For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాస్తుశాస్త్రం ప్రకారం ఆ వైపునే తిరిగి పడుకోవాలి... ఈ వైపునే తిరిగి నిద్ర లేవాలి...!

|

మనందరం ఎప్పుడు నిద్రలోకి జారుకున్నా ఒక్కో యాంగిల్ లో పడుకుంటూ ఉంటాం. కొందరేమో కుడి వైపు తిరిగి, మరి కొందరేమో ఎడమవైపు తిరిగి పడుకుంటూ ఉంటారు. కానీ కొందరు మాత్రం నిటారుగా లేదా బోర్లా పడుకుంటూ ఉంటారు. అయితే పూర్వకాలంలో మనపెద్దలందరూ ఆరోగ్య సూత్రాలను తూచా తప్పకుండా పాటించేవారు. అందుకే వారు చాలా సంవత్సరాలు ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండేవారు.

అయితే నిద్రించే విధానంలో ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. ఇలా మనం నిద్రపోవటం వల్ల, మన శరీరానికి చాలా రిలాక్స్ దొరుకుతుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మనలో ఎవ్వరైనా సరే.. ఎప్పుడైనా సరే.. ఎడమవైపునకే తిరిగి పడుకోవాలంట.. అలాగే నిద్ర లేచే సమయంలో కుడివైపునకే తిరిగి నిద్ర లేవాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఉత్తర దిశలో మాత్రం ఎట్టి పరిస్థితిలో తల చేసి నిద్రించకూడదు.

అయితే ఈ నియమాలను ఎందుకు పాటించాలి... మనకిష్టమొచ్చిన భంగిమలో పడుకుంటే ఏం జరుగుతుంది... వాస్తుశాస్త్రం చెప్పిన విధంగా ఎలాంటి ప్రయోజనాలు కలుగతాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

అలాంటి సమయాల్లో మీకు భయమేస్తుందా? అయితే ఈ చిట్కాలు పాటించండి...!

కుడివైపున నిద్రించకూడదు..

కుడివైపున నిద్రించకూడదు..

మనలో చాలా మంది కుడివైపునకు తిరిగి నిద్రపోతుంటారు. అయితే అలా ఎప్పటికీ చేయకూడదట. వాస్తుశాస్త్రం ప్రకారం కుడివైపునకు తిరిగి నిద్రిస్తే మనం తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాక ముందే జఠకోశం నుండి చిన్నపేగులలోకి బలవంతంగా ప్రవేశించే అవకాశం ఉంది. దీని వల్ల కడుపులో వికారం కలిగే అవకాశం ఉంది.

ఎడమవైపే నిద్రించాలి..

ఎడమవైపే నిద్రించాలి..

వాస్తు శాస్త్రం ప్రకారం ఎప్పుడైనా సరే ఎడమవైపునకు తిరిగే నిద్రించాలి. ఇలా నిద్రించడం వల్ల శరీరంలోని కొన్ని భాగాలు విశ్రాంతి లేకుండా పని చేస్తాయి. అందులో అతి ముఖ్యమైనది మన గుండె.

నిద్ర లేచేసమయంలో..

నిద్ర లేచేసమయంలో..

అయితే మనం నిద్రలో నుండి లేచేటప్పుడు మాత్రం కుడివైపునకు తిరిగి లేవాలి. ఎందుకంటే ఎడమవైపు తిరిగి పడుకుని ఉంటాం కాబట్టి, ఆ సమయంలో ఎడమవైపు ఉన్న గుండెపై కొంచెం భారం ఎక్కువగా ఉంటుంది. అలాగే లేస్తే గుండె తన శక్తిని కోల్పోయి బలహీనమయ్యే అవకాశం ఉంది. అందుకే కుడివైపునకు తిరిగి నిద్ర లేవాలి.

‘బతుకమ్మ'ఈ ఏడాది ఎందుకని ఆలస్యమైంది? ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా...

ఉత్తర దిశలో తలపెట్టొద్దు...

ఉత్తర దిశలో తలపెట్టొద్దు...

