For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహా శివరాత్రికి సంబంధించిన కథలు

|

మహా శివరాత్రి, పరమ శివుడిని ఆరాధించే అతి ముఖ్యమైన పండుగలలో ప్రధమమైనదిగా ఉంటుంది. ఫాల్గుణ మాసం (ఫిబ్రవరి లేదా మార్చి మాసాలు) లో వచ్చే కృష్ణ పక్షం 14వ రోజున మహా శివరాత్రి వస్తుంది. క్రమంగా ఈ సంవత్సరం మహా శివ రాత్రి, మార్చి v4, సోమ వారం నాడు రానుంది. మహా శివరాత్రి నాడు పరమ శివుడిని ఆరాధించడం ద్వారా, అజ్ఞానాంధకారాలను పారద్రోలి, జ్ఞానోదయాన్నిపొందేలా ఆశీర్వదించబడుతారని చెప్పబడింది. అంతేకాకుండా విశ్వంలో సర్వోత్కృష్టమైన శక్తిని అర్ధం చేసుకునేందుకు దోహదపడుతుందని భక్తుల విశ్వాసం.

ఈ సందర్భంగా, మహా శివరాత్రితో ముడిపడి ఉన్న కొన్ని ముఖ్యమైన మరియు ప్రచారంలో ఉన్న ఆధ్యాత్మిక కథలను ఇక్కడ పొందుపరచడం జరిగింది. భారత దేశంలోని అనేక పండుగలు, వాటితో ముడిపడి ఉన్న కథలు, గాధలు అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. అందులో మహా శివరాత్రి పండుగ కూడా ఏ మాత్రం మినహాయింపు కాదు. ప్రజల విశ్వాసాల ప్రకారం, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి స్వల్ప తేడాలతో ఈ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. క్రమంగా మహా శివరాత్రికి సంబంధించిన అనేక కథలు కూడా మనుగడలో ఉన్నాయి. మహా శివరాత్రి వెనుక ఉన్న కథలు మాత్రమే కాకుండా, ప్రజల విశ్వాసాలను అనుసరించి, వారి పండుగలో కూడా స్వల్ప తేడాలతో భిన్న పోకడలు కనిపిస్తుంటాయి.

Maha Shivratri

క్షీర సాగర మదనం కథ :

ఒకప్పుడు, దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీర సాగర మదనానికి పూనుకున్నారు. క్రమంగా పరమ శివుని మెడలో పాముగా ఉన్న వాసుకిని తాడుగా, మేరు (మంధర పర్వతమని కూడా చెప్పబడుతుంది) పర్వతాన్ని కవ్వంలా మలచి క్షీర సాగరాన్ని చిలకడానికి నిర్ణయించారు. వాసుకి తలభాగం రాక్షసులకు చేరగా, తోకభాగాన్ని దేవతలు పట్టి చిలకనారంభించారు. క్రమంగా క్షీర సాగరం నుండి కామధేనువు నుండి, అమృత బాండం వరకు అనేకములు జనించాయి. కూర్మావతారంలో ఉన్న విష్ణు మూర్తి సహకారంతో పర్వతం సముద్రంలో నిలబడగలిగింది.

కానీ, రాక్షసుల పట్టు క్రూరంగా ఉన్న కారణాన, వాసుకి నోట కాలకూట హాలాహల విషం ఉద్భవించింది. క్రమంగా ప్రపంచమంతా ఆ విషానికి అల్లకల్లోలం కావడం ప్రారంభించింది. అప్పుడు దేవతలందరూ పరమ శివుని శరణు వేడుకోగా, పరమ శివుడు ఆ విషాన్ని సేవించనారంభించాడు. విష్ణుమూర్తి సహాయంతో గొంతు దిగకుండా విషాన్ని కంఠంలోనే ఆపగలిగాడు శివుడు. క్రమంగా పరమేశ్వరుని కంఠం నీలి రంగులోకి మారిపోయిన కారణంగా, నీలకంఠునిగా మరియు గరళాన్ని మింగినందుకు ప్రతీకగా గరళ కంఠునిగా పిలవడం జరుగుతుంటుంది. కానీ ఆ విష ప్రభావం కారణంగా శివునిలో విపరీతమైన తాపాన్ని, వేడిని పుట్టించాయి. ఆ ప్రతికూలతలను తగ్గించే క్రమంలో భాగంగా చంద్రుని మరియు గంగాదేవిని తలమీద ఉంచుకున్నాడని చెప్పబడుతుంది. యాదృచ్చికంగా ఒకనాడు గంగాదేవి, భగీరధుని ప్రయత్నం కారణంగా శివుని జడలో చిక్కుకుంది అని మనందరికీ తెలుసు.

అంతేకాకుండా శివుని తాపం తగ్గించే క్రమంలో భాగంగా భక్తులు శివునికి తరచుగా ఉదకాభిషేకం చేస్తుంటారు కూడా. క్రమంగా ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని, మహా శివరాత్రి రోజున భారతదేశ వ్యాప్తంగా హిందువులు ఉపవాసాలు చేస్తూ, రాత్రంతా జాగారం చేస్తూ మెలకువగా ఉంటారు.

