Latest Updates
-
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా? -
రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్.! -
తప్పేం లేదు.. ప్రశాంతంగా బతకాలంటే ఈ ఐదు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాల్సిందే.! -
రాఖీ స్పెషల్: నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే కమ్మటి బేసన్ లడ్డూ..చాలా ఈజీగా చేసుకోండిలా -
మీ సోదరుడి రాశి చక్రం ఆధారంగా ఈ రాఖీలు కడితే.. వారి సంతోషానికి ఢోకా ఉండదు.! -
పకోడీలు, బజ్జీలు బోర్ కొట్టాయా? అయితే ఈ కరకరలాడే మునగకాయ స్నాక్ ట్రై చేయండి! -
డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ ఏ టైంకి తింటున్నారు? ప్రాణగండం ఉంది జాగ్రత్త! -
సోదరి లేకపోతే ఎవరు రాఖీ కట్టవచ్చు.. రక్షాబంధన్ ఉద్దేశం, నియమాలు తెలుసుకోండి.!
దుర్గా పూజలోని 5 రోజుల ప్రాముఖ్యత(మహా షష్ఠి, సప్తమి, అష్ఠమి,నవమి, దశమి)
బెంగాలీ ల ముఖ్య పండుగైన దుర్గా పూజని దేశమంతా భక్తి ప్రపత్తులతో జరుపుకుంటారు.దుర్గా పూజనే కొన్ని ప్రాంతాల్లో దేవీ నవరాత్రులనీ, దసరా అనీ పిలుస్తారు.దుర్గా పూజ 5 రోజులు జరుగుతుంది, ఒక్కోరోజు దుర్గా దేవిని ఒక్కో పేరుతో పిలుస్తారు.
దుర్గాపూజలో దుర్గా మాతని జగన్మాతగా కొలుస్తారు.కేవలం హిందూ మతంలో మాత్రమే తల్లికీ, దేవుడితో సమానమైన హోదా ఇచ్చారు.ప్రపంచంలో మిగతా బంధాల కంటే అమ్మతో ఉన్న బంధం ప్రత్యేకమైనది.అందుకే దేవుడిని కూడా అమ్మతో పోల్చి దుర్గా మాత అని పిలుస్తాము.
జగన్మాత అయిన ఆ దుర్గా మాతకి వందనాలు.మానవులందరిలో దయ,బుద్ధి,అందం తదితర రూపాలలో కొలువయ్యుండే మాత లయకారుడైన పరమశివుని ఇల్లాలు.ఈ ఆర్టికిల్ ద్వారా దుర్గా పూజ జరిగే 5 రోజుల ప్రాశస్త్యాన్ని వివరించాము.ఒక్కోరోజు పూజలో ఏమేమి చేస్తారు, చేసే పద్దతి తదితర వివరాలు పొందుపరిచాము చూడండి.

మహా షష్ఠి:
తన పిల్లలయిన సరస్వతి,లక్ష్మి గణేశుడు,కార్తికేయునితో కలిసి సీంహ వాహనం మీద అమ్మ భూలోకనికి దిగి వచ్చే రోజిది.షష్ఠి పూజ రోజున అమ్మ ఒక్క దర్శనాన్ని భక్తులకి కల్పిస్తారు.దానికి ముందు ముఖ్య పూజలయిన ఆమంత్రణ్,బోధన్,అదిబష్ పూజలు చేస్తారు బెంగాలీలు.ఢాక్ అనే ఒక రకమైన వాయిద్యాన్ని వాయించడం ద్వారా అమ్మ రాకని తెలియచేస్తారు.

మహా సప్తమి:
మహా సప్తమి రోజున మహా పూజ మొదలవుతుంది.సూర్యోదయానికి ముందే ఒక అరటి చెట్టుని పవిత్ర జలాల్లో ముంచి తీసి దానికి కొత్త పెళ్ళి కూతురిలాగ చీర కడతారు.దీనినే "కోలా బౌ" అనీ "నబ పత్రిక" అనీ పిలుస్తారు.ఈ పూజని పీఠం మీద గణేశుని ప్రతిమ పక్కన చేస్తారు.ఈ పూజలో అదృష్టాన్ని ప్రసాదించమని దుర్గా మాతని వేడుకుంటారు.ఇదే రోజు 9 రకాల మొక్కలని కూడా దుర్గా అవతారాలుగా భావించి పూజిస్తారు.

మహా అష్ఠమి:
శాస్త్రాల ప్రకారం మహిషాసురుడిని అమ్మ సంహరించిన రోజిది.చెడుని రూపు మాపబడిందనే సంకేతం ఇవ్వడానికి పూర్వకాలంలో గేదెని మహారాజుకి ఇచ్చేవారు.సంస్కృతంలో ఉన్న "అంజలి" అని పిలువబడే శ్లోకాలని చదువుతూ అమ్మని ప్రస్తుతిస్తారు.ఇదే రోజున కుమారీ పూజ కూడా చేస్తారు. కుమారీ పూజ అంటే 9 సంవత్సరాలకంటే తక్కువ వయసున్న అమ్మాయిలని దుర్గా మాతగా భావించి పూజ చేస్తారు.మహా అష్టమి, మహా నవమిల కలయిక అయిన సాయాంకాలం సంధి పూజ చేస్తారు.

మహా నవమి:
సంధి పూజ అవ్వగానే మహా నవమి పూజ మొదలయ్యి మహా ఆరతితో ముగుస్తుంది.దుర్గా పూజ నిర్వహించే వివిధ కమిటీలన్నీ కలిసి భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తాయి.

మహా దశమి:
దుర్గా పూజ చివరి రోజు "మహా దశమి".ఈరోజున దుర్గా మాత విగ్రహాన్ని పవిత్ర గంగా నదిలో నిమజ్జనం చేస్తారు.దేనినే "దుర్గా మాత విసర్జన్" అంటారు.నిమజ్జనం రోజున దుర్గా మాత విగ్రహాన్ని ఉత్సవంలాగా ఊరెరిగిస్తూ తీసుకెళ్తారు. ఈ ఉత్సవంలో భక్తితో పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు.వివాహమిన స్త్రీలందరూ ఒకరిమీద ఒకరు సింధూరాన్ని చల్లుకుంటారు. దీనినే "సింధూర్ ఖేలా" అంటారు.దుర్గా మాతని నిమజ్జనం చేసాక ఇండ్లకి తిరిగి వచ్చి స్నేహితులు, బంధువుల ఇళ్ళకి వెళ్ళి "విజయ దశమి" శుభాకాంక్షలు తెలియచేస్తారు.విజయదశమి రోజు బంధు మిత్రులతో కలిసి అనేక పిండి వంటలు చేసుకుని కలిసి భోజనం చేస్తారు.



Click it and Unblock the Notifications