For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శబరి మల అయ్యప్ప స్వామి స్వర్ణదేవాలయం గురించి కొన్ని రహస్యాలు..

|

శబరిమల లేదా శబరిమలై, కేరళ రాష్ట్రంలోగల ఒక ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప, హిందువులు ఈయనను హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది. కేరళ లోని పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు వస్తుంది. గుడి సముద్ర మట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు మరియు 18 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది. ఇక్కడికి యాత్రలు నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి. ఇక్కడికి దక్షిణాది రాష్ట్రాల భక్తులే కాక ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.

మండల పూజ (నవంబర్ 17), మకరవిళక్కు (జనవరి 14) ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. జనవరి 14 వ రోజును ఆలయంలో మకర జ్యోతి దర్శన మిస్తుంది. మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు. కానీ ప్రతీ మళయాళ నెలలో ఐదు రోజుల పాటు తెరచియుంచుతారు.

ఒకప్పుడు శబరి మల యాత్ర అంటే భయం భయంగా వెళ్లేవారు. ఎప్పుడు ఏ చోట ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఎవరికీ తెలిసేది కాదు. కాని ఇప్పుడు ఈజీగా వెళ్లి వస్తున్నారు . అప్పట్లో శబరి మల వెళ్ళటానికి ఒకే ఒక్క దారి ఉండేది, దాని పేరు ఎరుమేలిమార్గం. ఈ దారిలోనే పూజారులు, సిబ్బంది ఆలయానికి గుంపులు..గుంపులుగా , ఒక్కటిగా వెళ్లే వారట. శబరి మల అడవీ ప్రాంతం అవ్వటం వల్ల అప్పటి నుండి ఇప్పటి వరకూ గ్రూపులుగా వెళ్ళటం అనవాయితీగా వస్తుంది. శబరిమల గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం..

ర్భగుడిలో ఏకశిలా విగ్రహం

ర్భగుడిలో ఏకశిలా విగ్రహం

1907 లో శబరిమల గర్భగుడి పైకప్పు ఎండుగడ్డితో, ఆకులతో కప్పబడివుండేది. అప్పట్లో గర్భగుడిలో ఏకశిలా విగ్రహానికి పూజలు చేసేవారు .

 అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదం

1909లో దేవాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.1950 వరకూ పరుశురామ నిర్మితమైన దేవాలయం మూడు సార్లు అగ్నికి ఆహుతైంది.

సంవత్సర ఆదాయం 7 రూపాయలు

సంవత్సర ఆదాయం 7 రూపాయలు

రెండు వందల సంవత్సరాల క్రితం 70 మంది శబరమల యాత్రకు వెళ్లారని, ఆ సంవత్సర ఆదాయం 7 రూపాయలని రికార్డ్స్ లో పేర్కొనబడినది.

 పున:నిర్మాణం

పున:నిర్మాణం

దేవాలయాన్ని మరలా 1909 -10వ సంవత్సరంలో పున:నిర్మించారని తెలుస్తుంది.

పంచలోహ విగ్రహానికె పూజలు

పంచలోహ విగ్రహానికె పూజలు

1909-10వ సంవత్సరంలో శిలా విగ్రహానికి బదులు, పంచలోహాలతో తయారుచేసిన అయప్ప విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి నుండి పంచలోహ విగ్రహానికె పూజలు చేస్తుండటం గమనార్హం.

మకరజ్యోతి దర్శనానికే

మకరజ్యోతి దర్శనానికే

1935 తర్వాత భక్తుల సంఖ్య గణనీయంగా పెరగటంతో మకరజ్యోతి దర్శనానికే కాకుండా మండల పూజ కొరకు కూడా భక్తులను లోనికి ఆహ్వానించారు.

చాలక్యాయ మార్గం, వడిపెరియారు మార్గం

చాలక్యాయ మార్గం, వడిపెరియారు మార్గం

చాలక్యాయ మార్గం, వడిపెరియారు మార్గం ఏర్పడటంతో శబరిమల యాత్రకు వచ్చే వారి సంఖ్య మరింత పెరిగింది.