Maha Shivratri

బ్రహ్మ దేవుడు మరియు విష్ణు భగవానుని కథ :

బ్రహ్మ దేవుడు మరియు విష్ణు భగవానుల మధ్య., విశ్వంలోనే అత్యంత పరాక్రమము కలిగిన వారు ఎవరు ? అన్న ప్రశ్న జనించింది. క్రమంగా ఆ వాదన తీవ్రత పెరిగి, దేవతలు శివుని జోక్యాన్ని కోరుకున్నారు.

శివుడు భారీ అగ్ని పుంజం వలె వెలుగుతూ ప్రకాశిస్తూ ప్రత్యక్షమయ్యాడు. ఆ కాంతి పుంజం అనంతమైనదిగా కనిపిస్తూ మిగిలిన దేవతలందరినీ నిశ్చేష్టులను చేసింది. బ్రహ్మ మరియు విష్ణువులిద్దరిలో, ఆ కాంతి పుంజం చివరలను ఎవరైతే ముందుగా కనుగొంటారో వారే అత్యంత శక్తివంతులుగా ప్రకటించాలని దేవతలు నిర్ణయించారు. బ్రహ్మ దేవుడు హంస రూపాన్ని ధరించి ఆకాశం వైపుకు దూసుకుని వెళ్ళాడు. అదేక్రమంలో భాగంగా విష్ణువు వరాహావతారాన్ని ధరించి, భూగర్భంలోనికి మార్గం చేసుకుంటూ చొచ్చుకుని పోయాడు. ఎంతసేపటికీ వారిరువురికీ ఆ కాంతి పుంజం చివరలు దొరకలేదు.

బ్రహ్మ దేవుడు పైకి వెళ్తుండగా ఒక చోట, కేతకి పుష్పాన్ని చూశాడు. ఆ పుష్పం, బ్రహ్మ దేవునికి., తాను ఆ కాంతి పుంజం మొదలు భాగం నుండి జనించినట్లుగా తెలిపింది. వెంటనే ఆ కేతకి పుష్పాన్ని తిరిగి యదాస్థానానికి తీసుకుని వచ్చి, దేవతలకు పుష్పాన్ని సమర్పించి వివరించాడు. క్రమంగా విష్ణుమూర్తి తన ఓటమిని అంగీకరించాడు. కానీ, ఈ తతంగమంతా శివునికి కోపం తెప్పించింది. ఆ ఆవేశంలో బ్రహ్మ దేవుడు ఎన్నటికీ పూజింపబడడు అని, మరియు కేతకి పుష్పాన్ని పూజకు వినియోగించకూడదని శపించాడు. ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్షం, 14 వ రోజున శివుడు ఇలా కాంతి పుంజం వలె కనిపించాడని నమ్మబడింది. ఆ విధంగా అప్పటి నుండి మహా శివరాత్రిని, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం 14 రోజున జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని చెప్పబడింది.

Maha Shivratri

ఇది ఒక గిరిజన వ్యక్తి కథ :

ఒక గిరిజన వ్యక్తి, ఒకసారి ఒక అడవిలోకి కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు. అలా కట్టెలు కొడుతూ, కొడుతూ అడవిలో చాలా దూరం వెళ్ళిపోయి, తాను వచ్చిన దారిని సైతం మర్చిపోయాడు. క్రమంగా ఆహరం కోసం సంచరిస్తున్న, జంతువుల అరుపులు వినిపించడం మొదలుపెట్టాయి. భయపడిన ఆ గిరిజనుడు ఒక చెట్టు పైకి ఎక్కి బిక్కుబిక్కుమంటూ చుట్టుపక్కల చూస్తూ ఉన్నాడు. సమయం గడుస్తున్న కొద్దీ అతనికి నిద్ర కలగడం మొదలయింది. తాను నిద్రలోకి జారుకుంటే, నేల మీద పడిపోవచ్చునన్న భయం మొదలైంది. క్రమంగా, ఆ చెట్టు ఆకులను కోస్తూ, నిద్ర పోకుండా ఉండేందుకు వాటిని లెక్కపెట్టడం మొదలు పెట్టాడు. అయితే ఒక సింహం ఆ వ్యక్తిని చూసి అతని వైపు వచ్చింది. ఆ పరిస్థితికి, ఆ గిరిజనుడు భయం భయంగా ఏడవడం మొదలు పెట్టాడు. ప్రాణభయంతో కళ్ళు మూసుకుని, చివరి ఘడియల కోసం ఎదురుచూడనారంభించాడు. కాని కొంత సేపు ఏమీ జరగకపోయేసరికి, కళ్ళు తెరచి చూడగా ఆశ్చర్యకరంగా అక్కడి నుండి సింహం వెళ్ళిపోయిందని తెలుసుకున్నాడు. ఆహరంగా నన్ను చూసి కూడా సింహం ఎందుకు వెళ్ళిపోయింది., అసలు ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ తిరిగి భయాన్ని పోగొట్టుకునేందుకు మరలా ఆ చెట్టు ఆకులను కోస్తూ, తిరిగి లెక్కను కొనసాగించాడు. క్రమంగా ఆ రాత్రంతా ఎటువంటి ప్రమాదం లేకుండా, భయం లేకుండా ఉండగలిగాడు. అంతేకాకుండా ఆ ఆకులు పూర్తిగా వెయ్యి ఆకులుగా లెక్కగట్టాడు. మరునాడు ఉదయం, అతను చెట్టు కిందకి దిగి చూడగా, తాను ఎక్కిన చెట్టును బిల్వ వృక్షంగా గమనించాడు. మరియు చెట్టు క్రింద ఒక శివ లింగం ఆకులతో నిండిపోయి ఉండడాన్ని గమనించాడు. శివ లింగం మీద ఒక్కొక్కటిగా వేయి బిల్వ వృక్షపు ఆకులు అభిషేకంలా పడ్డాయని అర్ధం చేసుకున్నాడు. అప్పుడు వెంటనే శివుడి ప్రత్యక్షమై, ఆ గిరిజనునికి మంచి సంపదను, ఆయురారోగ్యాలను కల్పించాడని ప్రతీతి. ఆ సింహం తనకు ఎలాంటి హాని కలుగజేయకుండా, ఉండేందుకు పరోక్షంగా శివుడు చేసిన సహాయాన్ని తెలుసుకున్నాడు. క్రమంగా ఆరోజు నుండి ప్రతి సంవత్సరం మహా శివరాత్రి నాడు, ఉపవాసం మరియు నిద్రను త్యజించి జాగారం జరుపుకోవడం ద్వారా శివుని పూజించడం జరుగుతూ ఉందని కథనం. అప్పటి నుండి బిల్వ వృక్షాన్ని కూడా పూజలో భాగం చేయడం జరిగిందని చెబుతుంటారు.

