నియంత్రణ జరిగేలా బ్రహ్మ చూస్తాడు.

Significance Of Matsya Jayanthi

విష్ణువు సృష్టి రక్షకునిగా కీర్తింపబడుతాడు. ఎప్పుడైనా, సృష్టియందు చెడు పెరిగి మంచికి ఆపద వస్తున్న సమయాన, తన అవతారాలతో చెడుని తుదముట్టించి సృష్టిని కాపాడే భాద్యత అంతిమంగా విష్ణువు దే అవుతుంది. అదే సమయంలో కార్యాలన్నీ పూర్తి చేసుకున్న సృష్టిని వినాశనం భాద్యత మాత్రం మహేశ్వరునిపై ఉంటుంది.

ఈ విధంగా, ఆధ్యాత్మిక దృష్టికోణంలో, విష్ణువు యొక్క తొమ్మిది అవతారాలు రామావతారం, కృష్ణావతారం, కూర్మావతారం , నరసింహావతారం, వరాహావతారం, వామనావతారo , నరసింహావతారం, భార్గవ అవతారం అలాగే మత్స్యావతారం హిందూమతంలో అధిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఇతర అవతారాలలో, మత్స్యావతారం ప్రముఖమైనది. ఈ మత్స్యావతారానికి గుర్తుగా మత్స్య జయంతిని హిందువులు జరుపుకుంటారు. ఈ సంవత్సరo మత్స్యజయంతి మార్చి 20 న వస్తుంది అనగా ఈరోజు.

ఈ ప్రత్యేకమైన పండుగ గురించి తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.

అసలు మత్స్య జయంతి ఎప్పుడు జరుపుకుంటారు:

ఈ సంవత్సరం, మత్స్య జయంతి మార్చి 20 న వస్తుంది అనగా ఈరోజు. ఇది భారతదేశం యొక్క సాంప్రదాయ క్యాలెండర్ ప్రకారం, చైత్ర మాసం శుక్ల పక్షాన మూడవ రోజు జరుపుకుంటారు. ఈ రోజున, విష్ణు భగవానుడు వేదాలను రక్షించడానికి ఒక కొమ్ముల చేప వలె కనిపించాడు. రాబోయే శతాబ్దాల్లో భూమిని ఎదుర్కోబోయే గొప్ప మహా ప్రళయాల గురించి హెచ్చరించడానికి విష్ణువు ఈ ప్రత్యేక అవతారం లో భూమిపై కనిపించినట్లు, తద్వారా సమర్ధుడైన మనువుకి ఈ భాద్యతను అప్పగించినట్లుగా కొన్ని గ్రంథాలు సూచిస్తున్నాయి.

Significance Of Matsya Jayanthi

మత్స్య జయంతి విధివిధానాలు:
ఈ రోజు విష్ణుమూర్తికి అంకితం చేయబడిన రోజు, కావున ఆలయంలో ప్రార్ధనలను చేయడం, ఉపవాస దీక్ష గావించడం వంటి వాటి ద్వారా ఆ దేవుని కృపకు పాత్రులవగలరని పురాణాల సారాంశం. ఒకవేళ ఈ ప్రత్యేకమైన రోజు ఉపవాస దీక్షను మరియు పూజలను వేకువ జామునే ఆరంభించగలిగితే, అదృష్టం వరించి మోక్ష మార్గానికి దారి సుగమం అవుతుందని చెప్పబడింది. మోక్షం, హిందూమతం యొక్క అంతిమ లక్ష్యం. అయినప్పటికీ, ఈ ప్రత్యేకమైన ఉపవాస దీక్షలో , పూర్తిగా ఆకలితో ఉండాల్సిన అవసరం కూడా లేదు. పాలు పండ్లు స్వీకరించవచ్చు అని సూచించబడినది.:

మత్స్య జయంతి యొక్క ప్రాముఖ్యత:

ఈ రోజు మత్స్యo తో అనుబంధం ఉన్న కారణాన, చెరువులు, సరస్సులు, నదులు మరియు ఇతర నీటి వనరులను శుద్ధి చేయడం ద్వారా అదృష్టం తెచ్చుకోవచ్చని నమ్ముతారు. చేపలు మరియు ఇతర జల జంతువులకు ఆహారమివ్వడం కూడా సాధారణoగా దీక్షలో భాగంగానే ఉంటాయి. ఈ రోజున దాతృత్వంలోని ఏదైనా రూపం ప్రోత్సహించబడుతుంది. అందువల్ల చాలామంది ప్రజలు ఈ రోజున సమాజంలోని పేద మరియు వెనుకబడిన వర్గాలకు ఆహారాన్ని మరియు పాత దుస్తులు విరాళంగా ఇస్తుంటారు. ఈరోజు మత్స్య్తావతారo లేదా మత్స్య పురాణం సంబంధించిన కథలు చదవడం కానీ వినడం వలన కానీ పాప చింతన తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు.