పంకుని ఉత్తారం, ఓనం వంటి పండుగల సమయాలలో కూడా ఆలయ ద్వారాలు తెరచి ఉంచేటట్లు

పంకుని ఉత్తారం, ఓనం వంటి పండుగల సమయాలలో కూడా ఆలయ ద్వారాలు తెరచి ఉంచేటట్లు

1946వ సంవత్సరంలో ఆలయ బోర్డు , కేవలం మకరజ్యోతి సమయంలోనే కాక విషు, పంకుని ఉత్తారం, ఓనం వంటి పండుగల సమయాలలో కూడా ఆలయ ద్వారాలు తెరచి ఉంచేటట్లు తీర్మానించింది.

దపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రతి ష్టించారు.

దపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రతి ష్టించారు.

1951లో పంచలోహ విగ్రహాన్ని చెంగనూరు నుండి తెప్పించి వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రతి ష్టించారు. అప్పటి వరకూ కేరళీ కేళీ విగ్రహంగా కీర్తించబడ్డ అయ్యప్ప స్వామి భారతీకాళీ విగ్రహంగా, నేడు భూతళీకేళీ విగ్రహింగా కీర్తించబడుతున్నది.

రాతిమెట్లనే వాడే వారు.

రాతిమెట్లనే వాడే వారు.

1984కు పూర్వం పదునెట్టాంబడి ఎక్కటానికి భక్తులు పరుశురామ నిర్మితమైన రాతిమెట్లనే వాడే వారు. మెట్లను ఎక్కేటప్పుడు ప్రతి మెట్లుపై కొబ్బరి కాయను కొట్టేవారు. దాంతో భక్తులు మెట్లు ఎక్కటానికి ఇబ్బంది పడే వారు. ఇది గుర్తించి బోర్డు వారు 1985 పదునెట్టాంబడికి పంచలోహ కవచాన్ని మంత్రతంత్రాలతో కప్పేశారు.

 గర్భగుడి పైన, దాని చుట్టూ బంగారు రేకులతో తాపడం

గర్భగుడి పైన, దాని చుట్టూ బంగారు రేకులతో తాపడం

2000వ సంవత్సరంలో బెంగళూరు భక్తుడు ఒకాయన గర్భగుడి పైన, దాని చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయటానికి పూనుకోవడంతో శబరిమల స్వర్ణదేవాలయంగా మారిపోయింది.

స్వామి వారి ఆభరణాలు

స్వామి వారి ఆభరణాలు

స్వామి వారి ఆభరణాలను పందళంలో భద్రపరిచి ఉంచుతారు.

ప్రతి ఏటా మకరసంక్రాంతి తారీఖున మూడు పెట్టలలో భద్రపరిచిన ఆ ఆభరణాలను 11 మంది మూడు రోజుల పాటు మోసుకుంటూ వచ్చి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న శబరిమల చేరవేస్తారు.

మకరజ్యోతి దర్శనం

మకరజ్యోతి దర్శనం

తెచ్చిన ఆభరణాలను స్వామి వారికి అలంకరించి, కర్పూరహారతి గుళ్లో ఇవ్వగానే తూర్పుదిక్కు పోన్నంబలమేడు నుండి భక్తులకు మకరజ్యోతి దర్శనం కానవస్తుంది.

పందళం రాజ వంశస్థులలో ఒకరు

పందళం రాజ వంశస్థులలో ఒకరు

ఆభరణాల వెంట పందళం రాజ వంశస్థులలో ఒకరు (పెద్దవాడు) కత్తి పట్టుకుంటూ నీలిమల వరకూ వచ్చి అక్క విశ్రమిస్తాడు. తిరిగి జనవరి 20వ తేదీన ఆభరణాలను వెంట పందళం వరకూ వెళ్లి వాటిని చేరవేస్తాడు.

English summary

Some unknown facts about Sabarimala..!

Sabarimala is one of the diving Hindu Pilgrimage centre which is situated at Western Ghat mountain ranges of Pathanamthitta District. Each year more than 50 Million devotees are visiting this temple and they believe that this is the place where God Ayyappan meditated after killing the powerful demoness Mahishi.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more