పరమేశ్వరుని ప్రదానాలయాలలో కొన్ని :

మహా శివరాత్రి రోజు ప్రధానంగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలైన రామనాథస్వామి లింగము - రామేశ్వరము, శ్రీశైల మల్లికార్జున క్షేత్రము - శ్రీశైలము, భీమశంకర లింగము - భీమ శంకరం, ఘృష్ణేశ్వర లింగం - ఘృష్ణేశ్వరం, త్రయంబకేశ్వర లింగం - త్రయంబకేశ్వరం, నాసిక్, సోమనాథ లింగము - సోమనాథ్, నాగేశ్వర లింగం - ద్వారక, ఓంకారేశ్వర-అమలేశ్వర లింగములు - ఓంకారక్షేత్రం, మహాకాళేశ్వర లింగం - ఉజ్జయని, వైధ్యనాథ లింగం - చితా భూమి- దేవఘర్, విశ్వేశ్వర లింగం - వారణాశి, కేదారేశ్వర - కేదారనాథ్ వంటి ప్రధాన ఆలయాల నుండి పరమేశ్వరుడు అతని కుటుంబానికి సంబంధించిన దేవుళ్ళ దేవాలయాలు మరియు శక్తి పీఠాలు కూడా భక్తులతో కిక్కిరిసిపోయి ఉంటుంది. మన రాష్ట్రంలోకూడా అటువంటి ప్రధాన శివాలయాలలో శ్రీ కాళహస్తి, కోటప్ప కొండ, వంటివి ప్రాముఖ్యతను సంతరించుకుని ఉన్నాయి. వీటితో పాటుగా పంచారామాలు కూడా ప్రసిద్ది చెందినవిగా ఉన్నాయి. అవి వరుసగా అమరారామం, ద్రాక్షారామం, క్షీరారామం, కుమారరామం, భీమారామం. కొందరు ఒక సంవత్సరంలో జ్యోతిర్లింగాల దర్శనం, మరొక మారు పంచారామాల సందర్శనం అంటూ తీర్ధయాత్రలకు పూనుకోవడం మనం తరచుగా చూస్తూ ఉంటాం కూడా.

Maha Shivratri

జ్యోతిర్లింగ స్తోత్రం :

సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రీశైలే మల్లిఖార్జునమ్

ఉజ్జయిన్యాం మహాకాళమ్, ఓంకారమమరేశ్వరమ్

ప్రజ్వాల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరమ్

సేతుబంధేతు రామేశం, నాగేశం దారుకావనే

వారాణస్యాంతు విశ్వేశం, త్రయంబకం గౌతమీతటే

హిమాలయేతు కేదారం, ఘృష్ణేశంచ శివాలయే

ఏతాని జ్యోతిర్లింగాని సాయంప్రాతః పఠేన్నరః

సప్తజన్మకృతంపాపం స్మరణేన వినశ్యతి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, సౌందర్య, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, మాతృత్వ, శిశు సంబంధ, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Stories Associated With Maha Shivratri

Read to know the different stories associated with the celebration of the Maha Shivratri festival.Maha Shivratri 2019 will be observed on 4 March.Read more.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more