సంబంధిత కథలు మరియు వాటి నమ్మకాలు :
మనలో చాలామందికి తెలిసిన కథ ప్రకారం సత్యవ్రతుడు, మనువు మత్స్యాన్ని రక్షించిన వారిలో ఉన్నారు. దీనికి ప్రతిఫలంగా మత్స్యదైవం , మనువుకు ప్రళయాన్ని గురించిన హెచ్చరికలను ముందుగానే తెలియజేస్తుంది. ఈ ప్రళయం కారణంగా సమస్త సృష్టి వినాశనానికి గురవ్వబోతున్నదని, వేదాలను కాపాడవలసిన భాద్యతలను మనువు తీసుకోవలసినది గా దేవ మత్స్యం సూచిస్తుంది. మరియు అన్నీ మొక్కలకు సంబంధించిన విత్తనాలను, ఆరోగ్యకరమైన జంటలను కూడా కాపాడవలసినదిగా మనువు ఆదేశింపబడుతాడు. ఈ హెచ్చరికల కారణంగానే ఒక భయానకమైన ప్రళయం నుండి మనువు అనేకమందిని కాపాడగలిగాడు. తద్వారా మానవాళి ఉనికి ప్రశ్నార్ధకం కాకుండా చేయగలిగాడని పురాణాల సారాంశం.

మత్స్య పురాణం:

మత్స్యావతారం గురించి మనకు తెలిసిన అనేక కథలు , చాలా భాగం మత్స్య పురాణం నుండే వచ్చినవి. ఈ పురాణాల్లో విష్ణువు , శివుడు మరియు శక్తి దేవతకు సంబంధించిన కథలు అనేకం ఉన్నాయి. ఇక్కడ అనేక అధ్యాయాలు హిందూమతంతో అనుబంధించబడిన పండగలు మరియు ఆచారాలకు అంకితమివ్వబడ్డాయి. ఈ పురాణం సమాజంలోని వివిధ విభాగాల (రాజులు మరియు మంత్రుల నుండి కేవలం పౌరులకు మాత్రమే) విధుల గురించి మాట్లాడుతుంది. హిందూ మతం యొక్క 18 అత్యంత ముఖ్యమైన పురాణాలలో ఒకటిగా ఈ మత్స్య పురాణం ఉండటం వలన, ఈ గ్రంథం భవననిర్మాణాలు, వేడుకలు మరియు అదే నిర్మాణాలతో అనుబంధించబడిన వేర్వేరు నిర్మాణ ఆకృతులను వివరించడానికి ఉపయోగపడుంది కూడా.


మత్స్య దేవాలయం:

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి ఆలయ పట్టణ సమీపంలో, ప్రసిద్ధమైన మరియు విష్ణువు మత్స్యావతారానికి అంకితమిచ్చిన శ్రీ వేద నారాయణస్వామి ఆలయం ఉన్నది. ముందు చెప్పినట్లుగా, మత్స్య పురాణాల్లో వివరించబడిన నిర్మాణ వివరాలు చాలా ఖచ్చితమైనవి. ఈ ఆలయ రూపకల్పన మరియు సృష్టిలో ఇదే వాడబడింది. ప్రతి సంవత్సరం, సూర్యుడి కిరణాలు నేరుగా మార్చి 25 , 26 మరియు 27 వ తేదీల్లో విగ్రహం మీద పడేలా ఉండడం ఈ దేవాలయం ప్రత్యేకత. ఈ సంవత్సరం మాత్స్య జయంతి మార్చి 20 వ తేదీన జరగనున్నదని పరిశీలిస్తే, రాబోయే పది రోజులు అత్యధిక జనసందోహంతో ఉండగలదని చెప్పకనే చెప్పవచ్చు. దీనికి కారణం గర్భగుడిలో విగ్రహం పై సూర్య కిరణాల తాకిడి. ఈ సమయంలో వేద నారాయణ స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై భక్తులకు కనులారవిందం చేయనున్నాడు.

మత్స్యావతారానికి సంబంధించిన మరొక పండుగ కూడా ఉందని మీకు తెలుసా ?

ఈ ఉత్సవాన్ని జరుపుకునేందుకు ఆసక్తిగా ఉన్నవారికి మత్స్య ద్వాదర్షి అనునది మరొక పండుగ. ఇది మత్స్యావతారానికి అంకితమైనది. మత్స్య జయంతి మాదిరిగా కాకుండా, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ పండుగ ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందింది. కొన్ని వర్గాలు కార్తిక మాసం 12వ రోజు జరుపుకుంటాయి, మరికొంత మంది మార్గశిర మాసాన 12 వ రోజున చేస్తారు. ఈ పండుగకు సంబంధించిన ఆచారాలు మత్స్య జయంతికి చాలా దగ్గర పోలికలను పోలి ఉంటాయి మరియు మీరు ఈ మత్స్య జయంతిని జరుపుకుంటున్న వారై ఉంటే, మీకు సూచించదగ్గ మరొక పండుగ ఈ మత్స్య ద్వాదర్షి.

English summary

Significance Of Matsya Jayanthi

Matsya jayanthi is the first avatar of Lord Vishnu. It is celebrated on 20th March this year. The festival falls on third day of shukla paksha. On this day it is believed that one could attain luck if you clean river, lake, pond etc. As other festivals you don't have to starve completely and can have fruits and milk.
Story first published: Tuesday, March 20, 2018, 12:54 [IST]
Desktop Bottom Promotion