ఈ విషయం చాలా మందికే తెలిసే ఉంటుంది. మన పెద్దలు, పండితులతో పాటు శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మనం ఉత్తర దిశలో తల చేసి ఎందుకు నిద్రించకూడదంటే.. భూమిపై ఉండే అయస్కాంత క్షేత్రాల ప్రభావం వల్ల, మన మెదడును ఆ శక్తి ఆకర్షిస్తుందట. దాని వల్ల మన మెదడుపై ఒత్తిడి పెరిగిపోతుంది.

నిద్ర లేస్తూనే ఆందోళన...

నిద్ర లేస్తూనే ఆందోళన...

ఒకవేళ ఆరోగ్యంగా ఉండేవారు ఇలా చేస్తే పెద్ద ప్రమాదం ఉండదు.. అయితే వారు నిద్ర లేచే సమయంలో చాలా ఆందోళనగా కనిపిస్తారు. అలాగే కొంతమంది ఉత్తరదిక్కున తలపెట్టి నిద్రిస్తే మరణిస్తారని చెబుతుంటారు. అయితే అందులో నిజం లేదు. కానీ ఆ వైపున తలపెట్టి నిద్రించడం వల్ల ప్రమాదం బారిన పడే అవకాశం ఉంటుంది కానీ, చనిపోయే అవకాశం అయితే లేదు.

తూర్పు, ఈశాన్యం..

తూర్పు, ఈశాన్యం..

వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలో మరియు ఈశాన్యం దిశలో తల పెట్టి పడుకుంటే మంచిగానే ఉంటుంది. పడమర వైపున తల చేసినప్పటికీ ఏమి పర్వాలేదు. ఇక అన్నింటికంటే ఉత్తమం దక్షిణం వైపు తల చేయడం. అందులోనూ మన భారతదేశం ఉత్తరార్థ గోళంలో ఉన్నందున ఉత్తరదిశగా తల చేయకుండా మిగిలిన ఏ మూడు దిశల్లో తల చేయాలని పెద్దలు చెబుతుంటారు.

2020లో అధిక మాసం ఎప్పుడొచ్చింది.. ఈ మాసంలో శుభకార్యాలు చేయొచ్చా? చేయకూడదా?

ఈ దిశలు అనుకూలం..

ఈ దిశలు అనుకూలం..

అంతేకాదండోయ్ ఆరోగ్యానికి, ప్రశాంతమైన నిద్రకు దక్షిణ దిశ చాలా అనుకూలంగా ఉంటుంది. అదే తూర్పు దిశ వైపు తల చేసి నిద్రించడం వల్ల జ్ణాపకశక్తి, ఏకాగ్రత పెరిగి ఆరోగ్యం చాలా బాగుంటుందని, ఈ దిశలో విద్యార్థులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. అదే పడమర దిశలో తల చేసి నిద్రించడం వల్ల మంచి పేరు, ప్రఖ్యాతలు కూడా వస్తాయంట.

దక్షిణార్థ గోళంలో ఉంటే..

దక్షిణార్థ గోళంలో ఉంటే..

ఒకవేళ దక్షిణార్థ గోళంలో మీరు నివసించే ప్రాంతం లేదా దేశం ఉంటే గనుక మీరు దక్షిణ దిశలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తల చేయకూడదు. ఎందుకంటే ఆ వైపున అప్పుడు గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి.

రోజంతా చురుగ్గా ఉండేందుకు..

రోజంతా చురుగ్గా ఉండేందుకు..

అలాగే మీరు నిద్ర నుండి మేల్కొన్న వెంటనే మీ బాడీ, బ్రెయిన్ యాక్టివ్ కావాలంటే మీరు ఓ పని చేయాలి. మీ రెండు చేతులను గట్టిగా రాపిడి చేయాలి. అప్పుడు కొంచెం వేడిగా అనిపించిన తర్వాత, ఆ చేతులను కళ్లపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల చేతి వేళ్ల చివర్లో ఉండే రక్తనాళాలు చురుగ్గా మారతాయి. దీంతో మీ శరీర వ్యవస్థ సాధారణంగా మారుతుంది.

English summary

Sleeping Direction as per Vaastu: Which position is ideal in telugu

Here are the sleeping direction as per vaastu : Whichi position is ideal in telugu. Take a look.